ETV Bharat / sports

'కష్ట సమయాల్లో అండగా నిలిచింది ధోనీ ఒక్కడే.. అతడు పంపిన మెసేజ్ ఎప్పటికీ..' - టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కొహ్లీ న్యూస్

తన కెరీర్​లో కఠిన పరిస్థితులు ఎదుర్కొంటున్నప్పుడు ధోనీ  ఒక్కడే అండగా నిలిచాడని భారత్​ క్రికెట్​ జట్టు స్టార్​ బ్యాటర్​ విరాట్​ కోహ్లీ తెలిపాడు. ఆర్​సీబీ పాడ్​కాస్ట్​లో మాట్లాడిన అతడు.. పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు. అవి అతడి మాటల్లోనే..

dhoni message to virat kohli news
విరాట్​కు ధోనీ మెసెజ్
author img

By

Published : Feb 25, 2023, 12:33 PM IST

ప్రతిష్ఠాత్మక బోర్డర్​ గావస్కర్​ ట్రోఫీ ఆడుతున్న టీమ్​ఇండియా మాజీ సారథి విరాట్​ కోహ్లీ.. ప్రస్తుతం బ్రేక్​లో ఉన్నాడు. తాజాగా ఆర్​సీబీ పోడ్​కాస్ట్​లో మాట్లాడాడు. తన కెరీర్​కు సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు. తన కెరీర్​లో కఠిన పరిస్థితులు ఎదుర్కొంటున్నప్పుడు ధోనీ ఒక్కడే అండగా నిలిచాడని మరోసారి చెప్పుకొచ్చాడు.

"నా కెరీర్‌లో ఇప్పటికే భిన్నమైన దశలను ఎదుర్కొన్నాను. ఐపీఎల్ 2022 సమయంలో నేను విషమ దశను అనుభవించాను. ఆ సమయంలో ధోనీ ఒక్కడే నాకు అండగా నిలిచాడు. ధోనీ స్వచ్చమైన ప్రేమ, అతడితో అనుబంధం నాకు దక్కడం అదృష్టంగా భావిస్తున్నాను. ధోనీ నాకు ఎప్పుడూ అండగా ఉంటాడు. గతేడాది ధోనీ నాకు పంపిన మెసేజ్ ఎప్పటికీ మరిచిపోలేను. నేనేం చెప్పకపోయినా నేను ఏ స్థితిలో ఉన్నానో.. ఎలాంటి మానసిక సమస్యలతో అనుభవిస్తున్నానో ధోనీ అర్థం చేసుకున్నాడు. 'నువ్వు ఎప్పుడైతే బలంగా ఉండాలని అనుకుంటావో అప్పుడు నిన్ను నీవు దృఢమైన వ్యక్తిగా చూడు. అప్పుడు నీ చుట్టూ ఉన్నవాళ్లు నువ్వు ఎలా ఉన్నావని అడగడం కూడా మరిచిపోతారు'అని సందేశం పంపించాడు. ధోనీ పంపిన ఆ మెసేజ్, ఆ మాటలు, నాకు నా ఇంట్లోవాళ్లు చెప్పినట్టే అనిపించాయి. అతను చాలా బలమైన వ్యక్తి. ధోనీ కెప్టెన్సీలో కానీ.. నా కెప్టెన్సీలో కానీ మేం ఇద్దరం అసౌకర్యానికి గురైన సందర్భం లేదు" అంటూ కోహ్లీ చెప్పుకొచ్చాడు.

"2018 ఇంగ్లాండ్ పర్యటనలో తొలి టెస్ట్ తొలి ఇన్నింగ్స్ ప్రారంభానికి ముందు 2014 నాటి ఘటనలు గుర్తుకొచ్చాయి. నేను బ్యాటింగ్‌కు వెళ్లినప్పుడు అభిమానులు నాపై విమర్శలు గుప్పించారు. ఆ ఇన్నింగ్స్‌లో 149 పరుగులు చేసిన తర్వాత డిఫరెంట్ ఫీలింగ్ కలిగింది. ఆ ఇన్నింగ్స్‌తో నేను, అనుష్క భావోద్వేగానికి గురవ్వడంతో పాటు సంతోషానికి గురయ్యాం. ఇక మా నాన్న అకాల మరణం నా కెరీర్‌పై సీరియస్‌గా ఫోకస్ పెట్టే ప్రేరణ ఇచ్చింది. ఆయన కలను నెరవేర్చాలనే కసి పెరిగింది" అని కోహ్లీ తెలిపాడు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.