ETV Bharat / sports

తెరపైకి కోహ్లీ-రోహిత్ విభేదాలు.. అసలేం జరిగింది? - రోహిత్ శర్మ వైస్ కెప్టెన్సీ

టీ20 ప్రపంచకప్ తర్వాత పొట్టి ఫార్మాట్ కెప్టెన్సీ(virat kohli captaincy in t20) నుంచి తప్పుకొంటున్నట్లు ప్రకటించాడు విరాట్ కోహ్లీ(virat kohli news). ఈ ప్రకటన తర్వాత కోహ్లీ-రోహిత్ మధ్య మనస్పర్థలు(kohli rohit rift) మరోసారి తెరపైకి వచ్చాయి.

rohit
రోహిత్
author img

By

Published : Sep 17, 2021, 7:06 PM IST

టీమ్ఇండియా టీ20 కెప్టెన్సీకి విరాట్ కోహ్లీ(virat kohli captaincy in t20) గుడ్​బై చెప్పడం చర్చనీయాంశంగా మారింది. అతడు ఈ నిర్ణయం ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది? అన్న అనుమానాలు అభిమానుల్లో వ్యక్తమవుతున్నాయి. పని భారం వల్లే తప్పుకొంటున్నానని కోహ్లీ వెల్లడించినా.. దీనికి మరేదో కారణముందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో కోహ్లీ-రోహిత్​ మధ్య మనస్పర్థలు(kohli rohit rift) మరోసారి చర్చకు వచ్చాయి. కోహ్లీ తప్పుకోవడానికి కారణం వారి మధ్య విభేదాలేనని(kohli rohit rift) తెలుస్తోంది. ఇదే విషయమై పీటీఐలో వచ్చిన ఓ సంచలన వార్త మరింత ఆసక్తిని రేకెత్తించింది.

ప‌రిమిత ఓవ‌ర్ల జట్టు వైస్ కెప్టెన్ బాధ్య‌త‌ల నుంచి రోహిత్ శ‌ర్మ‌ను త‌ప్పించాల‌ని కోహ్లీ(kohli rohit rift).. బీసీసీఐకి డిమాండ్ చేశాడ‌న్న‌ది ఆ వార్త‌ల సారాంశం. రోహిత్ వ‌య‌సు 34 ఏళ్ల‌ని, అత‌డిని ప‌క్క‌న పెట్టి వ‌న్డేల్లో కేఎల్ రాహుల్‌(kl rahul vice captain)కు, టీ20ల్లో రిష‌బ్ పంత్‌(rishabh pant news)కు వైస్ కెప్టెన్సీ బాధ్య‌త‌లు ఇవ్వాల‌ని విరాట్ కోరినట్లు సమాచారం. ఇదే విష‌యాన్ని సెల‌క్ష‌న్ క‌మిటీకి చెప్ప‌గా.. అది కాస్తా బోర్డు దృష్టిలో ప‌డి కోహ్లీపై అసంతృప్తికి కార‌ణ‌మైందట. ఓ సక్సెస్​ఫుల్ ఆటగాడిని కోహ్లీ గుర్తించలేకపోవడం పట్ల వారు కాస్త నిరాశకు గురయ్యారట.

రోహిత్​ నిజమైన లీడర్!

జట్టులో చాలామంది ఇప్పటికీ రోహిత్​ సలహాలను పాటిస్తారని ఓ అధికారి చెప్పారు. యువ ఆటగాళ్లను అతడు బాగా ప్రోత్సాహిస్తాడని వెల్లడించారు. టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్​లో ఇద్దరు స్పిన్నర్లను తీసుకోవడం, 2019 వన్డే ప్రపంచకప్​లో సరైన నిర్ణయాలు తీసుకోలేకపోవడమూ కోహ్లీ కెప్టెన్సీపై అసంతృప్తికి కారణమయ్యాయి.

ఇవీ చూడండి:

ఆర్సీబీ కెప్టెన్సీ నుంచి కోహ్లీ తప్పుకోనున్నాడా?

ఐపీఎల్​ మిస్టరీ భామలు.. మరి ఈసారి ఎవరో?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.