లార్డ్స్ టెస్టులో ఇండియా- ఇంగ్లాండ్ ఆటగాళ్ల మధ్య వాగ్వాదం కొనసాగుతూనే ఉంది. భారత ఇన్నింగ్స్ 19వ ఓవర్ సందర్భంగా అండర్సన్- కోహ్లీ మధ్య మరోసారి మాటల యుద్ధం నడిచింది.
టీమ్ఇండియా ఇన్నింగ్స్ సందర్భంగా ఈ తాజా వాగ్వాదం జరిగింది. 19వ ఓవర్ నాలుగో బంతిని వేసిన అనంతరం పిచ్ మీద నడుస్తూ వెళ్తున్న అండర్సన్‌పై కోహ్లీ మాటలదాడికి దిగాడు. ఐదో బంతి వేసిన తర్వాత దానికి స్పందించాడు అండర్సన్. "బుమ్రాను తిట్టినట్లే నువ్వు నన్నూ తిడుతున్నావా? (ఓ బూతు మాట వాడుతూ) ఇదేమీ నీ ఇల్లు కాదు" అని కోహ్లి కోపంగా అండర్సన్‌ను చూస్తూ అనడం స్టంప్ మైక్రోఫోన్లో వినిపించింది. అండర్సన్ ఏదో అన్నాడు కానీ.. అది వినిపించలేదు. కోహ్లి స్పందిస్తూ.. "వయసు పెరగడం వల్లే నువ్విలా ప్రవరిస్తున్నావు" అన్నాడు. పేసర్ పిచ్‌పై పరుగెడుతున్నాని కోహ్లి అంపైర్‌తో చెప్పడంతో మాటల యుద్ధం మొదలైంది. ఆ తర్వాత అది తీవ్రమైంది. ఇక ఆ ఓవర్ ముగియడం వల్ల ఆ వివాదం అంతటితో ఆగిపోయింది.
-
Kohli vs Anderson 2021. pic.twitter.com/awziOIK3vF
— vkohli (@vkohli_cric) August 15, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
">Kohli vs Anderson 2021. pic.twitter.com/awziOIK3vF
— vkohli (@vkohli_cric) August 15, 2021Kohli vs Anderson 2021. pic.twitter.com/awziOIK3vF
— vkohli (@vkohli_cric) August 15, 2021
అంతకుముందు మూడో రోజు చివరి వికెట్‌గా వెనుదిరిగిన అండర్సన్.. టీమ్ఇండియా బౌలర్ బుమ్రాతో ఏదో అనడం కనిపించింది. పదేపదే బౌన్సర్లు విసిరిన జస్ప్రీత్.. జిమ్మీని ఇబ్బంది పెట్టాడు. ఈ క్రమంలో అతడు ఒక ఓవర్లో నాలుగు నోబాల్స్ వేశాడు. ఓ బౌన్సర్ అండర్సన్ హెల్మెట్‌ను బలంగా తగలింది. కొన్ని బంతులు అతడి శరీరానికి కూడా తగిలాయి. నన్నెందుకు టార్గెట్ చేశావన్నట్లు అండర్సన్ ప్రశ్నించగా.. చిరునవ్వుతో ముందుకెళ్లిపోయాడు బుమ్రా.
ఇక లార్డ్స్ టెస్టులోనూ కోహ్లీ బ్యాటింగ్ వైఫల్యం కొనసాగింది. తొలి టెస్టులో గోల్డెన్ డక్‌గా వెనుదిరిగిన విరాట్.. రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో 42 పరుగులే చేశాడు. ఇక రెండో ఇన్నింగ్స్‌లో 20 పరుగులు చేసి సామ్ కరన్ బౌలింగ్‌లో కీపర్ క్యాచ్‌గా వెనుదిరిగాడు.
ఇదీ చదవండి: Kohli Dance: కెప్టెన్ కోహ్లీ 'నాగిని' డ్యాన్స్!