ETV Bharat / sports

IPL 2021: ఆ నిర్ణయంతో ఐపీఎల్​ ఫ్రాంచైజీలకు చిక్కులు! - ఐపీఎల్ గురించి కాశీ విశ్వనాథన్

ఐపీఎల్​ ఫ్రాంచైజీలకు కొత్త చిక్కులొచ్చి పడ్డాయి. ఈ విషయమై ఆందోళన వ్యక్తం చేశారు చెన్నై సూపర్​కింగ్స్ సీఈఓ కాశీ విశ్వనాథన్. ఇంతకీ జట్ల యాజమాన్యలకు వచ్చిన సమస్యేంటి?

IPL
ఐపీఎల్
author img

By

Published : Jun 30, 2021, 12:40 PM IST

ఐపీఎల్ మిగిలిన మ్యాచ్​లను యూఏఈలో జరపనున్నట్లు ఇప్పటికే బీసీసీఐ ప్రకటించింది. అక్టోబర్ 17న టీ20 ప్రపంచకప్ మొదలవుతున్న కారణంగా వారం, పది రోజుల ముందే సీజన్​ పూర్తి చేయాల్సి ఉంటుంది. అంటే సెప్టెంబర్​ మొదటి వారంలో లేదా ఆగస్టు చివరి వారంలో టోర్నీని ప్రారంభించాలి. ఇప్పటివరకు ఈ షెడ్యూల్​పై ఎలాంటి అధికారిక ప్రకటన రాకపోయినా.. ముందుగానే అన్ని ప్రణాళికల్ని రూపొందిస్తున్నాయి ఫ్రాంచైజీలు. అయితే ఇక్కడే ఒక చిక్కొచ్చి పడింది.

ఆటగాళ్లు ఉండేందుకు హోటల్స్, ప్రాక్టీస్ కోసం మైదానాలు వంటి పనుల కోసం ఫ్రాంచైజీలు ఇప్పటికే సంప్రదింపులు ప్రారంభించాయి. ఈ క్రమంలోనే కొందరు అధికారులు ఈ విషయమై యూఏఈ వెళ్లాలని భావించారు. కానీ అక్కడి ప్రభుత్వం భారత్ నుంచి వచ్చే విమానాలపై జులై 21 వరకు నిషేధాన్ని పొడిగించింది. దీంతో అధికారులకు కొత్త చిక్కులు వచ్చాయి. ఈ విషయమై చెన్నై సూపర్ కింగ్స్ సీఈఓ కాశీ విశ్వనాథన్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

"హోటల్స్​ను బుక్​ చేయడం పెద్ద సమస్య కాదు. కానీ విమానాల నిషేధం మాత్రం కచ్చితంగా పెద్ద సమస్యే. ఇది మా ప్రణాళికల్ని ఆలస్యం చేస్తుంది. హోటల్​ల గురించి ఇప్పటికే అక్కడి వారితో మాట్లాడుతున్నాం. బీసీసీఐ షెడ్యూల్ విడుదల చేయగానే హోటల్స్​ను బుక్ చేస్తాం"

-కాశీ విశ్వనాథన్, సీఎస్కే సీఈఓ

అలానే అక్కడ ఎంతో ఫేమస్​ అయిన దుబాయ్ ఎక్స్​పో అక్టోబర్​లో ప్రారంభం కానుంది. ఇదే నెలలో టీ20 ప్రపంచకప్ జరగనుంది. దీంతో అక్కడ హోటల్స్ ధరలు పెరగనున్నాయి. ఈ సమయంలో అక్కడ అనుకూలమైన హోటల్స్​ను తీసుకుని బయోబబుల్​ను ఏర్పాటు చేయడం ఫ్రాంచైజీలకు పెద్ద తలనొప్పిగా మారనుంది.

ఇవీ చూడండి: ఐపీఎల్​లో కొత్త జట్లు.. ధర చూస్తే షాకవ్వాల్సిందే!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.