త్వరలో ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్(WTC Final) జరగనున్న సందర్భంగా మరో 10మంది దిగ్గజ ఆటగాళ్లను హాల్ ఆఫ్ ఫేమ్(ICC Hall of Fame)లో చేర్చాలని ఐసీసీ నిర్ణయించింది. ఇప్పటికే ఇందులో 93 మంది ప్లేయర్స్ ఉన్నారు.
జూన్ 18న ప్రారంభమయ్యే డబ్ల్యూటీసీ ఫైనల్‌తో పాటు ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్ స్పెషల్ ఎడిషన్ ఉంటుందని ఐసీసీ ప్రకటించింది. క్రికెట్‌కు తమ వంతు సేవలు అందించిన 10మంది లెజండ్స్‌కు అవకాశం కల్పించనున్నట్లు తెలిపింది.
క్రికెట్‌ను ఐదు శకాలుగా విభజించింది ఐసీసీ. ప్రారంభ క్రికెట్ శకం(1918 కంటే ముందు), ఇంటర్ వార్ క్రికెట్(1918-1945), యుద్ధం తర్వాత క్రికెట్ శకం(1946-1970), వన్డే (1971-1995), ఆధునిక క్రికెట్((1996-2016)గా విభజించి.. ఒక్కో శకం నుంచి ఇద్దరు ఆటగాళ్లను హాల్ ఆఫ్ ఫేమ్‌కు ఎంపిక చేయనుంది.
ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్ ఓటింగ్ అకాడమీ, ఈ ఫేమ్‌లో ఉన్న ప్రస్తుత సభ్యులు, ఫెడరేషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ క్రికెటర్ అసోసియేషన్ ప్రతినిధి, ప్రముఖ క్రికెట్ జర్నలిస్ట్‌లు, సీనియర్ ఐసీసీ సభ్యులు ఇప్పటికే ఈ పది మంది ప్లేయర్స్‌కు ఓటేశారు. ఐసీసీ డిజిటల్ మీడియా ఛానళ్ల ద్వారా లైవ్‌లో ఈ ఆటగాళ్ల పేర్లను ప్రకటించనున్నారు. జూన్ 13న ఈ లైవ్ కార్యక్రమం జరగనుంది.
ఇదీ చూడండి: WTC: 13ఏళ్ల కిందట సెమీస్‌లో.. ఇప్పుడు ఫైనల్లో..