ETV Bharat / sports

24 ఏళ్ల నాటి సచిన్ రికార్డు బ్రేక్​.. ఆ కెప్టెన్​ అరుదైన ఘనత

Tom Latham Sachin Tendulkar: టీమ్​ఇండియా లెజెండరీ క్రికెటర్​ సచిన్ తెందూల్కర్​ రికార్డును బ్రేక్ చేశాడు న్యూజిలాండ్ కెప్టెన్ టామ్ లాథమ్. పుట్టినరోజున వన్డేల్లో అత్యధిక వ్యక్తిగత స్కోరు నమోదు చేసిన క్రికెటర్​గా నిలిచాడు.

Sachin Tendulkar
Tom Latham
author img

By

Published : Apr 2, 2022, 8:20 PM IST

Tom Latham Sachin Tendulkar: న్యూజిలాండ్​ కెప్టెన్ టామ్ లాథమ్ అరుదైన ఘనత సాధించాడు. పుట్టినరోజు నాడు వన్డేల్లో అత్యధిక స్కోరు నమోదు చేసిన క్రికెటర్​గా నిలిచాడు. ఈ క్రమంలోనే టీమ్​ఇండియా దిగ్గజం సచిన్ తెందూల్కర్​ నెలకొల్పిన 24 ఏళ్ల కిందటి రికార్డును బ్రేక్​ చేశాడు.

నెదర్లాండ్స్​తో మూడు మ్యాచ్​ల వన్డే సిరీస్​లో భాగంగా శనివారం జరిగిన రెండో వన్డేలో అజేయంగా 140* పరుగులు చేశాడు లాథమ్. దీంతో ఆ జట్టుపై 118 పరుగుల భారీ తేడాతో కివీస్​ విజయం సాధించింది. వన్డేల్లో లాథమ్​కు ఇదే అత్యుత్తమ స్కోరు. పైగా ఏప్రిల్ 2 అతడి బర్త్​డే. దీంతో పుట్టినరోజున అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన క్రికెటర్​గా రికార్డులకెక్కాడు లాథమ్. అంతకుముందు ఈ రికార్డు మాస్టర్​బ్లాస్టర్​ సచిన్ తెందూల్కర్​ పేరిట ఉండేది. 1998లో సచిన్ తన పుట్టినరోజున 134 పరుగులు చేశాడు.

ఈ జాబితాలో మరో కివీస్​ ప్లేయర్​ రాస్ టేలర్ మూడో స్థానంలో ఉన్నాడు. అతడు తన పుట్టినరోజున 131 పరుగులు చేశాడు. 130 పరుగులతో సనత్ జయసూర్య నాలుగో స్థానంలో, 100 పరుగులతో వినోద్ కాంబ్లీ ఐదో స్థానంలో ఉన్నారు.

ఇదీ చూడండి: IPL 2022: ముంబయి ఇండియన్స్​ వరుసగా రెండో ఓటమి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.