Virat Kohli Meets Shaheen Afridi: ప్రపంచ క్రీడాభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్న భారత్, పాకిస్థాన్ మ్యాచ్ దుబాయ్ వేదికగా ఆదివారం జరగనుంది. ఈ తరుణంలో ఇరు జట్ల ప్రాక్టీస్ సెషన్లో ఓ అరుదైన సన్నివేశం జరిగింది. పాకిస్థాన్ పేసర్ షాహిన్ అఫ్రిదీని కలిశాడు భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ. వీరిద్దరు మాట్లాడుకున్న వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది పాకిస్థాన్ క్రికెట్ బోర్డ్.
-
Stars align ahead of the #AsiaCup2022 🤩
— Pakistan Cricket (@TheRealPCB) August 25, 2022 " class="align-text-top noRightClick twitterSection" data="
A high-profile meet and greet on the sidelines 👏 pic.twitter.com/c5vsNCi6xw
">Stars align ahead of the #AsiaCup2022 🤩
— Pakistan Cricket (@TheRealPCB) August 25, 2022
A high-profile meet and greet on the sidelines 👏 pic.twitter.com/c5vsNCi6xwStars align ahead of the #AsiaCup2022 🤩
— Pakistan Cricket (@TheRealPCB) August 25, 2022
A high-profile meet and greet on the sidelines 👏 pic.twitter.com/c5vsNCi6xw
పాకిస్థాన్ జట్టు ప్రాక్టీస్ చేస్తున్న తరుణంలో అటుగా వెళ్లిన విరాట్ కోహ్లీ.. పాక్ పేసర్ అఫ్రిదీని కలిసి మాట్లాడాడు. తొలుత గాయం గురించి అఫ్రిదీని అడిగి తెలుసుకున్నాడు విరాట్ కోహ్లీ. దీనికి స్పందించిన షాహిన్ అఫ్రిది.. "నువ్వు మళ్లీ ఫామ్‌లోకి రావాలని మేము ప్రార్థిస్తున్నాం" అని విరాట్ కోహ్లీకి చెప్పాడు. దీంతో.. కోహ్లీ కూడా నవ్వుతూ షేక్ హ్యాండ్ ఇచ్చి వెళ్లిపోయాడు.
-
The suspense is over! Let's listen to the conversation between @iShaheenAfridi and @imVkohli 🔊#AsiaCup2022 pic.twitter.com/ttVYLrNtuO
— Pakistan Cricket (@TheRealPCB) August 26, 2022 " class="align-text-top noRightClick twitterSection" data="
">The suspense is over! Let's listen to the conversation between @iShaheenAfridi and @imVkohli 🔊#AsiaCup2022 pic.twitter.com/ttVYLrNtuO
— Pakistan Cricket (@TheRealPCB) August 26, 2022The suspense is over! Let's listen to the conversation between @iShaheenAfridi and @imVkohli 🔊#AsiaCup2022 pic.twitter.com/ttVYLrNtuO
— Pakistan Cricket (@TheRealPCB) August 26, 2022
అంతకుముందు శ్రీలంకతో జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో పాక్ పేసర్ షాహిన్ అఫ్రిదీ మోకాలికి గాయమైంది. దీంతో ఆసియా కప్ నుంచి అఫ్రిదీని తొలగించింది పాకిస్థాన్ క్రికెట్ బోర్డ్. సెప్టెంబర్ 20 న స్వదేశంలో జరిగే ఇంగ్లాండ్ సిరీస్‌కు కూడా విశ్రాంతిని ఇస్తున్నట్లు తెలిపింది. మరోవైపు విరాట్ కోహ్లీ సైతం స్వల్ప విరామం అనంతరం తిరిగి జట్టులోకి వచ్చాడు.
ఇవీ చదవండి: ఒక్క మ్యాచ్‌తో మూడు రికార్డులు, వారి ఆశలన్నీ కింగ్ కోహ్లీపైనే