ETV Bharat / sports

కింగ్ ఈజ్ బ్యాక్.. సెంచరీతో కోహ్లీ సింహనాదం.. మూడున్నరేళ్ల తర్వాత..

ప్రస్తుతం ఆస్ట్రేలియాతో జరుగుతున్న బోర్డర్​-గావస్కర్​ ట్రోఫీ నాలుగో టెస్ట్​ మ్యాచ్​తొలి ఇన్నింగ్స్​లో స్టార్​ బ్యాటర్​​ విరాట్​ కోహ్లీ సెంచరీ బాదాడు. దీంతో సుమారు మూడున్నరేళ్ల తర్వాత టెస్టుల్లో శతకం కొట్టి సుదీర్ఘ కాల నిరీక్షణకు తెరదించాడు.

virat kohli century
virat kohli century
author img

By

Published : Mar 12, 2023, 12:47 PM IST

Updated : Mar 12, 2023, 2:48 PM IST

ఆస్ట్రేలియాతో జరుగుతున్న బోర్డర్​-గావస్కర్​ ట్రోఫీ నాలుగో టెస్ట్​ మ్యాచ్​ తొలి ఇన్నింగ్స్​లో క్రికెటర్​ విరాట్​ కోహ్లీ సెంచరీ బాదాడు. సుమారు మూడున్నరేళ్లు అంటే 1200పైగా రోజుల తర్వాత టెస్టుల్లో శతకం కొట్టి సుదీర్ఘ కాల నిరీక్షణకు తెరదించాడు. మార్చి 10న ప్రారంభమైన ఈ మ్యాచ్​లో ఆట నాలుగో రోజుకి 240 బాల్స్​లో 100 పరుగులు చేశాడు విరాట్​. 2019 నవంబరులో బంగ్లాదేశ్​తో జరిగిన టెస్ట్​ సిరీస్​లో తన చివరి సెంచరీని నమోదు చేశాడు. దీంతో 2019 తర్వాత విరాట్​ తొలి సారి సెంచరీ చేసింది ఇప్పుడే. మ్యాచ్​ మొదటి నుంచి ఆచితూచి ఆడుతూ వస్తున్న విరాట్​ 240 బంతుల్లో సెంచరీని పూర్తి చేశాడు. టీ20ల్లో, వన్డేల్లో శతకాలతో అదరగొట్టి తన ఫామ్​ను మెరుగుపరుచుకున్న విరాట్​ టెస్టుల్లో మాత్రం సెంచరీ కోసం ఇంత కాలం ఎదురు చూడాల్సి వచ్చింది. ఇందుకోసం 41 టెస్టు ఇన్నింగ్స్​లను తీసుకున్నాడు విరాట్​.

ఇకపోతే అంతర్జాతీయ టెస్టు క్రికెట్​లో కోహ్లీకిది 28వ శతకం కాగా.. అన్ని ఫార్మట్​లలో కలిపి 75వ సెంచరీ. తన కెరీర్​లో అత్యధిక బంతులు తీసుకొని మరీ సెంచరీ చేయడం ఇది రెండో సారి. ఇప్పుడు ఆసీస్​ మ్యాచ్​లో 240 బంతుల్లో దీనిని అధిగమించగా.. ఇంగ్లాండ్​తో జరిగిన మ్యాచ్​లో అత్యధికంగా 289 బంతులను వాడుకున్నాడు.

మ్యాచ్​ మూడో రోజు ఆట చివరికి కోహ్లీ ఓవర్​నైట్​ స్కోర్​ 59 పరుగులతో నాటౌట్​గా ఉంది. దీనికి నాల్గో టెస్టు తొలి ఇన్నింగ్స్​లో లంచ్​ సమయానికి 29 పరుగులు జోడించి 88 రన్స్​తో నిలకడగా ఆటను ఆడాడు. కాగా, ఆసీస్ బౌలర్లు కామెరూన్​ గ్రీన్​, మిచెల్​ స్టార్క్​లు విరాట్​ను పరుగులు తీయకుండూ నియంత్రించే క్రమంలో అతడు నిలకడగా సింగిల్స్​, డబుల్స్​ తీస్తూ స్కోర్​ బోర్డును ఆపకుండా ముందుకు సాగించాడు.

'లయన్' గర్జన..
భారత్​ గడ్డపై పర్యాటక దేశం నుంచి అత్యధిక వికెట్లు తీసిన బౌలర్​గా నాథన్​ లయన్​ 55 వికెట్లు తీసి అరుదైన రికార్డును నెలకొల్పాడు. అంతేగాక కేఎస్​ భరత్​ను ఐదు ఇన్నింగ్స్​లలో నాలుగుసార్లు లయనే ఔట్​ చేయడం గమనార్హం. కాగా, ముర్ఫీ కూడా ఈ ఇన్నింగ్స్​లో పుజారాను ఎల్​బీడబ్ల్యూ చేసి జడేజా బ్యాటింగ్​కు క్యాచ్​ ఇచ్చి ఇద్దరి బ్యాటింగ్​కు ముగింపు పలికాడు. ఇక కునేమనె​ కెప్టెన్​ రోహిత్​ శర్మను ఔట్​ చేసి ఓ వికెట్​ను తన ఖాతాలో వేసుకున్నాడు.

భరత్​ భేష్​..
వెన్నుముకలో గాయం కారణంగా శ్రేయస్ అయ్యర్​కు ఈ మ్యచ్​ ఆడే అవకాశం దక్కలేదు. శ్రేయస్​ స్థానంలో కోన శ్రీకర్​ భరత్​ను జట్టులోకి తీసుకున్నారు. ఇతడు 88 బంతుల్లో రెండు ఫోర్లు, 3 సిక్స్​లతో 44 పరుగులు చేసి జట్టుకు బాసటగా నిలిచాడు. విరాట్​ కోహ్లీతో కలిసి​ 53 పరుగుల చక్కని భాగస్వామ్యం కూడా చేశాడు భరత్​. చివరికి లయన్​ వేసిన బౌలింగ్​లో హాండ్స్​కాంబ్​ క్యాచ్​ పట్టడంతో భరత్ ఔటయ్యాడు.

ప్రస్తుతం భారత్​ తొలి ఇన్నింగ్స్​లో ఓవర్​నైట్​ 289/3 స్కోరుతో నాలుగో రోజు ఆటను ఆరంభించింది. కోహ్లీతో పాటు ఇప్పటికే శుభమన్​ గిల్​(128) సెంచరీ సాధించాడు. పుజారా(42), కెప్టెన్​ రోహిత్​ శర్మ(35) కీలక పరుగులు సాధించారు. ఆసీస్​ తన మొదటి ఇన్నింగ్స్​లో 480 పరుగులకు ఆలౌటైంది. చివరి టెస్టు నాల్గో రోజు మ్యాచ్​లో భోజన విరామ సమయానికి 4 వికెట్లు కోల్పోయి 362 పరుగులతో భారత్​ ఆటను కొనసాగించింది. పిచ్​ ప్రతీకూలంగా ఉండటం వల్ల స్కోర్​ బోర్డు కాస్త నెమ్మదించింది. దీంతో ఉదయం సెషన్​లో 32 ఓవర్లో కేవలం 77 పరుగులు మాత్రమే చేయగలిగింది రోహిత్​ సేన.

Last Updated : Mar 12, 2023, 2:48 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.