ETV Bharat / sports

Top 5 Highest Scores Asian Batters : వన్డే వరల్డ్​కప్​లో ఆసియా బ్యాటర్ల హవా.. 24 ఏళ్లైనా 'దాదా' రికార్డు అలానే.. - sehwag world cup top score

Top 5 Highest Scores Asian Batters In World Cup : మరో రెండు వారాల్లో 2023 వ‌న్డే వ‌ర‌ల్డ్ క‌ప్ ప్రారంభం కానుంది. ప్రతిష్ఠాత్మకమైన ఈ మెగాటోర్నీలో.. 10 దేశాలు పాల్గొంటాయి. ఈ అయితే టోర్నీలో ప్రతి సీజన్​లో ఆసియా దేశాల జట్ల బ్యాటర్ల హవా ఉంటుంది. ఈ క్రమంలో ఇప్ప‌టి దాకా మెగాటోర్నీలో అత్య‌ధిక ప‌రుగులు సాధించిన టాప్ - 5 ఆసియా బ్యాట‌ర్ల గురించి తెలుసుకుందాం.

Top 5 Highest Scores Asian Batters In World Cup

author img

By ETV Bharat Telugu Team

Published : Sep 21, 2023, 10:07 PM IST

Top 5 Highest Scores Asian Batters In World Cup : 2023 వ‌న్డే ప్ర‌పంచ క‌ప్​నుకు సర్వం సిద్ధమైంది. ఈ ప్రతిష్ఠాత్మకమైన టోర్నీకి ఈసారి భారత్ ఆతిథ్యమివ్వనున్న విషయం తెలిసిందే. ఇక టోర్నీలో పాల్గొనే ఆయా జట్లు.. టైటిల్ నెగ్గడానికి సర్వశక్తులూ ఒడ్డుతున్నాయి. ఇప్పటికి రెండుసార్లు ఛాంపియన్​గా నిలిచిన భారత్.. సొంత గడ్డపై టైటిల్ సాధించాలని ఉవ్విళ్లూరుతోంది. ఇక ప్రతి సీజన్​లో ఈ మెగాటోర్నీలో ఆసియా దేశాల బ్యాటర్ల హవా కొనసాగుతుంది. ఈ క్రమంలో వ‌ర‌ల్డ్ క‌ప్​లో ఇప్ప‌టి దాకా అత్య‌ధిక వ్యక్తిగత ప‌రుగులు సాధించిన టాప్ - 5 ఆసియా బ్యాట‌ర్లెవరో చూద్దాం.

