ETV Bharat / sports

Olympics: వీడని కరోనా బెడద.. ఆరుగురికి పాజిటివ్​

ఒలింపిక్స్​లో(Tokyo Olympics) మరోమారు కరోనా కలకలం రేపింది. ఇటీవల పలువురు ప్లేయర్లు వైరస్​ బారిన పడగా, ఇప్పుడు టోక్యో నగరంలో క్వారంటైన్​లో ఉన్న అథ్లెట్​కు పాజిటివ్​గా నిర్థరణ అయింది. రష్యా రగ్బీ జట్టులో ఐదుగురు సిబ్బందికి కొవిడ్ సోకినట్లు నిర్ధరణ అయింది.

author img

By

Published : Jul 15, 2021, 7:39 PM IST

olympics
ఒలింపిక్స్​

మరో వారం రోజుల్లో ప్రారంభంకానున్న ఒలింపిక్స్‌ను(Tokyo Olympics) కరోనా మహమ్మారి బెడద వీడట్లేదు. గురువారం మరోమారు కరోనా కలకలం రేగింది. ఇప్పటికే పలు కేసులు నమోదవ్వగా.. ఇప్పుడు టోక్యో నగరంలో క్వారంటైన్​లో ఉన్న మరో అథ్లెట్​ సహా రష్యా రగ్బీ జట్టులోని ఐదుగురు సిబ్బందికి వైరస్​ సోకింది. ఈ విషయాన్ని ఒలింపిక్​ నిర్వహణ కమిటీ తెలిపింది.

అంతకుముందు బ్రెజిల్‌ ఒలింపిక్‌ జట్టు బస చేసిన హోటల్‌లో ఏడుగురు సిబ్బంది, కెన్యా​ మహిళ రగ్బీ జట్టులో ఎనిమిది మంది సభ్యులకు పాజిటివ్​గా తేలింది.

సురక్షితంగా జరుగుతాయి

టోక్యోలో ప్రస్తుతం కరోనా కేసులు రికార్డుస్థాయిలో నమోదవుతున్నాయి. గురువారం(జులై 15) కేసులు సంఖ్య ఆరు నెలల గరిష్ఠానికి చేరుకుంది. ఈ నేపథ్యంలో మెగాక్రీడలు జరుగుతాయో లేదో అని అనుమానాలు తలెత్తుతున్నాయి. అయితే విశ్వక్రీడలు, కరోనా జాగ్రత్తల నడుమ సురక్షితంగా జరుగుతాయని అంతర్జాతీయ ఒలింపిక్​ కమిటీ అధ్యక్షుడు థామస్​ బాచ్​ ధీమా వ్యక్తం చేశారు.

ఇదీ చూడండి: Tokyo Olympics: బ్రెజిల్‌ జట్టు హోటల్లో కరోనా కలకలం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.