Virat Kohli Motivation : టీమ్‌ఇండియా మాజీ కెప్టెన్, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఆటలోనే కాదు వ్యక్తిత్వంలోనూ ఎంతో మందికి ఆదర్శంగా నిలిచాడు. ఆట పట్ల ఎంతో నిబద్ధతతో ఉంటాడు. మ్యాచ్ ఏదైనా తన జట్టు గెలవాలనే కసితోనే ఆడతాడు. ఎంత ఒత్తిడి ఉన్నా, కష్టంగా ఉన్నా పోరాడి ముందుకు సాగుతాడు. తాజాగా ఈ విషయం గురించి అతడు మాట్లాడాడు.
"వ్యక్తిగతంగా, ఆటపరంగా నా శక్తి సామర్థ్యాలను నమ్మి ముందుకు సాగడం వల్ల నేను ఈ స్థాయికి రాగలిగాను. బయట ప్రజలకు వారికంటూ కొన్ని అభిప్రాయాలు, భావాలు ఉంటాయి. వాటి నుంచి కూడా నాకు అవసరమైనవాటిని నేర్చుకుని కెరీర్లో ముందుకు వెళ్తుంటాను. నా శక్తి సామర్థ్యం మీద నమ్మకం ఉంచడం వల్లే.. ఎన్ని సమస్యలు, కష్టాలు, ఒత్తిడి ఎదురైనా వాటిని దాటుకుని లక్ష్యాలను సాధించగలిగాను. కాన్ఫిడెన్స్ ఉన్నత స్థాయిలో ఉండటం వల్లే.. నా ఆట మీద దృష్టి పెట్టి ఎప్పుడూ మెరుగయ్యేందుకు ప్రయత్నిస్తుంటాను. గతంలో ఏం సాధించాను.. వాటి నుంచి ఇంకా ఏం నేర్చుకుని ముందుకు ఎలా సాగాలనేదానిపైనే నిత్యం ఆలోచిస్తుంటాను. ఓ ప్లేయర్గా ఎలాంటి ప్రదేశాల్లో బలహీనంగా ఉన్నాను అనే దానిపై కూడా బాగా ఫోకస్ పెట్టి మెరుగయ్యాను. వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని మంచిగా పునరాగమనం చేయగలిగాను" అని విరాట్ పేర్కొన్నాడు.
కాగా, వెస్టిండీస్ పర్యటనలో టెస్టు సిరీస్ మాత్రమే ఆడిన కోహ్లీ.. వన్డేతో పాటు టీ20 సిరీస్‌లకు దూరంగా ఉన్నాడు. కాస్త విరామం తీసుకున్నాడు. ప్రస్తుతం త్వరలో మొదలయ్యే ఆసియా కప్ కోసం క్రికెట్ ఫ్యాన్స్ అందరూ ఎదురు చూస్తున్నారు. ఈ టోర్నీలో కోహ్లీ బ్యాటింగ్ చేస్తుండగా గౌతమ్ గంభీర్ కామెంటరీ చెప్పే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ టోర్నీ కామెంటరీ ప్యానెల్‌లో గంభీర్ పేరు కూడా ఉంది. దీనికి సంబంధించిన వివరాలు తాజాగా వెల్లడించారు.
Gautam Gambhir Asia Cup 2023 : గంభీర్ కామెంటేటరీలో కోహ్లీ.. త్వరలోనే ప్రారంభంకానున్న ఆసియా కప్లో కోహ్లీ బ్యాటింగ్ చేస్తుండగా గౌతమ్ గంభీర్ కామెంటరీ చెప్పే పరిస్థితి కనిపిస్తోంది. ఎందుకంటే ఈ టోర్నీ కామెంటరీ ప్యానెల్‌లో గంభీర్ పేరును కూడా ఉంది. మొత్తంగా ఈ జాబితాలో ఐదుగురు భారతీయులు, నలుగురు పాకిస్థాన్ మాజీ ప్లేయర్స్ ఉన్నారు. ఈ నెల 31వ తేదీ నుంచి ఆసియా కప్ మొదలుకానుంది. ఈ కామెంటరీ ప్యానెల్‌లో భారత్ తరఫున రవిశాస్త్రి, గౌతమ్ గంభీర్, సంజయ్ మంజ్రేకర్, ఇర్ఫాన్ పఠాన్, దీప్ దాస్ గుప్తా ఉండగా.. పాకిస్థాన్ తరఫున వసీం అక్రమ్, వకార్ యూనిస్, రమీజ్ రజా, బాజిద్ ఖాన్ ఉన్నారు. మిగతా దేశాల తరఫున మరికొంతమంది ఈ ప్యానెల్‌లో చోటు దక్కించుకున్నారు.
Virat Kohli Social Media Income : ఇన్స్టా సంపాదనపై కోహ్లీ క్లారిటీ.. 'అదంతా ఫేక్' అంటూ ట్వీట్