ETV Bharat / sports

Kohli: కొత్త ఉత్సాహంతో సిద్ధంగా ఉన్నాం - ప్రపంచ టెస్ట్​ ఛాంపియన్​షిప్​ రెండో ఎడిషన్

ప్రపంచ టెస్టు ఛాంపియన్​షిప్​ రెండో ఎడిషన్(WTC Second Edition) కోసం నూతన ఉత్తేజంతో ఎదురుచూస్తున్నట్లు తెలిపాడు టీమ్ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ(Virat Kohli). ఈ సీజన్​లో అభిమానులకు కావాల్సినంత వినోదం అందించేందుకు తమ జట్టు సిద్ధంగా ఉందని పేర్కొన్నాడు.

india vs england, wtc-2
ఇండియా vs ఇంగ్లాండ్, డబ్ల్యూటీసీ-2
author img

By

Published : Jul 14, 2021, 2:22 PM IST

ప్రపంచ టెస్టు ఛాంపియన్​షిప్​ రెండో సీజన్(WTC Second Edition)​పై టీమ్ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ(Virat Kohli) స్పందించాడు. ఈ ఎడిషన్​లో అభిమానులకు కావాల్సినంత ఉత్సాహాన్ని భారత జట్టు అందిస్తుందని తెలిపాడు. ఈ సీజన్​ కోసం తమ టీమ్​​ నూతన శక్తితో ఎదురుచూస్తుందని పేర్కొన్నాడు.

"డబ్ల్యూటీసీ ఆరంభ ఎడిషన్​లోనే ఫైనల్​ చేరుకోవడం ఆనందానిచ్చింది. అందులోనూ కివీస్​ వంటి బలమైన జట్టుతో పోటీపడటం గొప్ప విషయం. ఒక్క ఫైనల్లోనే కాదు. ఛాంపియన్​షిప్ మొత్తంలోనూ ఆటగాళ్లు దృఢ సంకల్పాన్ని ప్రదర్శించారు. తదుపరి సీజన్ కోసం ఆటగాళ్లతో పాటు అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సీజన్​ కోసం కొత్త శక్తితో ఉన్నాం. అభిమానులకు కావాల్సినంత వినోదం పంచడానికి సిద్ధం."

-విరాట్ కోహ్లీ, టీమ్ఇండియా కెప్టెన్.

భారత్​-ఇంగ్లాండ్ మధ్య ఆగస్టు 4 నుంచి ప్రారంభం కానున్న తొలి టెస్టుతో డబ్ల్యూటీసీ రెండో ఎడిషన్​ ప్రారంభమవుతుంది. ఛాంపియన్​షిప్ తొలి ఎడిషన్ ఫైనల్​​ సౌథాంప్టన్ వేదికగా టీమ్ఇండియా-న్యూజిలాండ్ మధ్య జరిగింది. ఈ మ్యాచ్​లో కివీస్​ జట్టు 8 వికెట్ల తేడాతో గెలుపొందింది. పరాభవంతో కోహ్లీ సేన రన్నరప్​గా నిలిచింది.

ఇటీవల భారత పర్యటనలో కోహ్లీ సేనతో టెస్టు సిరీస్​ను 3-1తో కోల్పోయింది ఇంగ్లాండ్​ జట్టు. దీంతో డబ్ల్యూటీసీ ఫైనల్​కు చేరే అవకాశాన్ని ఆ టీమ్​ చేజార్చుకుంది. ఇప్పుడు అదే టీమ్ఇండియాతో రెండో ఎడిషన్​ను రూట్​ సేన ప్రారంభించనుంది.

ఇదీ చదవండి: MS Dhoni: స్నేహితులతో ధోనీ.. ఫొటో వైరల్​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.