ETV Bharat / sports

రహానెకు అండగా నిలిచిన కెప్టెన్​ కోహ్లీ

Virat Kohli on Rahane: గతకొన్నాళ్లుగా బ్యాటింగ్​లో తడబడుతున్న రహానెకు అండగా నిలిచాడు కెప్టెన్ విరాట్​ కోహ్లీ. అతడి ఫామ్​ గురించి ఎవరూ ఒక అభిప్రాయానికి రాకుడదని అన్నాడు. బయటవ్యక్తుల్లాగ.. బాగా ఆడినప్పుడు ప్రశంసించి, ఫామ్​ కోల్పోయినప్పుడు తీవ్ర విమర్శలు చేయలేమని కోహ్లీ పేర్కొన్నాడు.

virat kohli
విరాట్​ కోహ్లీ
author img

By

Published : Dec 6, 2021, 3:55 PM IST

Virat Kohli on Rahane: స్టార్​ బ్యాటర్​ ఆజింక్యా రహానె పేలవ ఫామ్​పై విమర్శలు వ్యక్తం అవుతున్న నేపథ్యంలో కెప్టెన్​ విరాట్​ కోహ్లీ అతడికి అండగా నిలిచాడు. రహానె ఫామ్​పై ఎవరూ ఒక అభిప్రాయానికి రాకూడదని అన్నాడు. ఇటువంటి సమయంలో జట్టు అతనికి అండగా నిలవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నాడు.

"రహానె ఫామ్​ను చూసి నేను ఓ అభిప్రాయానికి రాలేను. ఇది అందరికీ వర్తిస్తుంది. ప్రస్తుతం ఎదుర్కొంటున్న పరిస్థితిని గురించి రహానెకు బాగా తెలుసు. గతంలో ఎన్నో మంచి ప్రదర్శనలు ఇచ్చాడు. కాబట్టి ఇలాంటి సమయంలో మేం అతడికి అండగా నిలవాలి. బయటవ్యక్తుల్లా బాగా ఆడినప్పుడు పొగడ్తలతో ముంచెత్తి, ఫామ్​ కోల్పోయినప్పుడు తీవ్ర విమర్శలు చేయలేం"

--విరాట్​ కోహ్లీ, టీమ్​ఇండియా కెప్టెన్​ ​

కోహ్లీ ఫామ్​పై..

మరోవైపు విరాట్​ కోహ్లీ బ్యాటింగ్​పైనా విమర్శలు వస్తున్నాయి. 2019 కోల్​కతాలో బంగ్లాదేశ్​తో పింక్​ బాల్​ టెస్టులో చివరగా కోహ్లీ శతకం చేశాడు. దీనిపై స్పందించిన కోహ్లీ.. 'చేసిన తప్పులనే చేస్తే ఆటతీరు గురించి సమీక్షించుకోవాలి' అని అన్నాడు.

న్యూజిలాండ్‌తో రెండో టెస్టులో టీమ్‌ఇండియా 372 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది. 140/5 ఓవర్‌నైట్‌ స్కోర్‌తో నాలుగోరోజు ఆట ప్రారంభించిన న్యూజిలాండ్‌.. మరో 27 పరుగులే జోడించి చివరి ఐదు వికెట్లు కోల్పోయింది. ఆట ప్రారంభమైన గంటలోపే ఆ జట్టు 167 పరుగులకు కుప్పకూలింది.

సోమవారం ఉదయం జయంత్‌ యాదవ్‌ నాలుగు వికెట్లు తీయగా అశ్విన్‌ చివరి వికెట్ తీశాడు. హెన్రీ నికోలస్ (44) పరుగులతో ఆఖరి వికెట్‌గా వెనుదిరిగాడు. దీంతో రెండు టెస్టుల సిరీస్​ను 1-0 తేడాతో కైవసం చేసుకుంది భారత్. టెస్టుల్లో భారత్‌కు ఇది పరుగుల పరంగా అత్యంత భారీ విజయం.

ఈ క్రమంలోనే టీమ్​ఇండియా.. ప్రపంచ టెస్టు ఛాంపియన్​షిప్​ రెండో ఎడిషన్​ పాయింట్ల పట్టికలో మూడో స్థానానికి చేరింది. ఇంగ్లాండ్​తో జరిగిన సిరీస్​ను 2-1 తేడాతో కైవసం చేసుకున్న భారత్.. తాజాగా కివీస్​తో సిరీస్​ను 1-0 తేడాతో గెలుచుకుంది. దీంతో పాయింట్ల పట్టికలో 42 పాయింట్లు, 58.33 పర్సంటేజ్​తో మూడో స్థానంలో నిలిచింది. 2021-23 ఎడిషన్​లో తొలి టెస్టు సిరీస్ ఆడిన న్యూజిలాండ్ 4 పాయింట్లు, 16.66 పర్సంటేజ్​తో 6వ స్థానానికి చేరుకుంది. శ్రీలంక 100 పర్సంటేజ్, 24 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతుండగా.. పాకిస్థాన్ 66.66 పర్సంటేజ్​తో రెండో స్థానం కైవసం చేసుకుంది.

ఈ నేపథ్యంలోనే ఐసీసీ విడుదల చేసిన తాజా టెస్టు ర్యాంకింగ్స్​లో అగ్రస్థానం కైవసం చేసుకుంది భారత జట్టు.

ఇదీ చూడండి : డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో భారత్ స్థానం ఎంతంటే?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.