Top 5 Catches In Cricket World Cup History : యావత్ క్రికెట్ ఫ్యాన్స్‌ను ఉర్రూతలూగించేందుకు వన్డే వరల్డ్‌కప్ సిద్ధమైంది. మరికొద్ది సేపట్లో ఈ మెగాటోర్నీ ప్రారంభం కానుంది. అయితే టోర్నీలో పాల్గొనే అన్ని జట్లూ.. ఛాంపియన్‌గా నిలవాలని ఆశిస్తాయి. కానీ ఒక్క జట్టే విశ్వకప్ విజేతగా నిలుస్తుంది. అలా ట్రోఫీని అందుకోవాలంటే.. బ్యాటింగ్, బౌలింగ్‌తో పాటు ఫీల్డింగ్ కూడా చాలా అవసరం. చేతికి అందివచ్చిన క్యాచ్‌లు వదిలేయడం, అనవసర ఓవర్ త్రోలు.. జట్టు భారీ మూల్యం చెల్లింకునేలా చేస్తాయి. అందుకే పలువురు మాజీలు 'క్యాచెస్ విన్స్ మ్యాచెస్' అని ఎప్పుడో అన్నారు. అందుకని ప్రపంచకప్ చరిత్రలో ఎప్పటికీ గుర్తుండిపోయే టాప్ 5 క్యాచ్‌ల గురించి తెలుసుకుందాం.
షెల్డన్ కాట్రెల్ : ప్రపంచకప్ చరిత్రలో అత్యుత్తమ క్యాచ్ అందుకున్న ఆటగాళ్లలో వెస్టిండీస్ ఆటగాడు షెల్డన్ కాట్రెల్ ఒకడు. 2019 వరల్డ్‌కప్‌లో, ఆస్ట్రేలియా బ్యాటర్ స్టీవ్ స్మిత్.. విండీస్ బౌలర్ ఒషానే థామస్ వేసిన బంతిని అతడు లాంగ్ లెగ్‌లో సిక్స్ బాదేందుకు ప్రయత్నించాడు. కానీ, డీప్ ఫైన్ లెగ్ వద్ద ఫీల్డింగ్ చేస్తున్న కాట్రెల్.. దూరం నుంచి పరుగెత్తుకుంటూ వచ్చి ఎడమచేత్తో బౌండరీ లోపలికి దూసుకెళ్లి, బంతిని బయట బౌన్స్ చేసి అద్భుతంగా క్యాచ్ పట్టాడు. అంతే ఇక ఆశ్చర్యపోవడం స్మిత్ వంతైంది. ఆ సమయంలో స్మిత్ 73 పరుగులతో బ్యాటింగ్‌లో ఉన్నాడు.
స్టీవ్ స్మిత్ : ఆస్ట్రేలియా ఆటగాడు స్టీవ్ స్మిత్.. వరల్డ్‌కప్ హిస్టరీలో రెండో అత్యుత్తమ క్యాచ్ పట్టాడు. 2015 ఎడిషన్‌లో న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో, ఫైన్ లెగ్‌లో ఫీల్డింగ్ చేస్తున్న స్మిత్.. టామ్ లాథమ్ ఇచ్చిన క్యాచ్‌ను సూపర్‌మాన్‌లా అందుకున్నాడు. ఫాస్ట్ బౌలర్ మిచెల్ స్టార్క్ వేసిన బంతికి లాథమ్ గాలిలో బలమైన షాట్ కొట్టాడు. ఆపై ఫైన్ లెగ్ వద్ద నిలబడిన స్మిత్.. తన కుడివైపుకు దూకి ఆ షాట్‌ను అద్భుత క్యాచ్‌గా మార్చాడు.
జెస్సీ రైడర్ : న్యూజిలాండ్ ఆల్ రౌండర్ జెస్సీ రైడర్.. 2011 ప్రపంచకప్‌లో అమాంతం గాల్లోకి ఎగిరి అందుకున్నాడు. ఇది అతడి కెరీర్లో అద్భుతమైన క్యాచ్‌ల్లో అత్యుత్తమం అని చెప్పవచ్చు. శ్రీలంకతో జరిగిన ఈ మ్యాచ్‌లో రైడర్.. పాయింట్‌లో ఫీల్డింగ్ చేస్తున్నాడు. ఫాస్ట్ బౌలర్ టిమ్ సౌథీ వేసిన బంతిని ఉపుల్ తరంగ పాయింట్ మీదుగా తీసుకెళ్లేందుకు ప్రయత్నించాడు. కానీ, పాయింట్ వద్ద నిలబడి ఉన్న రైడర్ తన ఎడమవైపు గాలిలో దూకి అద్భుతమైన క్యాచ్‌ను అందుకొని అతడి ఇన్నింగ్స్‌ను అక్కడే ముగించాడు.
అజయ్ జడేజా : ప్రపంచకప్ చరిత్రలో నాలుగో అత్యంత అద్భుతమైన క్యాచ్ భారత మాజీ ఆటగాడు అజయ్ జడేజాది. 1992 ప్రపంచకప్‌లో ఆసీస్‌తో జరిగిన మ్యాచ్‌లో.. అలన్ బోర్డర్ క్యాచ్‌ను ముందుకు డైవ్ చేసి అందుకున్నాడు. కపిల్ దేవ్ వేసిన బంతిని సిక్సర్‌గా మలిచేందుకు బోర్డర్ ప్రయత్నించగా.. బంతి గాలిలోకి దూసుకెళ్లింది. బౌండరీ లైన్ వద్ద ఉన్న జడేజా ముందుకు పరుగెత్తి ముందుకు గాలిలోనే ఆశ్చర్యకర రీతిలో క్యాచ్ తీసుకున్నాడు.
కపిల్ దేవ్ : 1983 ప్రపంచకప్‌లో వెస్టిండీస్‌తో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో కపిల్ దేవ్.. అందుకున్న ఈ క్యాచ్ ప్రపంచకప్ చరిత్రలో అత్యుత్తమ వాటిల్లో ఒకటి. ఈ మ్యాచ్‌లో ఫాస్ట్ బౌలర్ మదన్ లాల్ వేసిన బంతిని, వివ్ రిచర్డ్స్ సిక్సర్ కొట్టేందుకు ప్రయత్నించగా బంతి గాలిల్లోకి ఎగిరింది. కపిల్ దేవ్ స్క్వేర్ లెగ్ వద్ద ఫీల్డింగ్ చేస్తున్నాడు. కపిల్ క్యాచ్ పట్టుకోవడానికి వెనుకకు పరుగెత్తుతూ.. నమ్మశక్యం కాని రీతిలో బంతి అందుకున్నాడు.
World Cup 2023 Youngest Player : నూర్ అహ్మద్ టు విక్రమ్‌జీత్.. మెగాటోర్నీలో యంగ్ ప్లేయర్స్ వీరే