ETV Bharat / sports

తండ్రైన ఉమేశ్​ యాదవ్​.. టీమ్​ఇండియా క్రికెటర్​కు అభినందనల వెల్లువ - ఉమేశ్​ యాదవ్ భార్య తన్య

టీమ్​ఇండియా పేసర్​ ఉమేశ్​ యాదవ్​ గురువారం తండ్రయ్యాడు. మహిళ దినోత్సవ రోజు ఈ సంతోషకర విషయాన్ని తన అభిమానులకు ట్విట్టర్​ ద్వారా పంచుకున్నాడు.

umesh yadav blessed with a baby girl
umesh yadav
author img

By

Published : Mar 8, 2023, 3:02 PM IST

Updated : Mar 8, 2023, 3:49 PM IST

టీమ్​ ఇండియా స్టార్​ పేసర్​ ఉమేశ్​ యాదవ్​ తండ్రిగా ప్రమోషన్​ పొందాడు. మార్చి 8న తాము తల్లిదండ్రులయ్యామంటూ ట్విట్టర్​ వేదికగా ఆనందన్ని వ్యక్తం చేశాడు ఉమేశ్. మహిళా దినోత్సవం రోజు తనకు పండంటి ఆడపిల్ల పుట్టిందంటూ సోషల్​ మీడియాలో అభిమానులతో తన సంతోషాన్ని పంచుకున్నాడు. దీంతో ఉమేశ్​ యాదవ్​ అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. ఈ శుభ వార్తతో క్రికెట‌ర్ల‌తో పాటు అభిమానులు ఈ ఉమేశ్​, తన్యకు శుభాకాంక్ష‌లు తెలియజేశారు. చిన్నారికి ఆశీర్వదించారు. ప్ర‌స్తుతం ఆస్ట్రేలియాతో జరుగుతున్న బోర్డ‌ర్-గ‌వాస్క‌ర్ సిరీస్‌ ఆడుతున్నాడు ఉమేశ్​ యాద‌వ్‌.

ఫిబ్రవరిలో ఉమేశ్ యాదవ్ తండ్రి తిలక్ యాదవ్ అనారోగ్యంతో కన్నుమూశారు. ఇక, బిడ్డ పుట్టడం వల్ల ఆ బాధలో ఈ పేసర్​కు కాస్త ఉపశమనం కలిగినట్లైంది. అయితే ఈ దంపతులిద్దరికీ 2021లో పాప పుట్టింది. ఇప్పుడు మరో మహిళా దినోత్సవం రోజు ఆడపిల్ల పుట్టడం వల్ల ఉమేశ్​ సంతోషాకి అవధులు లేకుండా పోయాయి. ఐపీఎల్ వేడుక‌లో తన్య‌ను చూసిన ఉమేష్.. తొలి చూపులోనే ఆమెతో ప్రేమ‌లో ప‌డ్డాడు. కామ‌న్ ఫ్రెండ్స్ ద్వారా వారిద్దరి మ‌ధ్య పరిచయం ఏర్పడింది. ఆ ప‌రిచ‌యం కాస్త ప్రేమ‌గా మారి.. పెద్ద‌ల అంగీకారంతో 2013లో వివాహ బంధంతో ఒక్కటయ్యారు​. బోర్డర్​-గావస్కర్​ ట్రోఫీలో బిజీగా ఉన్న ఉమేస్​.. ఈ చివరి మ్యాచ్ ముగిసిన తర్వాత కుమార్తెను చూసేందుకు వెళ్లే అవకాశం ఉంది.

కాగా, మూడో టెస్ట్‌లో ఆడే అవ‌కాశాన్ని ద‌క్కించుకున్న ఉమేశ్​.. ఆ మ్యాచ్​లో మూడు వికెట్లు తీసి స‌త్తా చాటాడు. స్పిన్‌కు అనుకూలించిన పిచ్‌పై పేస్ బౌలింగ్‌తో ఆస్ట్రేలియా ఆట‌గాళ్ల‌కు చుక్కలు చూపించాడు. అలా నాలుగో టెస్ట్‌లో త‌న స్థానాన్ని దాదాపు ప‌దిలం చేసుకున్నాడు. ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కు టీమ్ఇండియా చేరాలంటే.. ఈ నాలుగో టెస్టులో తప్పక గెలవాల్సి ఉంది. దీంతో కాస్త ఫాస్ట్​బౌలింగ్​కు అనుకూలించే పిచ్‌పై.. నాలుగో టెస్టుని నిర్వహించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో వేగంగా బంతులు విసరగలిగే ఉమేశ్ యాదవ్ జట్టుకు కీలకం అవుతాడు.

మరోవైపు, భారత్-ఆస్ట్రేలియా మధ్య అహ్మదాబాద్​ వేదికగా జరుగనున్నఈ ప్రతిష్టాత్మక మ్యాచ్​కు భారత ప్రధాని నరేంద్ర మోదీ, ఆస్ట్రేలియా ప్రధాని అంథోనీ అల్బనీస్ హాజరు కానున్నారు. నాలుగో టెస్ట్ తొలిరోజు ఆటను కలిసి వీక్షించనున్నారు. ఇందుకోసం మొతేరాలో ఉన్న నరేంద్ర మోదీ స్టేడియంలో భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ టెస్ట్ మ్యాచ్‌ తొలిరోజు లక్ష మంది వరకు ప్రేక్షకులు వస్తారని అంచనా. దీంతో ఎక్కువ మంది వీక్షకులు వచ్చిన స్టేడియంగా రికార్డు బద్దలుగొట్టనుంది. కాగా, ఇరుదేశాల ప్రధానులు హాజరుకానున్న వేళ.. 3 వేల మంది పోలీసులతో భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. వీరికి అదనంగా కేంద్రబలగాలు కూడా భద్రతా ఏర్పాట్లలో నిమగ్నమయ్యాయి.

Last Updated : Mar 8, 2023, 3:49 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.