ETV Bharat / sports

'ఒలింపిక్స్‌లోకి క్రికెట్‌..' ప్రెజెంటేషన్‌ ఇవ్వాలని ఐసీసీకి ఆహ్వానం - ఐసీసీ లేటెస్ట్ న్యూస్

ఇప్పటికే కామన్వెల్త్‌ గేమ్స్‌లో క్రికెట్‌కు చోటు దక్కగా.. ఇక ఒలింపిక్స్​లో స్థానమే లక్ష్యంగా మరో ముందడుగు పడింది. ఒలింపిక్స్‌లో క్రికెట్‌ను ఎందుకు చేర్చాలని భావిస్తున్నారనే దానిపై ప్రెజెంటేషన్‌ ఇవ్వండని అంతర్జాతీయ క్రికెట్‌ కౌన్సిల్​ను (ఐసీసీ) ఆహ్వానించింది అంతర్జాతీయ ఒలింపిక్‌ కమిటీ (ఐఓసీ).

olympics committee on cricket
olympics committee on cricket
author img

By

Published : Aug 3, 2022, 7:21 PM IST

ప్రస్తుతం బర్మింగ్‌హామ్‌ వేదికగా జరుగుతున్న కామన్వెల్త్‌ గేమ్స్‌లో క్రికెట్‌కు చోటు దక్కింది. టీ20 ఫార్మాట్‌లో మహిళల క్రికెట్ పోటీలు జరుగుతున్నాయి. ఇక ఒలింపిక్స్‌లో చోటు దక్కించుకోవడమే తదుపరి లక్ష్యంగా అంతర్జాతీయ క్రికెట్‌ కౌన్సిల్ (ఐసీసీ) కసరత్తు చేస్తోంది. ఈ క్రమంలో ఐసీసీకి మరొక అవకాశం వచ్చింది. ఒలింపిక్స్‌లో క్రికెట్‌ను ఎందుకు చేర్చాలని భావిస్తున్నారనే దానిపై ప్రెజెంటేషన్‌ ఇవ్వండని అంతర్జాతీయ ఒలింపిక్‌ కమిటీ (ఐఓసీ) ఆహ్వానించింది. లాస్‌ఏంజెలెస్‌ వేదికగా 2028 ఒలింపిక్స్‌ పోటీలు జరుగుతాయి. ఈ క్రమంలో 2023లో ముంబయి వేదికగా జరిగే ఐవోసీ సెషన్స్‌లో క్రికెట్‌పై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

క్రికెట్‌తోపాటు బ్రేక్‌ డ్యాన్సింగ్ (ప్రపంచ డ్యాన్స్‌ స్పోర్ట్‌ ఫెడరేషన్‌), బేస్‌బాల్/సాఫ్ట్‌బాల్ (డబ్ల్యూబీఎస్‌సీ), ఫ్లాగ్‌ ఫుట్‌బాల్ (ఐఎఫ్‌ఏఎఫ్‌), లాక్రోజ్‌ (వరల్డ్‌ లాక్రోజ్‌), కరాటే (డబ్ల్యూకేఎఫ్‌), కిక్‌ బాక్సింగ్ (డబ్ల్యూఏకేఓ), స్క్వాష్‌ (డబ్ల్యూఎస్‌ఎఫ్‌), మోటార్‌స్పోర్ట్‌ (ఎఫ్‌ఐఏ) తదితర క్రీడా సంఘాలు కూడా ఒలింపిక్ కమిటీ ఎదుట ప్రెజెంటేషన్‌ ఇవ్వనున్నాయి. "ప్రాథమికంగా 28 క్రీడలు లాస్‌ఏంజెలెస్‌ ఒలింపిక్స్‌లో చోటు సంపాదించాయి. ఇంకా మరిన్ని క్రీడల కోసం ప్రతిపాదించడానికి ఎల్‌ఏ 28 అవకాశం కల్పించింది" అని గతంలోనే ఎల్‌ఏ28 అధికారిక ప్రతినిధులు వెల్లడించారు. క్రికెట్ సహా తొమ్మిది క్రీడలకు సంబంధించి ప్రతిపాదనలు వచ్చాయని, రిక్వెస్ట్‌ ఫర్ ఇన్‌ఫర్మేషన్‌ (ఆర్‌ఎఫ్‌ఐ) దాఖలు చేయాలని సమాచారం వచ్చిందని ఐసీసీ ధ్రువీకరించింది.

ఇవీ చదవండి: సూర్య భాయ్​ జోరు.. ప్రపంచ ర్యాంకింగ్స్​లో దూకుడు.. నెం.1 దిశగా..

Commonwealth Games: 'మా విజయం.. వారిలో మరింత విశ్వాసాన్ని నింపుతుంది'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.