R Ashwin DRS : తమిళనాడు ప్రీమియర్ లీగ్-2023లో మరో వింత సంఘటన వెలుగుచూసింది. కోయంబత్తూర్‌లో జరిగిన ఈ లీగ్‌తో ఈ సారి భారత వెటరన్ స్పినర్ రవిచంద్రన్ అశ్విన్ ట్రెండింగ్‌లోకి వచ్చాడు. ఇంతకీ అశ్విన్ ఏం చేశాడో తెలిస్తే.. 'నువ్వు నిజంగా తోపు భయ్యా' అనకుండా ఉండలేరు. అవును మరి.. ఒకే బాల్‌కు రెండో రివ్యూ కోరాడు అశ్విన్. అశ్విన్ ప్రవర్తించిన తీరుకు మైదానంలో ఉన్నవారంతా ముక్కున వేలేసుకోక తప్పలేదు.
Ba11sy Trichy vs Dindigul Dragons : టీఎన్‌పీఎల్ 2023లో భాగంగా బుధవారం కోయంబత్తూరులో దిండిగుల్ డ్రాగన్స్, బా11 ట్రిచ్చి మధ్య మ్యాచ్ జరిగింది. ఈ లీగ్‌లో అశ్విన్.. దిండిగుల్ డ్రాగన్స్ తరఫున ఆడుతున్నాడు. అయితే తిరుచ్చి ఇన్నింగ్స్ సమయంలో 13వ ఓవర్‌లో అశ్విన్ బౌలింగ్ వేశాడు. ఈ ఓవర్ చివరి బంతిని యాశ్ క్యారమ్ బాల్ వేయగా క్రీజులో ఉన్న బ్యాటర్ రాజ్‌కుమార్ కవర్స్ మీదుగా షాట్ ఆడేందుకు ప్రయత్నించాడు. కాగా, బంతి మిస్ అయి వికెట్ కీపర్ చేతికి చిక్కింది. అయితే బంతి బ్యాట్‌కు తగిలినట్లు శబ్దం రావడంతో అశ్విన్ సహా కీపర్ ఫీల్డ్‌లో ఉన్న అంపైర్‌కు అప్పీల్ చేసారు. దీంతో అంపైర్ కూడా ఔట్ ఇచ్చాడు.
-
Uno Reverse card in real life! Ashwin reviews a review 🤐
— FanCode (@FanCode) June 14, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
.
.#TNPLonFanCode pic.twitter.com/CkC8FOxKd9
">Uno Reverse card in real life! Ashwin reviews a review 🤐
— FanCode (@FanCode) June 14, 2023
.
.#TNPLonFanCode pic.twitter.com/CkC8FOxKd9Uno Reverse card in real life! Ashwin reviews a review 🤐
— FanCode (@FanCode) June 14, 2023
.
.#TNPLonFanCode pic.twitter.com/CkC8FOxKd9
Bowler and Batter Both Takes Reviews In TNPL 2023 : ఇదిలా ఉంటే క్యాచ్ ఇచ్చిన బ్యాటర్ రాజ్‌కుమార్ మాత్రం బంతి బ్యాట్‌కు తగల్లేదనే ధీమాతో రివ్యూ కోరాడు. రిప్లేలో స్పైక్ వస్తున్నప్పటికీ.. బంతికి, బ్యాట్‌కు మధ్య కాస్త గ్యాప్ ఉన్నట్లు కనిపించింది. దీంతో థర్డ్ అంపైర్ ఎస్ నిశాంత్ నాటౌట్‌గా ప్రకటించాడు. ఇలా టీవీ అంపైర్ నాటౌట్ అని ప్రకటించిన వెంటనే అదే బంతికి అశ్విన్ మళ్లీ డీఆర్ఎస్ కోరాడు. ఈ క్రమంలో అశ్విన్ ఫీల్డ్‌లో ఉన్న ఇద్దరు అంపైర్లతో కూడా చర్చించాడు. ఇక థర్డ్ అంపైర్ కూడా అశ్విన్ కోరిక మేరకు ఒకటికి రెండు సార్లు రిప్లేను క్లియర్‌గా పరిశీలించాడు. బ్యాట్ గ్రౌండ్‌కు తాకడంతో స్పైక్ వచ్చిందని.. బంతికి, బ్యాట్‌కు గ్యాప్ ఉండడంతో చివరకు నాటౌట్‌గా తేలింది. దీంతో అశ్విన్ నిరాశ చెందాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారింది. వీడియో చూసిన నెటిజన్లు, క్రికెట్ ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు. 'రివ్యూలకే రివ్యూలూ కోరే దేవుడివయ్యా నువ్వంటూ' కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.
TNPL 2023 League : ఈ వ్యవహారంపై మ్యాచ్ తర్వాత స్పందించిన అశ్విన్.. బిగ్ స్క్రీన్‌పై చూసిన తర్వాత రాజ్‌కుమార్ ఔటైనట్లు తాను భావించానని చెప్పాడు. ఆన్‌ఫీల్డ్ అంపైర్ల నిర్ణయాన్ని కాదని బ్యాటర్ డీఎర్ఆస్ కోరడానికి కచ్చితమైన ఆధారం కావాలని.. కాగా రిప్లేను మరో కోణంలో చూసి తన నిర్ణయాన్ని ప్రకటిస్తాడన్న ఉద్దేశంతోనే మరోసారి తాను రివ్యూ కోరినట్లు అశ్విన్ చెప్పుకొచ్చాడు. ఇకపోతే డబ్ల్యూటీసీ ఫైనల్లో చోటు దక్కకపోవడంతో నిరాశలో ఉన్న రవిచంద్రన్ అశ్విన్ ప్రస్తుతం తమిళనాడు ప్రీమియర్ లీగ్-2023లో బిజీగా గడుపుతున్నాడు. ఇక మ్యాచ్ విషయానికొస్తే ముందుగా బ్యాటింగ్ చేసిన బా11 తిరుచ్చి టీమ్ 19.1 ఓవర్లలో 120 పరుగులకే ఆలౌట్ అయింది. ఛేదనలో దిండిగుల్ 14.5 ఓవర్లలో 4 వికెట్లు నష్టానికి 122 పరుగులు చేసి విక్టరీని అందుకుంది.