ETV Bharat / sports

'కార్టూన్ల బదులు క్రికెట్​ చూశా'.. నాన్న దిద్దిన తెలుగు తేజం మన త్రిష!

మొదటి సారి వరల్డ్​కప్​ను సొంతం చేసుకున్న అండర్​-19 జట్టులో తెలుగు తేజం గొంగడి త్రిష అద్భుత ప్రదర్శన చేసింది. ఫైనల్​లో సౌమ్య తివారీతో కలిసి 46 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి జట్టు విజయంలో కీలకంగా నిలించింది. అయితే త్రిష సక్సెస్​ వెనుక ఆమె తండ్రి కష్టం ఎంతో ఉంది. కుమార్తె కెరీర్​ కోసం తన జీవనోపాధిని కూడా త్యాగం చేశాడు. ఇదే నాన్న దిద్దిన తెలుగు తేజం త్రిష గాథ..

trisha was made to watch cricket matches instead of cartoons

author img

By

Published : Jan 30, 2023, 9:08 PM IST

అమ్మాయిలు అదరగొట్టారు.. చరిత్ర సృష్టించారు.. తొలి కళను ముద్దాడారు.. తాజాగా ఏ క్రికెట్ అభిమాని నోరు తెరచినా పలికే మాటలివే అంటే అతిశయోక్తి కాదు. అంతగా వారి పేరు మార్మోగిపోతోంది. అండర్​-19 వరల్డ్​కప్​ ఫైనల్​లో ఇంగ్లాండ్​పై ఘన విజయం సాధించి చరిత్ర లిఖించారీ అమ్మాయిలు. ఏ ప్లేయర్​ను కదిలించినా.. వారు అనుభవించిన కష్టాల కన్నీళ్లకు.. ఈ గెలుపు ఆనంద బాష్పాలు సమాధానాలని చెబుతున్నారు. ఇప్పుడు దేశం వారివైపు చూస్తోంది. వారి వీర గాథలను వింటోంది. ఆ ప్లేయర్లలో ఓ ఆణిముత్యమే ఈ తెలుగు తేజం గొంగడి త్రిష. అయితే త్రిష సక్సెస్​ వెనుక ఆమె తండ్రి కష్టం ఎంతో ఉంది. కుమార్తె కెరీర్​ కోసం తన జీవనోపాధిని కూడా త్యాగం చేశాడు. ఇదే నాన్న దిద్దిన తెలుగు తేజం త్రిష గాథ..

trisha was made to watch cricket matches instead of cartoons
గొంగడి త్రిష

కార్టూన్ల బదులు.. క్రికెట్​ చూశా..
తెలుగు నేల గర్వించ దగ్గ ప్లేయర్​గా ఎదిగిన గొంగడి త్రిషది సాధారణ నేపథ్యమే. తెలంగాణలోని భద్రాచలం ఆమె స్వస్థలం. తండ్రి గొంగడి రెడ్డి. త్రిషకు చిన్నప్పటి నుంచే క్రికెట్​పై​ అభిమానం ఏర్పడింది. సాధారణంగా చిన్న పిల్లలు టీవీలో వచ్చే కార్టున్లు ఎక్కువగా చూస్తారు. కానీ ఏడేళ్ల వయసు నుంచే త్రిష కార్టూన్లకు బదులు.. క్రికెట్​ చూసేదట. అలా క్రికెట్​ను కెరీర్​గా ఎంచుకుంది. కానీ, ఈ సక్సెస్​ వెనుక.. త్రిష ఆసక్తి మాత్రమే కాదు.. ఆమె తండ్రి సంకల్పం కూడా ఇంది. కుమార్తె భవిష్యత్​ కోసం ఆయన తన జీవన ఆధారాన్నే త్యాగం చేశాడు.

నా జీవన ఆధారాన్ని అమ్ముకున్నా..
కుమార్తె కోసం తన జీవన ఆధారాన్నే అమ్మేశాడు త్రిష తండ్రి రెడ్డి. తనకున్న జిమ్​ను నష్టానికి తన బంధువలకే అమ్ముకున్నాడు. అనంతరం మరో జిమ్​లో ఫిట్​నెస్​ ట్రైనర్​గా జాయిన్​ అయ్యాడు. కుమార్తె భవిష్యత్​ కోసం అది కూడా వదులుకున్నాడు. అనంతరం కుమార్తెను ఎలాగైనా క్రికెటర్​ను చేయాలని కుటుంబంతో సహా సికింద్రాబాద్​కు షిఫ్ట్ అయ్యాడు. అక్కడైతే క్రికెట్ ట్రైనింగ్​కు అన్ని సౌకర్యాలను ఉంటాయని భావించాడు. 2012లో తన కుమార్తె నెట్స్​లో ప్రాక్టీసు చేస్తున్న వీడియోను.. సేయింట్​ జాన్​ అకాడమీలోని కోచ్​లు​ జాన్​ మనోజ్​, శ్రీనివాస్​కు చూపించాడు. కాగా, త్రిష బ్యాటింగ్​ స్పీడ్​కు.. ఆమె కళ్లు, చేతులకు ఉన్న కోఆర్డినేషన్​కు ఇంప్రెస్​ అయ్యి ఆమెకు ట్రైనింగ్​ ఇచ్చారు. ఈ మేరకు ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కోచ్​ మనోచ్​ చెప్పాడు. ఇక, తన కుమార్తె వరల్డ్​ కప్​ సాధించిన సందర్భంగా మాట్లాడుతూ.. ' నేను కుమార్తె క్రికెట్​ ట్రైనింగ్​ కోసం నాలుగు ఎకరాలు భూమి అమ్మాను. భారత్​ వరల్డ్​కప్​ గెలవడం ఆమె కల. అలాంటి ఆమె కలల్ని నేరవేర్చడానికి ఏం కోల్పోడానికైనా సిద్ధమే' అని చెప్పారు రెడ్డి.

త్రిష ఫ్యామిలీ సికింద్రాబద్​కు షిఫ్ట్ అయిన తర్వాత.. 2014-15 ఇంటర్​ స్టేట్​ టోర్నీలో మొదటిసారి అండర్​-16 జట్టులో ఆడింది. అనంతరం స్టేట్​ తరఫున అండర్​-16, అండర్​-19 టోర్నీలకు ఆడింది. ఆ తర్వాత అండర్​-19 ఛాలెంజర్​ ట్రోఫీలో ఛాన్స్​ సంపాదించింది.
ఆదివారం జరిగిన అండర్​-19 వరల్డ్​ కప్​లో ఫైనల్​లో త్రిష మంచి ప్రదర్శన చేసింది. మూడో వికెట్​కు సౌమ్య తివారీతో కలిసి 46 పరుగులు జోడించింది. దీంతో ఇంగ్లాండ్​ నిర్దేశించిన 69 పరుగుల లక్ష్యాన్ని టీమ్ఇండియా ఛేదించడంలో కీలక పాత్ర పోషించింది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.