Virat Kohli Back To India : దక్షిణాఫ్రికాతో టెస్ట్ సిరీస్ ఆడేందుకు వెళ్లిన టీమ్ఇండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ సడెన్‌గా ఇండియాకు వచ్చాడు. ఫ్యామిలీ ఎమర్జెన్సీ కారణంగా కోహ్లీ భారత్‌కు వచ్చినట్లు బీసీసీఐ వర్గాలు తెలిపాయి. తొలి టెస్ట్ ప్రారంభమయ్యే ఒకరోజు ముందు మళ్లీ కోహ్లీ దక్షిణాఫ్రికా వస్తాడని పేర్కొన్నాయి.
దక్షిణాఫ్రికాతో రెండు టెస్టుల సిరీస్‌లో భాగంగా డిసెంబర్ 26వ తేదీన సెంచూరియన్ వేదికగా తొలి టెస్ట్ మ్యాచ్ ప్రారంభం కానుంది. దీంతో ఇటీవలే విరాట్ దక్షిణాఫ్రికా చేరుకున్నాడు. అయితే ఫ్యామిలీ ఎమర్జెన్సీ కారణంగా విరాట్ కోహ్లీ భారతదేశానికి తిరిగి వచ్చాడని ఓ బీసీసీఐ అధికారి తెలిపారు. మొదటి టెస్టు ప్రారంభానికి ముందే తిరిగి దక్షిణాఫ్రికా చేరుకోనున్నాడని చెప్పారు. ఈ విషయం తెలుసుకున్న ఫ్యాన్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
-
Virat Kohli returns home due to family emergency.
— 𝐈𝐦𝐩𝐞𝐫𝐢𝐚𝐥 𝐕𝐊 (@imperialvk) December 22, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
According to BCCI, he will be back in time before the 1st Test match of India. [Cricbuzz] pic.twitter.com/BayAjJVSeF
">Virat Kohli returns home due to family emergency.
— 𝐈𝐦𝐩𝐞𝐫𝐢𝐚𝐥 𝐕𝐊 (@imperialvk) December 22, 2023
According to BCCI, he will be back in time before the 1st Test match of India. [Cricbuzz] pic.twitter.com/BayAjJVSeFVirat Kohli returns home due to family emergency.
— 𝐈𝐦𝐩𝐞𝐫𝐢𝐚𝐥 𝐕𝐊 (@imperialvk) December 22, 2023
According to BCCI, he will be back in time before the 1st Test match of India. [Cricbuzz] pic.twitter.com/BayAjJVSeF
అయితే ఇటీవల విరాట్- అనుష్క దంపతులకు సంబంధించిన ఓ వార్త బయటకి వచ్చింది. గతనెల 12న బెంగళూరులోని ఓ హోటల్ నుంచి వీరిద్దరూ బయటకు వస్తున్న సమయంలో ఎవరో దాన్ని వీడియో తీసి నెట్టింట పోస్ట్ చేశారు. ఈ వీడియోలో స్పష్టంగా అనుష్క బేబీ బంప్ కనిపిస్తుందంటూ నెటిజన్లు కామెంట్లు పెట్టారు. కానీ, వారి నుంచి ఈ విషయంపై ఎలాంటి అఫిషియల్ అనౌన్స్మెంట్ రాలేదు.
టెస్టు సిరీస్ షెడ్యూల్
- తొలి టెస్టు- డిసెంబరు 26 - 30 వరకు- సెంచురియాన్ మధ్యాహ్నం 1:30
- రెండో టెస్టు- జనవరి 03 - 07 వరకు- కేప్‌టౌన్ మధ్యాహ్నం 2:00
భారత్ టెస్టు జట్టు : రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, రుతురాజ్ గైక్వాడ్, కేఎస్ భరత్ (వికెట్ కీపర్), కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, మహ్మద్ సిరాజ్, ముకేశ్ కుమార్, జస్‌ప్రీత్ బుమ్రా (వైస్ కెప్టెన్), ప్రసిద్ధ్ కృష్ణ.
టెస్ట్ సిరీస్‌కు రుతురాజ్ దూరం
మరోవైపు, టీమ్ఇండియా యంగ్ క్రికెట్ రుతురాజ్ గైక్వాడ్ సఫారీలతో జరగనున్న టెస్ట్ సిరీస్‌కు దూరమయ్యాడు. ఉంగరపు వేలు ఫ్రాక్చర్ కావడంతో సిరీస్‌కు దూరమయ్యాడని బీసీసీఐ వర్గాలు తెలిపాయి. దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో వన్డేలో క్యాచ్ పట్టే ప్రయత్నంలో గైక్వాడ్ వేలికి గాయమైంది.
టెస్ట్ సిరీస్ నుంచి తప్పుకున్న ఇషాన్- సౌతాఫ్రికా టూర్ నుంచి రిటర్న్