ETV Bharat / sports

Tim Paine: 'ఆ అసభ్య సందేశాలు బయటకొస్తాయని తెలుసు' - ఇంగ్లాండ్ ఆస్ట్రేలియా యాషెస్ సిరీస్​

తాను ఎంత వద్దనుకున్నా తన సహచర ఉద్యోగికి పంపిన అసభ్యకర సందేశాలు ఎప్పుడైనా బయటకు వస్తాయని తనకు తెలుసని ఆస్ట్రేలియా ఆటగాడు టిమ్​ పైన్​ అన్నాడు. ఇంగ్లాండ్​తో యాషెస్​ సిరీస్​కు ముందు ఆసీస్​ టెస్టు జట్టు కెప్టెన్సీకి రాజీనామా(Tim paine resigns) చేసిన అతడు.. తాజాగా ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కీలక విషయాలు వెల్లడించాడు.

tim paine, tim pain lewd messages
టిమ్​ పైన్
author img

By

Published : Nov 21, 2021, 5:09 PM IST

ఇంగ్లాండ్​తో యాషెస్​ సిరీస్​కు ముందు.. ఆసీస్ టెస్టు జట్టు కెప్టెన్సీకి రాజీనామా చేస్తున్నట్లు టిమ్ పైన్ ఇటీవల ప్రకటించాడు. 2017లో ఓ మహిళా సహోద్యోగికి అసభ్యకర సందేశాలు(Tim paine messages) పంపడమే పైన్ రాజీనామాకు(Tim paine captaincy) కారణం. అయితే.. తాను ఎంత వద్దనుకున్నా ఆ అసభ్యకర సందేశాలు ఎప్పుడైనా బయటకు వస్తాయని తనకు తెలుసని పైన్​ అన్నాడు. తాజాగా అతడు ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో(Tim paine interview) ఈ విషయం వెల్లడించాడు.

"తొలుత ఈ వివాదం సమసిపోయిందని భావించినా.. పెద్ద సిరీస్‌లు లేదా మా క్రికెట్‌ సీజన్‌ మొదలయ్యే ముందు ప్రతిసారీ ఈ వివాదం నా దృష్టికి వస్తూనే ఉంది. నా సందేశాలకు సంబంధించిన పూర్తి ఆధారాలు(Tim paine chat) తమ వద్ద ఉన్నాయంటూ కొన్ని మీడియా సంస్థలు తరచూ హెచ్చరించేవి. అయితే, వాళ్లు ఎప్పుడూ దీనిపై వార్తలు ప్రసారం చేయకపోయినా.. ఎప్పుడైనా ఈ వివాదం బయటకు పొక్కుతుందనే విషయం నాకు ముందే తెలుసు. ఇదంతా నేను టెస్టు కెప్టెన్సీ చేపట్టక కొన్ని నెలల ముందు జరిగింది. అది మా ఇద్దరి అంగీకారంతో జరిగిన వ్యవహారం. అప్పుడు నా కెప్టెన్సీకి ఇది సమస్యగా పరిణమిస్తుందనే విషయం గురించి ఆలోచించలేదు."

-టిమ్​ పైన్​, ఆస్ట్రేలియా క్రికెటర్​.

2018లో స్టీవ్‌స్మిత్ బాల్‌ టాంపరింగ్ వ్యవహారంలో నిషేధానికి గురయ్యాక పైన్‌ ఆస్ట్రేలియా టెస్టు కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టాడు. ఈ క్రమంలోనే అతడు 2019లో ఇంగ్లాండ్‌లో జరిగిన యాషెస్‌ సిరీస్‌ను 2-2తో డ్రా చేసుకున్నా.. భారత్‌తో అంతకుముందు, ఆ తర్వాత స్వదేశంలో ఆడిన రెండు బోర్డర్‌-గావస్కర్‌ ట్రోఫీలను కోల్పోయి తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నాడు. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు అసభ్యకర సందేశాల వివాదం తెరపైకి రావడం వల్ల అతడు ఇటీవల కెప్టెన్సీని వదులుకున్నాడు. చివరగా రాబోయే యాషెస్‌ సిరీస్‌లో ఒక ఆటగాడిగా ఆసీస్‌ జట్టులో కొనసాగాలని ఉందని, ట్రోఫీ సాధించి ఘనంగా ముగింపు పలకాలని భావిస్తున్నానని పైన్‌ ఆశాభావం వ్యక్తం చేశాడు.

ఇదీ చూడండి: మరోసారి ఆస్ట్రేలియా టెస్టు కెప్టెన్​గా స్మిత్!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.