ETV Bharat / sports

'సూర్య ఏ గ్రహం మీదైనా బ్యాటింగ్‌ చేయగలడు.. వీడియో గేమ్​ లాంటి ఇన్నింగ్స్'

న్యూజిలాండ్​తో జరిగిన రెండో టీ20లో భారత్​ ఘన విజయం సాధించింది. ఇందులో సూర్య కుమార్​ యాదవ్​ మెరుపు ఇన్నింగ్స్​ ఆడి 111 పరుగులు చేశాడు. దీంతో సూర్య ఏ గ్రహం మీదైనా ఆదడగలడని.. సూర్య ఆడింది వీడియో గేమ్​ లాంటి ఇన్నింగ్స్​ అని పలువురు సీనియర్లు కితాబిస్తున్నారు. ఎవరు ఏమన్నారంటే..

suryakumar yadav after blazing century
suryakumar yadav after blazing century
author img

By

Published : Nov 20, 2022, 10:37 PM IST

న్యూజిలాండ్‌పై మ్యాచ్‌లో సూర్యకుమార్‌ అజేయ ఇన్నింగ్స్‌ (111*: 51 బంతుల్లో 11 ఫోర్లు, 7 సిక్స్‌లు) అభిమానులను ఉర్రూతలూగిస్తోంది. తన ఆటతో జట్టును భారీ స్కోరు వైపు నడిపించిన సూర్య టీమ్‌ఇండియా గెలుపులో కీలక పాత్ర పోషించాడు. రోహిత్‌ శర్మ తర్వాత ఈ ఏడాది టీ20ల్లో రెండు సెంచరీలు చేసిన ఆటగాడిగా ఈ మిడిలార్డర్‌ బ్యాట్స్‌మన్‌ నిలిచాడు. ఈ ఆటగాడి ప్రతిభను సీనియర్‌ క్రికెటర్లు ప్రశంసించారు. మిస్టర్‌ 360 సెంచరీపై సామాజిక మాధ్యమాల వేదికగా హర్షం వ్యక్తం చేస్తున్నారు. కింగ్ కోహ్లీ ట్వీట్‌ చేస్తూ ఈ మ్యాచ్‌ను లైవ్‌లో చూడలేకపోయానని తెలిపాడు. ఈ అసాధారణ ఆటగాడు కచ్చితంగా మరో వీడియో గేమ్‌ను పోలిన షాట్లతో విరుచుకుపడి ఉంటాడంటూ కొనియాడాడు. మరికొందరు సీనియర్లు సైతం తమ సంతోషాన్ని ట్విటర్‌లో పంచుకున్నారు.

''అతడు ప్రపంచంలోనే ఉత్తమమైన ఆటగాడు ఎందుకయ్యాడో తన ప్రదర్శనతో నిరూపిస్తున్నాడు. మ్యాచ్‌ను చూడలేదు. కానీ కచ్చితంగా అది మరో వీడియో గేమ్‌లాంటి ప్రదర్శనే అయ్యుంటుంది'' -విరాట్‌ కోహ్లీ
''ఈ మధ్యన సూర్యుడు ఆకాశమే హద్దుగా చెలరేగుతున్నాడు'' -వీరేంద్ర సెహ్వాగ్‌
''సూర్య.. ఏ గ్రహం మీదైనా బ్యాటింగ్ చేయగలడు'' -ఇర్ఫాన్‌ పఠాన్‌

ఇవీ చదవండి : 'మీరు ఆడితే లోకమే ఊగదా'.. కేరళను ఊపేస్తున్న సాకర్ ఫీవర్!

సూర్య సూపర్ సెంచరీ.. కివీస్​తో టీ20 సిరీస్​లో టీమ్ఇండియా బోణీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.