సాధారణంగా క్రికెట్లో చిత్ర విచిత్రమైన సంఘటనలు జరుగుతుంటాయి. వివిధ మ్యాచుల్లో ఆటగాళ్లు, అంపైర్లు, ప్రేక్షకులు చేసే విన్యాసాల వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. కొన్ని సార్లు మ్యాచుల్లో అంపైర్లు ప్రకటించే నిర్ణయాలకు ఆయా జట్ల అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తుంటారు. తమకు అనుకూలంగా లేకపోతే విమర్శలు చేస్తుంటారు. ఇటీవలే టీమ్‌ఇండియా టాప్ అంపైర్ నితిన్ మీనన్ కూడా ఆసీస్‌తో టెస్టు సిరీస్ సందర్భంగా అభిమానుల ఆగ్రహానికి గురైన సంగతి తెలిసిందే. అయితే ఇటీవలే సోషల్‌మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. ఇది ఎక్కడ జరిగిందో తెలీదు కానీ.. అభిమానులను మాత్రం నవ్వులు తెప్పిస్తోంది.
వీడియో ప్రకారం.. ఇరు జట్ల మధ్య హోరాహోరీగా స్నేహపూర్వక మ్యాచ్ సాగుతోంది. బౌలర్ అద్భుతమైన బంతిని విసరగా.. సదరు బ్యాటర్ షాట్ కొట్టేందుకు ప్రయత్నించాడు. కానీ, బంతి తన ప్యాట్లకు తాకి పైకి లేవడంతో కీపర్ క్యాచ్ పట్టేశాడు. దీంతో బౌలర్, కీపర్ పెద్దగా అప్పీలు చేశారు. అయితే అక్కడే ఉన్న అంపైర్ మాత్రం స్పందించలేదు.
ఆ తర్వాత సరేలే అని మళ్లీ బౌలింగ్ వేద్దామని బౌలర్ సిద్ధమయ్యాడు. అప్పుడు ఒక్కసారి అంపైర్ చేతి వేలిని పైకి ఎత్తేశాడు. దీంతో బౌలర్ ఆశ్చర్యపోయారు. క్రీజులో ఉన్న బ్యాటర్ మాత్రం ఇదేం నిర్ణయమంటూ తీవ్ర అసహనం వ్యక్తం చేశాడు. దీంతో నెటిజన్లు మాత్రం ట్రోలింగ్ చేస్తున్నారు. 'స్టీవ్‌బక్నర్ 2.0.. హాలిడే ప్రకటించిన తర్వాత విధులకు వచ్చాడు', 'అంపైర్ ఇంకా.. ఇంటర్నెట్ ఎక్స్‌ప్లోరర్ మోడ్‌లోనే ఉన్నట్లు ఉన్నాడు', 'వికెట్ కీపర్ నీ బెస్ట్ ఫ్రెండ్ అయి ఉంటాడు', 'డూడ్.. కాస్త చిన్నగా ఆడండి.. అతడి బుర్రలో రిప్లే అవుతుంది' అని ఆ వీడియోను తెగ షేర్ చేసేస్తున్నారు. అసలు ఆ మ్యాచ్ ఎక్కడ జరిగిందో తెలియదు కానీ తెగ వైరలవుతోంది.
- — Out Of Context Cricket (@GemsOfCricket) March 5, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
— Out Of Context Cricket (@GemsOfCricket) March 5, 2023
">— Out Of Context Cricket (@GemsOfCricket) March 5, 2023