ETV Bharat / sports

100వ టెస్టుకు కెప్టెన్సీ ఆఫర్​.. తిరస్కరించిన కోహ్లీ! - virat kohli test captaincy

Virat Kohli: టీమ్​ఇండియా టెస్టు కెప్టెన్సీకి గుడ్​బై చెప్పి ఎందరినో షాక్​కు గురిచేశాడు కోహ్లీ. అయితే అతడికి కెప్టెన్​గా ఫేర్​వెల్​ మ్యాచ్​ ఏర్పాటు చేస్తామని బీసీసీఐ సీనియర్ అధికారి ఆఫర్​ చేసినట్లు సమాచారం. దీనిని విరాట్ తిరస్కరించాడట.

Virat Kohli
విరాట్ కోహ్లీ
author img

By

Published : Jan 17, 2022, 1:49 PM IST

Virat Kohli: కెప్టెన్​గా వీడ్కోలు పలకడానికి ముందు బీసీసీఐ విరాట్ కోహ్లీకి ఓ ఆఫర్ ఇచ్చింది. తన 100వ టెస్టుకు కెప్టెన్​గా వ్యవహరించాలని విరాట్​కు ఆఫర్​ వచ్చినట్లు తెలుస్తోంది. దక్షిణాఫ్రికాతో సిరీస్​ కోల్పోయిన తర్వాత టెస్టు కెప్టెన్​గా వైదొలుగుతున్నట్లు ప్రకటించాడు కోహ్లీ. ఈ విషయంపై ఓ సీనియర్​ బీసీసీఐ అధికారితో శుక్రవారం ఫోన్​లో మాట్లాడాడు కోహ్లీ. ఆ సమయంలో కోహ్లీకి కెప్టెన్​గా బెంగళూరులో ఒక ఫేర్​వెల్​ మ్యాచ్​ను ఆయన ఆఫర్​ చేసినట్లు సమాచారం. ఐపీఎల్​లో ఆర్​సీబీకి ప్రాతినిధ్యం వహిస్తున్న కారణంగా.. బెంగళూరు అతడికి సెకండ్​ హోమ్​గా ఉంది. సుదీర్ఘ ఫార్మాట్​లో అతడి సేవలకు గానూ అదే అతడికి సారథిగా సరైన ముగింపు అయ్యుండేది! అయితే ఈ ఆఫర్​ను కోహ్లీ తిరస్కరించాడట.

"ఒక్క మ్యాచ్​తో ఏమీ మారదు. నేను అలాంటివి కోరుకునేవాడిని కాదు." అని విరాట్ కోహ్లీ బదులిచ్చినట్లు సమాచారం. దీంతో సిరీస్​ ఓటమితో సారథ్యానికి అతడు స్వస్తి చెప్పినట్లు అయ్యింది. బ్యాటింగ్​పై దృష్టిసారించేందుకు తనపై ఉన్న ఉన్న ఒత్తిడి, బాధ్యతలను వదులుకోవాలని అతడు భావిస్తున్నట్లు తెలుస్తోంది.

ఇప్పటివరకు 99 టెస్టులు ఆడిన కోహ్లీ.. 68 మ్యాచుల్లో టీమ్‌ఇండియాకు సారథ్యం వహించాడు. అందులో 40 సార్లు గెలిపించాడు. కేవలం 17 మ్యాచుల్లోనే ఓటమి పాలయ్యాడు. టీమ్​ఇండియా అత్యంత విజయవంతమైన కెప్టెన్​గా నిలిచాడు.

ఇవీ చూడండి:

ఇందుకే కోహ్లీ.. టెస్టు కెప్టెన్సీ వదులుకున్నాడా?

Virat Kohli Test Captaincy: సారథి.. సరిలేరు నీకెవ్వరూ!

Kohli Captaincy: టెస్టు సారథిగా కింగ్ కోహ్లీ రికార్డులివే..

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.