ETV Bharat / sports

కోహ్లీతో మాట్లాడాక ఆత్మవిశ్వాసం పెరిగింది: అండర్​-19 కెప్టెన్​ - అండర్​ 19 ప్రపంచకప్​ యశ్​ ధుల్​

Under-19 Yash Dhull about kohli: అండర్​-19 ప్రపంచకప్​ ఫైనల్​ మ్యాచ్​కు ముందు టీమ్​ఇండియా మాజీ సారథి కోహ్లీతో మాట్లాడటం తమకు ధైర్యానిచ్చిందని అన్నాడు కుర్రాళ్ల జట్టు కెప్టెన్​ యశ్​ ధుల్​. ఫైనల్​లో ఎలాంటి ప్రణాళికలు రచించాలి, ఎలా ఆడాలనే విషయాలపై విరాట్​ సూచనలు చేసినట్లు తెలిపాడు.

Under-19 Yash Dhull about kohli
అండర్​ 19 ప్రపంచకప్​
author img

By

Published : Feb 5, 2022, 12:45 PM IST

Under-19 Yash Dhull about kohli: టీమ్‌ఇండియా మాజీ సారథి కోహ్లీతో మాట్లాడిన తర్వాత తమలో ఆత్మవిశ్వాసం పెరిగిందని అన్నాడు అండర్‌-19 టీ20 ప్రపంచకప్‌ జట్టు కెప్టెన్‌ యశ్‌ ధుల్‌. కీలక మ్యాచ్​ ఫైనల్​కు ముందు విరాట్​ లాంటి అద్భుత ఆటగాడితో మాట్లాడటం తమకు ఎంతో ఉపయోగపడుతుందని చెప్పాడు. కోహ్లీ మాటలు మానసిక స్థైర్యాన్ని ఇచ్చాయని పేర్కొన్నాడు. నేడు జరగబోయే తుది పోరులో ఇంగ్లాండ్​తో తలపడనుంది భారత జట్టు. ఈ నేపథ్యంలోనే తాజా ఇంటర్వ్యూలో పాల్గొన్న ధుల్​ ఈ విషయాల్ని తెలిపాడు. ఫైనల్​లో ఎలాంటి ప్రణాళికలు రచించాలి, ఎలా ఆడాలనే విషయాలను కూడా విరాట్‌ వివరించాడని యువ సారథి​ వెల్లడించాడు.

తాము ఈ మ్యాచ్‌ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నామని.. సానుకూల ఆలోచనా ధోరణితో తుదిపోరులో తలపడతామని ధుల్​ అన్నాడు. "ఇంగ్లాండ్‌ కూడా సెమీస్‌లో అఫ్గానిస్థాన్‌తో చివరి వరకూ పోరాడి గెలిచింది. ఆ జట్టును కట్టడి చేయడానికి మా ప్రాణాళికలకు కట్టుబడి పనిచేస్తాం. అలాగే మా జట్టులోని ప్రతి ఒక్కరూ 100 శాతం రాణించడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ టోర్నీలో మాకు తగినంత అనుభవం దొరికింది, దీంతో పెద్ద మ్యాచ్‌లకు ముందు మానసికంగా ఎలా సన్నద్ధమవ్వాలో తెలిసింది. తుది పోరుకు ముందు మేము బలంగా మారాం. ఒత్తిడిని తట్టుకొని ఎలా రాణించాలో కూడా తెలిసింది" అని యశ్‌ ధుల్‌ అన్నాడు.

కాగా, ఈ యువ కెప్టెన్‌ ఆసీస్‌తో తలపడిన సెమీ ఫైనల్లో శతకంతో రాణించిన సంగతి తెలిసిందే. 2008లో విరాట్‌ కోహ్లీ, 2012లో ఉన్ముక్త్‌ చంద్‌ ఇలాగే సెంచరీలు బాది జట్టును విజేతగా నిలిపారు. ఇప్పుడు యశ్‌ ధుల్ సైతం అలాంటి ప్రదర్శనతోనే మరో అండర్‌-19 ప్రపంచకప్‌ తీసుకొస్తాడని అభిమానులు ఆశిస్తున్నారు.

ఇదీ చూడండి: భారత సంతతి కుర్రాడు అదరహో.. అఫ్గాన్​పై ఆసీస్​ విజయం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.