టీ20 ప్రపంచకప్‌లో(T20 World Cup 2021) టీమ్ఇండియా పేలవ ప్రదర్శన అభిమానులకు నిరాశ పరుస్తోంది. సీనియర్ ఆటగాళ్ల ఆటతీరు ఆందోళన కలిగిస్తోంది. ఈ నేపథ్యంలో టీమ్ఇండియా దిగ్గజం కపిల్ దేవ్(Kapil Dev News) కీలక వ్యాఖ్యలు చేశాడు. సెలెక్టర్లు కీలక నిర్ణయాలు తీసుకునేందుకు సిద్ధంగా ఉండాలని పేర్కొన్నాడు. సీనియర్ ఆటగాళ్లు ఇంతలా విఫలమవుతున్న నేపథ్యంలో యువ ఆటగాళ్లకు అవకాశమివ్వాలని కోరాడు.
"ఇతర జట్ల ఆటతీరు ఆధారంగా టీమ్ఇండియా ముందుకెళ్లడాన్ని భారత క్రికెట్ ఎప్పుడూ అంగీకరించదు. వరల్డ్ కప్ గెలవాలన్నా, సెమీస్‌లో అడుగుపెట్టాలన్నా అది మన జట్టు ఆటగాళ్ల సామర్థ్యంతోనే సాధ్యమవ్వాలి. సెలక్టర్లు కూడా సీనియర్ ఆటగాళ్ల భవితవ్యంపై నిర్ణయం తీసుకునే సమయం వచ్చేసింది."
--కపిల్ దేవ్, మాజీ క్రికెటర్.
ఐపీఎల్లో రాణిస్తున్న యువ ఆటగాళ్లకు అవకాశమిచ్చే అంశంపై సెలెక్టర్లు ఆలోచన చేయాలని కపిల్ దేవ్(Kapil Dev News Today) అన్నాడు. వారికి అవకాశమిస్తేనే భవిష్యత్తులో టీమ్ఇండియా జట్టుపై క్లారిటీ వస్తుందని అభిప్రాయపడ్డాడు. సీనియర్ క్రికెటర్లు ఇంత ఘోరంగా విఫలమైతే.. టీమ్ఇండియాపై విమర్శలు తప్పవని పేర్కొన్నాడు. బీసీసీఐ చొరవ తీసుకుని యువ ఆటగాళ్లను జట్టులోకి తీసుకురావడం ప్రారంభించాలని తెలిపాడు. ఒక వేళ ఆరంభంలో యువ ఆటగాళ్లు ఓటమి పాలైనా వారికి అది అనుభవంలా మారుతుందని స్పష్టం చేశాడు.
వచ్చే ఏడాది టీ20 ప్రపంచకప్ ఉన్న నేపథ్యంలో టీమ్ఇండియా జట్టుపై దృష్టి సారించాలని సూచిస్తున్నారు మాజీ క్రికెటర్లు. న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్ నేపథ్యంలో యువ ఆటగాళ్లకు అవకాశమివ్వాలని చెబుతున్నారు.
ఇది చదవండి: అఫ్గాన్‌ను తక్కువ అంచనా వేయొద్దు: భజ్జీ