RCB new captain: ఐపీఎల్ 2022లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కొత్త కెప్టెన్ ఎవరనే ఉత్కంఠకు తెరపడింది. దక్షిణాఫ్రికా మాజీ సారథి ఫాఫ్ డుప్లేసిస్కు నాయకత్వ బాధ్యతలను అప్పగించింది జట్టు యాజమాన్యం. ఈ విషయాన్ని మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ సామాజిక మాధ్యమాల వేదికగా ప్రకటించాడు. డుప్లెసిస్ సారథ్యంలో ఆడనుండటంపై ఆనందం వ్యక్తం చేశాడు. సీజన్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నట్లు తెలిపాడు.
-
“Happy to pass on the baton to Faf! Excited to partner with him and play under him” - A message from @imVkohli for our new captain @faf1307. 🤩#PlayBold #RCBUnbox #UnboxTheBold #ForOur12thMan #IPL2022 pic.twitter.com/lHMClDAZox
— Royal Challengers Bangalore (@RCBTweets) March 12, 2022 " class="align-text-top noRightClick twitterSection" data="
">“Happy to pass on the baton to Faf! Excited to partner with him and play under him” - A message from @imVkohli for our new captain @faf1307. 🤩#PlayBold #RCBUnbox #UnboxTheBold #ForOur12thMan #IPL2022 pic.twitter.com/lHMClDAZox
— Royal Challengers Bangalore (@RCBTweets) March 12, 2022“Happy to pass on the baton to Faf! Excited to partner with him and play under him” - A message from @imVkohli for our new captain @faf1307. 🤩#PlayBold #RCBUnbox #UnboxTheBold #ForOur12thMan #IPL2022 pic.twitter.com/lHMClDAZox
— Royal Challengers Bangalore (@RCBTweets) March 12, 2022
గత సీజన్ వరకు చెన్నై సూపర్‌కింగ్స్‌కు ఆడిన డుప్లెసిస్.. నిలకడైన ఆటతీరుతో ఆకట్టుకుంటున్నాడు. దీంతో కోహ్లీ కెప్టెన్సీ వదులుకున్న తర్వాత అతడే సరైన ఎంపిక అని యాజమాన్యం భావిస్తోంది. ఫాఫ్ పగ్గాలు అందుకోవడం వల్ల తమ కప్పు కల నెరవేరుతుందని ఆశిస్తోంది. ఫిబ్రవరిలో జరిగిన మెగావేలంలో డుప్లెసిస్‌ను రూ.7 కోట్లకు సొంతం చేసుకుంది ఆర్సీబీ.
విదేశీ ఆటగాడిని నమ్మడం చిన్నవిషయం కాదు..
తనకు ఈ అవకాశం ఇచ్చిన ఆర్సీబీ యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలిపాడు డుప్లెసిస్. "ఐపీఎల్లో ఎన్నో మ్యాచ్‌లు ఆడటం వల్ల ఆట పట్ల సరైన అవగాహన ఉంది. ఒక విదేశీ ఆటగాడిపై ఇంత నమ్మకం ఉంచడం మామూలు విషయం కాదు. దేశీయ ఆటగాళ్ల అద్భుతమైన ప్రతిభపై ఎక్కువగా ఆధారపడతా. ఇక విరాట్ రూపంలో మాకు గొప్ప నాయకుడు ఉండనే ఉన్నాడు." అని ఫాఫ్ అన్నాడు.
ఐపీఎల్లో ఇప్పటివరకు 100 మ్యాచ్‌లు ఆడిన డుప్లెసిస్.. 2935 పరుగులు చేశాడు. సీఎస్కే టైటిల్ కైవసం చేసుకున్న గత సీజన్లో 633 పరుగులు చేశాడు.
ఇదీ చూడండి: కెప్టెన్‌గా అందుకే తప్పుకొన్నా : విరాట్ కోహ్లీ