సుదీర్ఘ నిరీక్షణ అనంతరం జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో భారత మహిళా క్రికెటర్లు అద్భుత ప్రదర్శన చేశారు. బ్రిస్టోల్ వేదికగా ఇంగ్లాండ్‌తో జరిగిన ఏకైక టెస్ట్ మ్యాచ్‌లో అసాధారణ పోరాట పటిమ చూపారు. దీంతో ఏకపక్షంగా సాగుతుందనుకున్న మ్యాచ్ డ్రాగా ముగిసింది. బ్యాటింగ్‌లో యువ సంచలనం షెఫాలీ వర్మతో పాటు దీప్తి శర్మ, స్నేహ రాణా.. అర్ధ సెంచరీలతో రాణించగా.. పూనమ్ రౌత్, తానియా భటియా వారికి అండగా నిలిచారు.
తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లాండ్ జట్టు 396/9 వద్ద ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. అనంతరం బరిలోకి దిగిన టీమ్ఇండియాకు శుభారంభం లభించినప్పటికీ.. అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయింది. ఫలితంగా 231 పరుగులకు ఆలౌటై ఫాలో ఆన్ ఆడాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో రెండో ఇన్నింగ్స్ మొదలు పెట్టిన భారత్ 8 వికెట్ల నష్టానికి 327 పరుగులు చేసింది. షెఫాలీ మరోసారి హాఫ్ సెంచరీతో ఆదుకుంది. దీప్తి శర్మ, స్నేహ రాణా, తానియా భటియా, పూనమ్ రౌత్ రాణించారు. జట్టుగా అద్భుత ప్రదర్శన చేసిన మిథాలీ సేన చివరికి మ్యాచ్‌ను డ్రాగా ముగించింది.
ఇదీ చదవండి: WTC Final: కెప్టెన్‌గా కోహ్లీ.. ఆటగాడిగా రోహిత్ రికార్డులు