  1. సౌర‌భ్ గంగూలీ
    బంగాల్ టైగ‌ర్‌, భార‌త మాజీ కెప్టెన్ సౌర‌భ్ గంగూలీ 1999లో జ‌రిగిన ప్రపంచక‌ప్ టోర్నీలో భారీ స్కోరు సాధించాడు. గ్రూప్​ స్టేజ్​లో శ్రీ‌లంకతో జ‌రిగిన మ్యాచ్​లో 158 బంతుల్లోనే 183 ప‌రుగుల స్కోర్ నమోదు చేసి.. విధ్వంసం సృష్టించాడు. ఇందులో 17 ఫోర్లు, 7 సిక్సుల‌ు ఉన్నాయి. ఇక భారత్​ తరఫున అత్య‌ధిక వ్య‌క్తిగ‌త స్కోరు సాధించిన ఆట‌గాడిగా గంగూలీ రికార్డు నెల‌కొల్పాడు. ఇప్ప‌టికీ ఇదే అత్యుత్త‌మ స్కోరు కావ‌డం విశేషం.
  2. వీరేంద్ర సెహ్వాగ్‌
    భార‌త జ‌ట్టు డేరింగ్ అండ్ డాషింగ్ ఓపెనర్.. వీరేంద్ర సెహ్వాగ్‌ ఈ జాబితాలో రెండో స్థానంలో ఉన్నాడు. 2011 ప్రపంచకప్​ ఎడిష‌న్​లో ప్రారంభ మ్యాచ్​లోనే సెహ్వాగ్ ప‌రుగుల వ‌రద పారించాడు. బంగ్లాదేశ్​తో జ‌రిగిన ఆ మ్యాచ్​లో 140 బంతుల్లో 14 ఫోర్లు, 5 సిక్సుల‌తో 175 ప‌రుగులు చేశాడు.
  3. క‌పిల్ దేవ్‌
    భారత్​కు తొలి ప్ర‌పంచ క‌ప్ అందించిన మాజీ కెప్టెన్ క‌పిల్ దేవ్.. ఈ లిస్ట్​లో మూడో ప్లేస్​లో కొనసాగుతున్నాడు. 1983 ప్రపంచ క‌ప్​లో జింబాబ్వేతో జ‌రిగిన మ్యాచ్​లో 16 ఫోర్లు, 6 సిక్స‌ర్ల‌తో బౌలర్లలపై విరుచుకుప‌డ్డాడు. కపిల్ 138 బంతుల్లోనే 175 పరుగులు చేసి ఔరా అనిపించాడు. అయితే ఆ మ్యాచ్​లో 17 ప‌రుగుల‌కే 5 వికెట్లు కోల్పోయి క‌ష్టాల్లో ఉన్న భార‌త్​ను క‌పిల్ తన అద్భుత ఇన్నింగ్స్​తో ఆదుకున్నాడు. అతడి పోరాటంతో భారత్ 226/8 స్థాయికి చేరుకొంది. ఆ మ్యాచ్​లో భారత్ 31 ప‌రుగుల తేడాతో విజ‌యం సాధించింది.
  4. తిల‌క‌ర‌త్నె దిల్షాన్‌
    శ్రీ‌లంక మాజీ ఓపెనర్ తిల‌క‌రత్నె దిల్షాన్.. 2015 వ‌రల్డ్ క‌ప్ ఎడిష‌న్​లో బంగ్లాదేశ్​పై 146 బంతుల్లో 161 ప‌రుగులు సాధించాడు. ఆ క్రమంలో వరల్డ్​ కప్​లో శ్రీలంక తరఫున అత్య‌ధిక వ్య‌క్తిగ‌త ప‌రుగులు సాధించిన ఆటగాడిగానూ నిలిచాడు. త‌న భిన్న‌మైన షాట్లు, టైమింగ్​తో బంగ్లా బౌల‌ర్ల‌పై విరుచుకుప‌డ్డాడు. ఆ ఇన్సింగ్స్​లో దిల్షాన్ మొత్తం 22 బౌండ‌రీలు బాదాడు.
  5. ఇమ్రాన్ న‌జీర్‌
    పాకిస్థాన్ బ్యాటర్ ఇమ్రాన్ న‌జీర్.. ఈ జాబితాలో ఐదో స్థానంలో నిలిచాడు. 2007 వ‌న్డే వ‌రల్డ్ క‌ప్​లో జింబాబ్వేతో జ‌రిగిన మ్యాచ్​లో 121 బంతుల్లో 160 ర‌న్స్ చేశాడు. న‌జీర్ ఇన్సింగ్స్​తో పాకిస్థాన్ భారీ స్కోరు సాధించి ఆ మ్యాచ్​లో సునాయ‌సంగా నెగ్గింది.

How to Follow Indian Cricket Team in WhatsApp: క్రికెట్​ ఫ్యాన్స్​కు గుడ్​న్యూస్​.. ఇకపై వాట్సాప్​లో టీమిండియా.. ఇలా ఫాలో అవ్వండి

World Cup Trophy in Ramoji Film City : రామోజీ ఫిల్మ్ సిటీలో వరల్డ్ కప్ ట్రోఫీ.. ప్రపంచాన్ని చుట్టేసి హైదరాబాద్​కు..

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.