ETV Bharat / sports

T20 World Cup: 'కిక్‌ సండే'.. మంచి మజానిచ్చే మ్యాచ్‌ల డే - టీ20 ప్రపంచకప్​ 2022 వార్తలు

క్రికెట్ ప్రేమికులకు వచ్చే వారం అసలైన పండగ వాతావరణం రాబోతోంది. ఇప్పుడేమీ ఫెస్టివల్స్‌ లేవు కదా.. అని డౌటా..? అందుకే క్రికెట్‌ ఫ్యాన్స్‌కు అని మాత్రమే చెప్పాం. అదేంటో తెలుసుకోవాలంటే ఇది చదివేయండి..

T20 World Cup
T20 World Cup
author img

By

Published : Nov 5, 2022, 10:46 PM IST

T20 World Cup: ప్రస్తుతం ఆస్ట్రేలియా వేదికగా సాగుతోన్న టీ20 ప్రపంచకప్‌ సూపర్ - 12 పోరు చివరి దశకు వచ్చింది. ఇప్పటికే రెండు జట్లు సెమీస్‌కు వెళ్లిపోగా.. మరో రెండు బెర్తుల కోసం నాలుగు జట్లు రేసులో నిలిచాయి. అందుకే నవంబర్‌ 6 నుంచి నవంబర్ 13వ తేదీ వరకు పండగే పండగ. మరీ ముఖ్యంగా ఆదివారం అంతా రిలాక్స్‌ అయిపోదామని అనుకొంటే కుదరదండోయ్.. నరాలు తెగే ఉత్కంఠభరిత మ్యాచ్‌లు జరిగేది ఆదివారాలే మరి. పొట్టికప్‌ ఫైనల్‌ (నవంబర్ 13న) మ్యాచ్‌ సహా రెండు సెమీస్ బెర్తులు ఖరారయ్యే మ్యాచ్‌లు (నవంబర్ 6న) జరగబోయేది 'కిక్‌ సండే'. మరి ఏ జట్లు సెమీస్‌కు వెళ్లాయి..? రెండు బెర్తుల కోసం పోటీ పడుతున్న టీమ్‌లు ఏవి..? వారి పరిస్థితి ఏంటో చూద్దాం..

తాజాగా శ్రీలంకపై విజయం సాధించిన ఇంగ్లాండ్‌ ఉత్తమ రన్‌రేట్‌తో గ్రూప్ - 1 నుంచి సెమీస్‌కు దూసుకెళ్లింది. అంతకుముందే కివీస్‌ కూడా సెమీస్‌ బెర్తును ఖరారు చేసుకొన్న తొలి జట్టుగా అవతరించిన విషయం తెలిసిందే. ఇక గ్రూప్‌ - 2 నుంచి రెండు బెర్తులను దక్కించుకొనే జట్లేవో తేలాలంటే ఆదివారం వరకు వేచి చూడాలి. మూడు మ్యాచులూ కీలకమైన తరుణంలో కాస్త ముందంజలో నిలిచిన జట్టు భారత్‌.. ఆ తర్వాత దక్షిణాఫ్రికా, పాకిస్థాన్‌, బంగ్లాదేశ్‌ ఉన్నాయి. ఇక నెదర్లాండ్స్‌, జింబాబ్వేకి అవకాశాలు లేవు. అయితే ఇతర జట్ల ఫలితాలను ప్రభావితం చేయగల స్థానంలో ఉండటం గమనార్హం. భారత కాలమానం ప్రకారం.. ఆదివారం ఉదయం 5.30 గంటలకు దక్షిణాఫ్రికా X నెదర్లాండ్స్, ఉదయం 9.30 గంటలకు పాకిస్థాన్‌ X బంగ్లాదేశ్‌, మధ్యాహ్నం 1.30 గంటలకు భారత్ X జింబాబ్వే జట్ల మధ్య మ్యాచ్‌లు జరుగుతాయి.

భారత్‌ X జింబాబ్వే మ్యాచ్‌..
టీమ్‌ఇండియా ఆడిన నాలుగు మ్యాచుల్లో మూడు విజయాలు, ఒక ఓటమితో 6 పాయింట్లతో గ్రూప్‌ -2లో అగ్రస్థానం దక్కించుకొంది. చివరి మ్యాచ్‌ మనదే కాబట్టి గెలిచే అవసరం ఉందా..? లేదా..? అనేది అప్పటికే తేలిపోతుంది. అయితే జింబాబ్వేపై విజయం సాధిస్తే అగ్రస్థానంతో సెమీస్‌కు చేరే అవకాశం ఉంది. ఒక వేళ వర్షం కారణంగా రద్దు అయినా మనకు ఎలాంటి ఢోకా లేదు. అప్పుడు భారత్‌ ఖాతాలో ఏడు పాయింట్లు ఉంటాయి. ఒకవేళ దక్షిణాఫ్రికా, పాకిస్థాన్‌ తమ చివరి మ్యాచుల్లో విజయం సాధించినా ఒక సెమీస్‌ బెర్తు మాత్రం మనదవుతుంది. టీ20 ఫార్మాట్‌ అంటేనే ఏ క్షణాన ఏం జరుగుతుందో ఊహించలేం. అందుకే జింబాబ్వే చేతిలో టీమ్‌ఇండియా ఓడితే మాత్రం.. ఇబ్బందులు తప్పవు.

