ETV Bharat / sports

U19 WC: భారత జట్టుతో కలవనున్న ఐదుగురు రిజర్వ్ ఆటగాళ్లు - అండర్ 19 ప్రపంచకప్ రిజర్వ్ ఆటగాళ్లు

U19 WC: వెస్టిండీస్ వేదికగా జరుగుతున్న అండర్-19 ప్రపంచకప్​లో పాల్గొన్న భారత జట్టులో ఆరుగురు ఆటగాళ్లకు కరోనా సోకింది. దీంతో ఐదుగురు రిజర్వ్ ఆటగాళ్లను విండీస్ పంపేందుకు సిద్ధమైంది బీసీసీఐ.

U19 WC India, అండర్ 19 ప్రపంచకప్ భారత్
U19 WC
author img

By

Published : Jan 21, 2022, 4:04 PM IST

U19 WC: వెస్టిండీస్ వేదికగా జరుగుతున్న అండర్-19 ప్రపంచకప్​లో పాల్గొన్న టీమ్ఇండియా జట్టులో కరోనా కలవరం రేకెత్తించింది. జట్టులో ఏకంగా ఆరుగురు ప్లేయర్లు మహమ్మారి బారినపడటం వల్ల వారిని ఐసోలేషన్​లో ఉంచారు. ఈ నేపథ్యంలో వీరి స్థానంలో ఐదుగురు రిజర్వ్ ప్లేయర్లను విండీస్​కు పంపేందుకు సిద్ధమైంది బీసీసీఐ. కీలకమైన క్వార్టర్స్​ మ్యాచ్ సమయానికి వీరంతా క్వారంటైన్ పూర్తి చేసుకుని జట్టుతో కలుస్తారని వెల్లడించారు అధికారులు.

రిజర్వ్ ఆటగాళ్లు వీరే- ఉదయ్ సహరన్, అభిషేక్ పోరెల్ (వికెట్ కీపర్), రిషిత్ రెడ్డి, అన్ష్ గోసాయ్, పీఎం సింగ్ రాథోడ్.

వీరంతా విండీస్ చేరగానే ఆరు రోజుల పాటు క్వారంటైన్​లో ఉండనున్నారు. ఇప్పటికే వరుసగా దక్షిణాఫ్రికా, ఐర్లాండ్​తో జరిగిన రెండు మ్యాచ్​ల్లో గెలిచిన భారత జట్టు గ్రూప్-బి టేబుల్ టాపర్​గా కొనసాగుతోంది. దీంతో జనవరి 29న జరగబోయే క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ వరకు.. జట్టు పూర్తి ఫిట్​నెస్​తో ఉంటుందని బీసీసీఐ ఆశాభావం వ్యక్తం చేస్తోంది.

ఐర్లాండ్​తో జరిగిన మ్యాచ్​కు ముందు టీమ్ఇండియా నుంచి నలుగురు ఆటగాళ్లు కరోనా బారినపడినట్లు తెలిపింది బోర్డు. కెప్టెన్ యశ్ ధుల్, వైస్ కెప్టెన్​ ఎస్కే రషీద్​తో పాటు మరో ఇద్దరికి వైరస్ సోకినట్లు వెల్లడించింది. వీరితో పాటు మరో ఇద్దరికి లక్షణాలు కనిపించడం వల్ల వారికి టెస్టులు నిర్వహించి ఐసోలేషన్​నకు పంపినట్లు అధికారులు పేర్కొన్నారు. ఇలా కీలక ఆటగాళ్లు మ్యాచ్​కు దూరమైనా.. నిషాంత్ సింధు నేతృత్వంలోని యువ భారత జట్టు.. ఐర్లాండ్​ను 174 పరుగుల తేడాతో చిత్తుచేసింది. శనివారం గ్రూప్​ దశలోని తన ఆఖరి మ్యాచ్​లో ఉగాండాతో తలపడనుంది టీమ్ఇండియా.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

ఇవీ చూడండి: ఐపీఎల్ జట్లకు కైఫ్, యూసఫ్ బంపర్ ఆఫర్.. ఏంటంటే?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.