ETV Bharat / sports

Mahendra Singh Dhoni: మహీకి 'ట్విట్టర్​' షాక్​.. కాసేపటికే! - ధోనీ ట్విట్టర్​ ఖాతా

భారత క్రికెట్​ జట్టు మాజీ సారథి ధోనీకి ప్రముఖ సామాజిక మాధ్యమం ట్విట్టర్​ ఝలక్​ ఇచ్చింది. అతడి ట్విట్టర్​ ఖాతాకు ఉండే బ్లూ టిక్​ను తొలగించింది. కాసేపటి తర్వాత.. మళ్లీ పునరుద్ధరించింది.

ms dhoni
మహేంద్ర సింగ్ ధోనీ
author img

By

Published : Aug 6, 2021, 4:12 PM IST

Updated : Aug 6, 2021, 5:58 PM IST

మైక్రోబ్లాగింగ్​ ప్లాట్​ఫామ్​ ట్విట్టర్​.. దిగ్గజ క్రికెటర్​ మహేంద్ర సింగ్​ ధోనీకి ఝలక్​ ఇచ్చింది. మహీ ట్విట్టర్​ ఖాతా బ్లూ టిక్​ను తొలగించింది. దీనిపై ధోనీ ఫ్యాన్స్​ మండిపడుతున్నారు.

అయితే.. కాసేపటికే బ్లూ టిక్​ను పునరుద్ధరించింది. ఫిబ్రవరి నుంచి ధోనీ ట్విట్టర్​ ఖాతా.. వినియోగంలో లేనందున ఈ చర్య తీసుకున్నట్లు స్పష్టం చేసింది.

ప్రముఖుల, ప్రజా ప్రయోజనాలు ఉన్న ఖాతాలను క్షుణ్ణంగా పరిశీలించిన అనంతరం.. ప్రజలు గుర్తించేందుకు వీలుగా ట్విట్టర్​ ఈ బ్లూ టిక్​ను ఇస్తుంది.

7 నెలలుగా నో ట్వీట్​

సాధారణంగా.. ఆరు నెలల పాటు ఇనాక్టివేట్‌గా ఉన్న ఖాతాలకు బ్లూ టిక్‌ను తొలగించాలని ట్విట్టర్​ నియమ నిబంధనల్లో ఉంది. ధోనీ చివరిగా 2021 జనవరి 8న ట్వీట్​ చేశాడు. ఈ నేపథ్యంలోనే.. బ్లూ మార్క్​ తొలగించినట్లు చెప్పుకొచ్చింది.

Twitter removes blue verified badge from MS Dhoni's account
ధోనీ ట్విట్టర్​ ఖాతా

గతంలోనూ ఇలాంటి చర్యలకు పాల్పడింది ట్విట్టర్​. ఆర్​ఎస్ఎస్​ చీఫ్​ మోహన్​ భగత్​తో పాటు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, కేంద్ర ఐటీ మంత్రి రవిశంకర్​ ప్రసాద్​ ఖాతాలను ఇలాగే చేసింది. తిరిగి కాసేపటికే మళ్లీ పునరుద్ధరించింది.

ఇవీ చదవండి:

ఆర్​ఎస్​ఎస్​ చీఫ్‌ ఖాతా​ బ్లూటిక్​ తొలగింపు.. ప్రత్యక్షం!

వెంకయ్య నాయుడు ఖాతాపై ట్విట్టర్​ తికమక

Last Updated : Aug 6, 2021, 5:58 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.