దక్షిణాఫ్రికా పరిస్థితి ఇలా..
దక్షిణాఫ్రికా ఇప్పుడు 5 పాయింట్లతో రెండో స్థానంలో ఉంది. ఇందులో రెండు విజయాలు, ఒక ఓటమి, ఒక రద్దు ఉన్నాయి. ఇక తన చివరి మ్యాచ్‌ను నెదర్లాండ్స్‌తో ఆడాల్సి ఉంది. ప్రస్తుత సఫారీల ఫామ్‌ను బట్టి నెదర్లాండ్స్‌ను ఢీకొట్టడం పెద్ద విషయం కాదు. ఇప్పటికే టీ20 ప్రపంచకప్‌లో సంచలనాలు నమోదైన నేపథ్యంలో ఏం జరుగుతుందో అంచనా వేయలేం. అందుకే నెదర్లాండ్స్‌ ఏదైనా అద్భుతం చేస్తే టీమ్‌ఇండియాకు ఎలాంటి ఢోకా ఉండదు. తన చివరి మ్యాచ్‌లో భారత్‌ ఓడినా ఇబ్బంది లేకుండా సెమీస్‌కు చేరుకొంటుంది. నెదర్లాండ్స్‌పై దక్షిణాఫ్రికా గెలిస్తే ఏడు పాయింట్లతో సెమీస్ బెర్తు ఖాయం చేసుకుంటుంది.

పాకిస్థాన్‌ - బంగ్లాదేశ్ పోరూ కీలకమే..
ప్రస్తుతం మిగిలి ఉన్న మూడు మ్యాచుల్లో అత్యంత కీలకమైన మ్యాచ్‌ పాక్‌ - బంగ్లా మ్యాచ్‌ కావడం గమనార్హం. దీని వల్ల మూడు జట్ల ఫలితాలు ఆధారపడి ఉంది. ఒక వేళ పాకిస్థాన్‌ గెలిస్తే.. అప్పుడు ఆరుపాయింట్లు సాధిస్తుంది. జింబాబ్వే చేతిలో భారత్‌ ఓడిపోతే రన్‌రేట్‌ కీలకంగా మారుతుంది. అయితే భారత్‌ కంటే పాక్‌ నెట్‌రన్‌రేట్‌ ఎక్కువగా ఉండటంతో దాయాది దేశం సెమీస్‌ బెర్తును ఖాయం చేసుకొనే అవకాశం ఉంది. ఒకవేళ పాక్‌పై బంగ్లా భారీ విజయం కాకుండా మామూలుగా గెలిస్తే మాత్రం టీమ్‌ఇండియా పంట పండినట్లే. ఎందుకంటే బంగ్లా కంటే భారత్‌ నెట్‌రన్‌రేట్‌ మెరుగ్గా ఉంది. పాక్‌పై బంగ్లా భారీ విజయం నమోదు చేసి.. భారత్‌ తన చివరి మ్యాచ్‌లో ఓడితే అనూహ్యంగా బంగ్లాదేశ్‌కు అదృష్టం కలిసి వచ్చి సెమీస్‌కు చేరుతుంది. వాతావరణం అనుకూలించక మ్యాచ్‌ రద్దు అయితే దక్షిణాఫ్రికా, భారత్‌ సెమీస్‌ చేరుకొని.. బంగ్లా, పాక్‌ ఇంటిముఖం పట్టక తప్పదు.

ఇన్ని తిప్పలు లేకుండా ఉండాలంటే.. నెదర్లాండ్స్‌పై దక్షిణాఫ్రికా, జింబాబ్వేపై భారత్‌ విజయాలు నమోదు చేస్తే ఎలాంటి సమీకరణాలు లేకుండా సెమీస్‌ బెర్తులు ఖాయమైపోతాయి. కివీస్, సఫారీలు మొదటి సెమీఫైనల్‌లో (నవంబర్ 9) తలపడతాయి. అప్పుడు తొలిస్థానంతో టీమ్‌ఇండియా రెండో సెమీస్‌లో (నవంబర్ 10) ఇంగ్లాండ్‌ను ఢీకొట్టే అవకాశం ఉంది. అక్కడ గెలిచిన రెండు జట్లు నవంబర్ 13న మెల్‌బోర్న్ వేదికగా టైటిల్‌ కోసం పోరాడుతాయి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.