Tilak Varma Asia Cup : టీమ్ఇండియా యంగ్ బ్యాటర్ తిలక్ వర్మ.. నిలకడతో కూడిన ఆటతో విండీస్, ఐర్లాండ్ పర్యటనలో టీ20 సిరీస్‌కు ఎంపికయ్యాడు. విండీస్‌తో టీ20 సిరీస్‌లో రాణించి.. తాజాగా ఆసియా కప్‌నకు కూడా సెలెక్ట్ అయ్యాడు తిలక్. అయితే తిలక్ ప్రస్తుత ఆట తీరుపై తాజాగా ప్రశంసలు కురిపించాడు భారత మాజీ ప్లేయర్ సబా కరీమ్. ఇంతకీ అతడు ఏమన్నాడంటే..
ఐపీఎల్ సహా విండీస్ పర్యటనలో అదరగొట్టిన తిలర్ వర్మకు.. ఫ్యూచర్లో టీమ్ఇండియా తరఫున అన్ని ఫార్మాట్లలో ఆడే సత్తా అతడికి ఉందని సబా కరీమ్ అభిప్రాయపడ్డాడు. అయితే అంతర్జాతీయంగా ఒక్క వన్డే మ్యాచ్ కూడా ఆడని తిలక్‌ను.. ఆసియా కప్‌నకు ఎంపిక చేయడంపై పలువురు తప్పుబట్టారు. దీనిపై కరీమ్ స్పందిస్తూ..
"ఒక్కోసారి సెలెక్షన్ కమిటీ, జట్టు మేనేజ్‌మెంట్.. గ్రౌండ్లో ప్లేయర్ ప్రదర్శన చూసిన తర్వాత మద్దతు ఇవ్వొచ్చు. ఒక ఆటగాడిని టీ20 నుంచి వన్డే ఫార్మాట్‌కు ఎంపిక చేయవచ్చు. అందులో ఎలాంటి నష్టం లేదు. పైగా తిలక్‌కు లిస్ట్ ఏ లో 25 మ్యాచ్‌లు ఆడిన అనుభవం ఉంది. దీంట్లో ఆతడు 50కి పైగా సగటుతో పరుగులు సాధించాడు. అంటే వన్డేల్లో ఎలా ఆడాలనేదానిపై అతడికి క్లారిటీ ఉంది. అతడికి ఉన్న అనుభవంతో.. టీ20 ఫార్మాట్ నుంచి వన్డే మ్యాచ్‌లకు అలవాటు పడేందుకు ఎక్కువ సమయం పట్టదు. అంతర్జాతీయ క్రికెట్‌లో సవాళ్లను ఎదుర్కోడానికి, పరిస్థితులకు తగ్గట్లు ఎలా ఆడాలో తెలుసుకునేందుకు తిలక్‌కు ఇది సూపర్ ఛాన్స్టీ20ల్లో అతడి ప్రదర్శన చూసిన సెలెక్షన్ కమిటీ, టీమ్ మేనేజ్‌మెంట్ తిలక్‌పై నమ్మకం ఉంచాయి. ఈ పరిణామాలు తిలక్.. భవిష్యత్‌లో అన్ని ఫార్మాట్ల ఆటగాడిగా ఎదుగుతాడని తెలుపుతున్నాయి" అని అన్నాడు.
Tilak Varma Stats : ఇక లిస్ట్ ఏ కెరీర్లో ఇప్పటివరకు 25 మ్యాచ్‌లు ఆడిన తిలక్ వర్మ.. 1236 పరుగులు చేశాడు. మరోవైపు ఐపీఎల్లో 25 మ్యాచ్‌ల్లో 144 స్టైక్ రేట్‌తో 740 పరుగులు సాధించాడు. ఇక రీసెంట్గా విండీస్ పర్యటనలో టీ20 అంతర్జాతీయ అరంగేట్రం చేసి 7 మ్యాచ్‌ల్లో 174 పరుగులు చేశాడు. కాగా ఐర్లాండ్‌తో జరిగిన రెండు మ్యాచ్‌ల్లో తిలక్ విఫలమయ్యాడు.