ETV Bharat / sports

ఆ టీ20 లీగ్​లోకి ఐపీఎల్​ ఫ్రాంఛైజీలు.. బరిలోకి స్టార్​ ఆటగాళ్లు! - ఐపీఎల్​ ఆటగాళ్లు

యూఏఈలో వచ్చే ఏడాది నిర్వహించనునన్న టీ20 లీగ్​లో మూడు ఐపీఎల్​ ఫ్రాంఛైజీలు భాగస్వామ్యం కానున్నాయి. ఒక్కో ఐపీఎల్​ జట్టు నుంచి నలుగురు ఆటగాళ్లు యూఏఈ లీగ్​లో ఆడటానికి నిర్వాహకులు అనుమతినిచ్చారు.

d
d
author img

By

Published : Jun 3, 2022, 5:31 PM IST

ఐపీఎల్​ సూపర్​ సక్సెస్​ తర్వాత ఇతర క్రికెట్​ బోర్డులు కూడా ఈ తరహా టీ20 లీగ్​లకు శ్రీకారం చుట్టాయి. ఇప్పటికే బిగ్​బ్యాష్​, కరీబియన్​, పీఎస్​ఎల్, బీపీఎల్​​ మొదలైన టీ20 లీగ్​లు ఏర్పడ్డాయి. ఇప్పుడు ఈ జాబితాలో మరో రెండు టీ20 లీగ్​లు చేరనున్నాయి. యూఏఈ క్రికెట్​ బోర్డు ఆధ్వర్యంలో ఒకటి.. దక్షిణాఫ్రికా క్రికెట్​ బోర్డు నిర్వహణలో మరొకటి వచ్చే ఏడాది ఆరంభం కానున్నాయి. ఈ యూఏఈ టీ20 లీగ్​కు సంబంధించి ఆసక్తికర విషయాలు తెలిశాయి. ఐపీఎల్ స్టార్​ ​ ఫ్రాంఛైజీలు అయిన ముంబయి ఇండియన్స్​, దిల్లీ క్యాపిటల్స్​, కోల్​కతా నైట్​రైడర్స్​ జట్లు ఇందులో భాగం కానున్నాయి. ఈ నేపథ్యంలో యూఏఈ టీ20 లీగ్​కు సంబంధించి కీలక ప్రకటన చేశారు నిర్వహకులు.

వాళ్లు ఈ లీగ్​లో ఆడొచ్చు: యూఏఈ టీ20 లీగ్​లో భాగమైన ఐపీఎల్​ ఫ్రాంఛైజీలు తమ మాతృఫ్రాంఛైజీలకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఆటగాళ్లను ఎంపిక చేసుకోవచ్చని నిర్వహకులు ప్రకటించారు. అంటే ఐపీఎల్​లో కీలక ఆటగాళ్లు అయిన పొలార్డ్​, రసుల్​, టిమ్​ డేవిడ్​ మొదలైన వారు యూఏఈ టీ20 లీగ్​లోని జట్లలో ఫ్రాంఛైజీలు ఆడించే అవకాశం ఉంది. కానీ ఒక జట్టుకు కేవలం నలుగురు ఆటగాళ్లకు మాత్రమే అనుమతించారు. కాగా, ఈ లీగ్​కు ఆటగాళ్ల ఎంపిక ఎలా ఉంటుందనే విషయంపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. సాధారణంగా డ్రాఫ్ట్​ లేదా ఆక్షన్​ విధానంలో ఆటగాళ్ల ఎంపిక ఉంటుంది. అయితే డ్రాఫ్ట్​ విధానానికే నిర్వహకులు మొగ్గు చూపినట్లు సమాచారం. మరోవైపు ఫ్రాంఛైజీలు తమ జట్లకు ఎంపిక చేసుకునే ఆ నలుగురు ఆటగాళ్లు తమ దేశబోర్డు నుంచి ఎన్​ఓసీ పొందాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. 2023 జనవరి-ఫిబ్రవరి మధ్య ప్రారంభంకానున్న ఈ లీగ్​లో ఆరు జట్లు తలపడనున్నాయి.

సఫారీల లీగ్​ కూడా అప్పుడే: యూఏఈ క్రికెట్​ లీగ్​కు పోటీగా టీ20 లీగ్​ను తెచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది దక్షిణాఫ్రికా క్రికెట్​ బోర్డు. షెడ్యూల్​పై ఇంకా ఎలాంటి క్లారిటీ లేకపోయినా.. వచ్చే ఏడాది జనవరి-ఫిబ్రవరి నెలల్లోనే ఈ లీగ్​ జరగనున్నట్లు తెలుస్తోంది. ఈ లీగ్​ కోసం దక్షిణాఫ్రికా బోర్డు క్రికెట్​ ఆస్ట్రేలియాను సంప్రదించింది. ఆ సమయంలో ఆస్ట్రేలియా జట్టు ఆడే మ్యాచ్​లను వాయిదా వేసుకోవాలని సౌతాఫ్రికా బోర్డు విజ్ఞప్తి చేసింది.

ఇదీ చూడండి : 'భారత్‌, పాక్‌ ప్లేయర్స్​ తలపడాలనుకుంటున్నారు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.