Virat Kohli New Record: భారత జట్టు మాజీ సారథి విరాట్ కోహ్లీ మరో అరుదైన ఘనత సాధించాడు. వన్డేల్లో విదేశాల్లో అత్యధిక పరుగులు చేసిన భారతీయ ఆటగాడి రికార్డు నెలకొల్పాడు. దక్షిణాఫ్రికాతో జరుగుతున్న తొలి వన్డేలో తొమ్మిది పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఈ మార్కు అందుకున్నాడు. అంతకుముందు సచిన్ తెందుల్కర్(5065) పేరిట ఉన్న రికార్డును బద్దలుకొట్టాడు.
ఎంఎస్ ధోనీ(4520), రాహుల్ ద్రావిడ్(3998), సౌరభ్ గంగోలి(3468) సచిన్ తర్వాతి స్థానాల్లో ఉన్నారు.
కోహ్లీతో బవుమా గొడవ
దక్షిణాఫ్రికాతో జరుగుతున్న తొలి వన్డేలో ఓ ఆసక్తికర ఘటన జరిగింది. దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్ 36వ ఓవర్ నాలుగో బంతిని కెప్టన్ బవుమా షార్ట్ కవర్ రీజియన్ దిశగా ఆడాడు. అది నేరుగా కోహ్లీ చేతుల్లోకి వెళ్లింది. అయితే కోహ్లీ బంతిని పంత్‌కు బలంగా విసిరాడు. అది పొరపాటున బవుమాకు తగిలింది.
దీంతో బవుమా కోహ్లీపై కోపంగా చూస్తూ.."నేను క్రీజులోనే ఉన్నా. అలాంటి త్రోలు వేయనవసరం లేదు" అని అన్నాడు. కోపం పట్టలేని కోహ్లీ .."నేనేం కావాలని నిన్ను కొట్టలేదు. వికెట్ కీపర్‌కు త్రో విసిరే క్రమంలో పొరపాటున తగిలింది. ఒక బ్యాటర్‌గా నువ్వు అర్థం చేసుకోవాలి " అని దీటుగా బదులిచ్చాడు.
ఇదీ చూడండి: ఐసీసీ టీ20 జట్టులో భారత క్రికెటర్లకు దక్కని చోటు