టీమ్ఇండియా దిగ్గజం సచిన్ తెందూల్కర్(sachin news latest) మరోసారి తన దాతృత్వాన్ని చాటుకున్నారు. ఈశాన్య రాష్ట్రాల ప్రజలకు సాయం చేసేందుకు ముందడుగు వేశారు. అసోం కరీమ్గంజ్ జిల్లా మకుంద క్రిస్టియన్ కుష్ఠు, జనరల్ ఆస్పత్రిలోని పెడియాట్రిక్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌కు రెటినాల్ కెమెరాలను సాయంగా అందించారు.
తన సేవా సంస్థ తరపున ఈ సహాయం చేశారు సచిన్. పసిపిల్లలు, చిన్నారుల్లో అంధత్వం రాకుండా నివారించే థెరపీకి పరీక్షల నిమిత్తం రెటినాల్ కెమెరాలు ఉపయోగపడుతాయి. వీటితో చాలా మందికి లాభం కలుగుతుందని ఆస్పత్రి యాజమాన్యం తెలిపింది.
త్రిపుర, మిజోరామ్‌కు చెందిన ప్రజలు కూడా పరీక్షల కోసం తరచూ కరీమ్గంజ్ ఆస్పత్రికి వెళ్తుంటారు. అయితే.. ఆర్ఓపీ స్క్రీనింగ్ సేవలు పొందాలంటే రోగులు దాదాపుగా 360 కిలోమీటర్లు ప్రయాణించి గువాహటికి వెళ్లాల్సి వస్తోంది. ఈ సమస్య నుంచి వారిని ఆదుకోవడానికే సచిన్ ఈ సాయం చేశారు.
ఇదీ చదవండి: