ETV Bharat / sports

Virat Kohli Instagram Income : సంపాదనలోనూ 'కింగ్​' కోహ్లీ రికార్డు.. ఒక్కో ఇన్​స్టా పోస్టుకు రూ.కోట్లు వసూల్

Virat Kohli Instagram Income Per Post 2023 : టీమ్​ఇండియా స్టార్ క్రికెటర్ విరాట్​ కోహ్లీ మరో ఘనత సాధించాడు. ఒక్కో ఇన్​స్టాగ్రామ్​ పోస్టుకు రూ.కోట్లలో విసూలు చేస్తూ.. అందరికంటే ముందున్నాడు. ఇన్​స్టా​ సంపాదనలో దూసుకెళ్తున్నాడు. ఇంతకీ కోహ్లీ ఎన్ని కోట్ల రూపాయలు వసూలు చేస్తున్నాడంటే?

Virat Kohli Instagram Income Per Post 2023

author img

By

Published : Aug 11, 2023, 6:12 PM IST

Virat Kohli Instagram Income Per Post 2023 : టీమ్ఇండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ మరో ఘనత సాధించాడు. రికార్డుల్లోనే కాకుండా సంపాదనలోనూ అందరికంటే ముందున్నాడు. సోషల్​ మీడియాలో యాక్టివ్​గా ఉండే విరాట్​.. పలు ప్లాట్​ఫామ్​లలో ఫాలోవర్లను కూడా భారీ స్థాయిలో పెంచుకున్నాడు. దీని ద్వారా భారీగానే సంపాదిస్తున్నాడు. అయితే, ప్రస్తుతం విరాట్​.. సంపాదనలో అందరు ఆటగాళ్ల కన్నా ముందున్నాడట. ఈ నేపథ్యంలో ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్​ఫామ్​ ఇన్‌స్టాగ్రామ్‌లో.. కోహ్లీ ఒక్కో పోస్టుకు వసూలు చేసే మొత్తం.. కొందరు క్రికెటర్ల ఏడాది మొత్తం ఆదాయం కంటే ఎక్కువట. ఈ విషయాన్ని 'హూపర్ హెచ్​క్యూ' అనే సంస్థ ఇటీవల విడుదల చేసిన జాబితాలో వెల్లడించింది.

Virat Kohli Instagram Post Charge : ప్రపంచ వ్యాప్తంగా ఇన్‌స్టాలో అత్యధిక మొత్తం ఛార్జ్ చేసే తొలి 20 మంది పేర్లను 'హూపర్ హెచ్​క్యూ' సంస్థ విడుదల చేసింది. ఆ జాబితాలో కోహ్లీ 14 స్థానంలో ఉన్నాడు. ఆ జాబితా ప్రకారం విరాట్.. సింగిల్‌ స్పాన్సర్డ్‌ పోస్టుకు (virat kohli instagram post price) రూ.11 కోట్లు తీసుకుంటాడు. అతడికి 25.5 కోట్ల (Virat Kohli Instagram Followers) మంది ఫాలోవర్లు ఉన్నారు. ఈ 20 మంది లిస్ట్​లో ఇండియా నుంచి విరాట్ ఒక్కడే స్థానం దక్కించుకోవడం విశేషం. బాలీవుడ్​ నటి ప్రియాంకా చోప్రా ఈ జాబితాలో 29వ స్థానం దక్కించుకుంది. ఆమె ఒక ఇన్​స్టా పోస్టుకు రూ.4.4 కోట్లు వసూలు చేస్తోంది.

Hopper Hq Instagram Rich List : తమ జాబితాపై హూపర్‌ హెచ్‌క్యూ సహ వ్యవస్థాపకుడు మైక్‌ బాండర్‌ స్పందించారు. సూపర్‌ స్టార్లు ఇన్‌స్టా నుంచి ఆర్జిస్తున్న సంపాదన చూస్తే ఆశ్చర్యమేస్తోందని.. వారి సంపాదన ఏళ్లు గడిచేకొద్దీ పెరుగుతోందని వెల్లడించారు. ఇన్​స్టాగ్రామ్​ ప్లాట్‌ఫామ్‌పై వీరి సంపాదన ఏటా పెరుగుతూనే ఉండటం చూసి తాను ఆశ్చర్యపోతున్నానని చెప్పారు. కొత్త తరం సోషల్​ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్లు వచ్చినా.. సంప్రదాయ సెలబ్రెటీల ఆకర్షణ ఏమాత్రం తగ్గనట్లే కనిపిస్తోందని తెలిపారు. ఇక, ఫుట్​బాల్​ స్టార్లు క్రిస్టియానో రొనాల్డో, లియోనెల్ మెస్సీ మైదానంలోనే కాకుండా.. సామాజిక మాధ్యమాల వేదికలపైనా రాజ్యమేలుతున్నారని.. సామాన్యూలపై వారి ప్రభావాన్ని ఇది తెలియజేస్తోందని అన్నారు.

ఒక పోస్టుకు.. రూ.59.6 కోట్లు వసూల్​!
Highest Paid Instagram Per Post In World : హూపర్‌ హెచ్‌క్యూ జాబితా ప్రకారం ఇన్​స్టాగ్రామ్​లో అత్యధిక ఫాలోవర్లు ఉన్న వాళ్లలో ఫుట్‌బాల్‌ స్టార్‌ క్రిస్టియానో రొనాల్డో తొలి స్థానంలో ఉండగా.. ఆ తర్వాతి స్థానంలో మెస్సీ ఉన్నాడు. 59.6 కోట్ల మంది ఫాలోవర్లు ఉన్న రొనాల్డో ఒక పోస్టుకు రూ.26.7 కోట్లు తీసుకొంటున్నాడు. 47.9 కోట్ల మంది ఫాలోవర్లతో ద్వితీయ స్థానంలో ఉన్న మెస్సీ రూ.21 కోట్లు వసూలు చేస్తున్నాడు.

కోహ్లీ ఇన్​స్టా రికార్డు.. ఇండియన్ సెలబ్రిటీల్లో అగ్రస్థానం!

Ronaldo Instagram Followers : ఇన్​స్టాగ్రామ్​లో రొనాల్డో నయా రికార్డు​.. ఆ ఘనత సాధించిన ఏకైక వ్యక్తిగా..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.