ETV Bharat / sports

'కోహ్లీ వెంటనే సచిన్​కు ఫోన్ చేయాలి ' - క్రికెట్ న్యూస్ లేటెస్ట్

తన బ్యాటింగ్​లో లోపాన్ని సరిచేసుకునేందుకు విరాట్, దిగ్గజ క్రికెటర్​ సచిన్​కు(Sachin tendulkar) తక్షణమే ఫోన్ చేయాలని సునీల్ గావస్కర్(sunil gavaskar) సూచించాడు. గత కొన్నాళ్లుగా బ్యాటింగ్​లో తడబడుతున్న కోహ్లీ.. ఇంగ్లాండ్​తో మూడో టెస్టులోనూ తక్కువ పరుగులకే ఔటయ్యాడు.

Virat Kohli should call Sachin Tendulkar
కోహ్లీ
author img

By

Published : Aug 26, 2021, 2:00 PM IST

టీమ్‌ఇండియా(Team India) సారథి విరాట్‌ కోహ్లీ(Virat Kohli) వెంటనే సచిన్‌ తెందూల్కర్‌కు ఫోన్‌ చేయాలని క్రికెట్‌ దిగ్గజం సునీల్‌ గావస్కర్‌ అంటున్నారు. తన బ్యాటింగ్‌ టెక్నిక్​లోని లోపానికి పరిష్కారం అడిగితే మేలని సూచించాడు. ఆఫ్‌స్టంప్‌ ఆవల ఐదు, ఆరు, ఏడో స్టంప్‌ లైన్‌లో అతడు ఔటవ్వడం ఆందోళన కలిగిస్తోందని వెల్లడించాడు. మూడో టెస్టు తొలి రోజు తర్వాత ఆయన పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

ఇంగ్లాండ్‌తో మూడో టెస్టులో టీమ్‌ఇండియా పేలవంగా ఆడుతోంది. బ్యాట్స్‌మెన్‌ వరుసగా పెవిలియన్‌ చేరడం వల్ల కేవలం 78 పరుగులకే తొలి ఇన్నింగ్స్‌లో ఆలౌటైంది. ఈ మ్యాచులోనైనా భారీ స్కోరు చేస్తాడని ఆశించిన విరాట్‌ కోహ్లీ 7 పరుగులే చేసి అండర్సన్‌(Anderson) బౌలింగ్‌లో ఔటయ్యాడు. టెస్టు కెరీర్లో అతడు జిమ్మీకి వికెట్‌ ఇవ్వడం ఇది ఏడోసారి. గతంలో లైయన్ బౌలింగ్‌లోనూ ఏడుసార్లు ఔటయ్యాడు. ఆఫ్‌సైడ్‌ నాలుగు, ఐదో స్టంప్‌లైన్‌లో వెళ్తున్న బంతులకు అతడు ఔటవుతున్నాడు.

sachin sunil gavaskar
సచిన్​తో సునీల్ గావస్కర్

'విరాట్‌ కోహ్లీ వెంటనే సచిన్‌ తెందూల్కర్‌కు ఫోన్‌ చేయాలి. ఏం చేస్తే మంచిదో అతడిని అడగాలి. నాకిది ఆందోళన కలిగిస్తోంది. ఎందుకంటే అతడు ఐదు, ఆరు, ఏడో స్టంప్‌లైన్‌ బంతులకు ఔటవుతున్నాడు. 2014లో అతడు కేవలం ఆఫ్‌స్టంప్‌ మీదుగా వెళ్లే బంతులకు మాత్రమే ఔటయ్యేవాడు' అని సన్నీ అన్నాడు.

2003-04లో సిడ్నీ టెస్టులో(Sydney Test) సచిన్‌ అనుసరించిన విధానాన్నే కోహ్లీ పాటిస్తే మేలని సన్నీ అభిప్రాయపడుతున్నాడు. 'సిడ్నీ టెస్టులో సచిన్‌ ఏం చేశాడో విరాట్‌ దానినే అనుసరిస్తే మంచిది. నేనిక కవర్‌డ్రైవ్‌ ఆడబోను అని తనకు తానే చెప్పుకోవాలి' అని పేర్కొన్నాడు. అవుట్‌ స్వింగయ్యే బంతులకు బహుశా ఇలా చేయడమే మంచిదని అభిమానులూ కోరుకుంటున్నారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.