ETV Bharat / sports

అరుదైన ఘనతకు అడుగు దూరంలో.. వందో టెస్టు ఆడనున్న పుజారా.. విశేషాలివే! - బోర్డర్​ గావస్కర్​ ట్రోఫీ 2023

టీమ్​ఇండియా క్రికెటర్​ ఛెతేశ్వర్​ పుజారా మరో ఘనత సాధించబోతున్నాడు. బోర్డర్‌-గవాస్కర్‌ ట్రోఫీలో భాగంగా బుధవారం ఆస్ట్రేలియాతో తన వందో మ్యాచ్​ ఆడనున్నాడు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ పుజారాకు శుభాకాంక్షలు తెలిపారు. పుజారా గురించి ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం.

cheteshwar pujara
cheteshwar pujara
author img

By

Published : Feb 14, 2023, 10:34 PM IST

టీమ్ఇండియా టెస్ట్​ స్పెషలిస్ట్​ బ్యాటర్​ ఛెతెశ్వర్​ పుజారా మరో ఘనత సాధించనున్నాడు. ఇప్పుటి వరకు 99 టెస్టులు పూర్తి చేసుకున్న ఈ ప్లేయర్.. బోర్డర్​-గావస్కర్​ ట్రోఫీలో భాగంగా దిల్లీ వేదికగా ఆస్ట్రేలియాతో వందో టెస్టు మ్యాచ్​ ఆడనున్నాడు​. అయితే టెస్టుల్లో 100 మ్యాచ్​లు ఆడటం చాలా అరుదైన విషయమే. దీనికోసం పుజారా ఎంతో శ్రమించాడు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ పుజారాకు శుభాకాంక్షలు తెలిపారు. కాగా, తన కుమారుడు సాధించిన ఈ ఘనతపై పుజారా తండ్రి అరవింద్ స్పందించాడు. 'ఏ ఆటలో అయిన 100 మ్యాచ్​లు అంటే చాలా పెద్ద విషయం.. దీనికోసం చాలా నిబద్ధత​, క్రమశిక్షణ, ఫిట్​నెస్​, సరైన డైట్​ కావాలి. ఇంటర్నేషనల్​ క్రికెట్​లో సూదీర్ఘంగా కొనసాగడానికి ఇవన్నీ దోహదం చేస్తాయి. దాంతో పాటు కొంచెం అదృష్టం కూడా ఉండాలి' అని తెలిపాడు. పుజారా కెరీర్​కు సంబంధించి ఆసక్తికర విషయాలు ఇవే..

  • ఛెతేశ్వర్​ పుజారా తన అంతర్జాతీయ కెరీర్‌ను 2010లో ప్రారంభించాడు. బెంగళూరు వేదికగా ఆసీస్​తో జరిగిన ఈ మ్యాచ్‌లో హాఫ్​ సెంచరీతో మెరిశాడు. మొదటి ఇన్నింగ్స్‌లో కేవలం నాలుగు పరుగులే చేసినా.. రెండో ఇన్నింగ్స్‌లో 72 పరుగులు బాది జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు.
  • తన కెరీర్‌లో వందో టెస్టు ఆడుతున్న 13వ భారత ఆటగాడు పుజారా. ప్రస్తుతం జట్టులో ఉన్న ఆటగాళ్లలో వందో టెస్ట్‌ ఆడుతున్న రెండో ఆటగాడు. పుజారా కంటే ముందు విరాట్‌ కోహ్లీ గతేడాది శ్రీలంకతో వందో టెస్ట్‌ ఆడాడు. 2012లో ఇంగ్లాండ్‌తో జరిగిన టెస్ట్‌ సిరీస్‌లో ఆరో ఇన్నింగ్స్‌లో సెంచరీ (135), తొమ్మిదో ఇన్నింగ్స్‌లో డబుల్ సెంచరీ (206) చేశాడు పుజారా.
  • పుజారా డిఫెన్స్‌ ఆడటంలో, స్పిన్‌ బౌలింగ్‌ను ఎదుర్కొవడంలో పుజారాకు ప్రత్యేక శైలి ఉంది. గేమ్​లో రాహుల్‌ ద్రావిడ్ ఆదర్శం అని చెప్పే పుజారా.. క్రీజులో పాతుకుపోయాడంటే ఔట్‌ చేసేందుకు బౌలర్లు శ్రమించాల్సిందే. ఈ విషయం అని అతడి గణాంకాలు చూస్తే అర్థమవుతుంది.
  • 2018లో పెర్త్‌లో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్‌లో 103 బంతుల్లో కేవలం 24 పరుగులే చేశాడు. 2021లో లార్డ్స్‌లో ఇంగ్లాండ్‌తో జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో 35 బంతులు ఆడిన తర్వాత తొలి రన్‌ చేశాడు. అంతకముందు మొదటి పరుగు కోసం రాహుల్‌ ద్రావిడ్ 40 బంతులు ఆడటం గమనార్హం. 2007లో మెల్‌బోర్న్‌ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో ఇది జరిగింది.
  • ఛెతేశ్వర్ పుజారా ఇప్పటివరకు ఇంటర్నేషనల్ క్రికెట్‌లో 104 మ్యాచ్‌లు ఆడాడు. వీటిలో 99 టెస్టు మ్యాచ్‌లు, ఐదు వన్డేలు ఉన్నాయి. అందులో 19 సెంచరీలు, 34 అర్ధ శతకాలు బాదాడు. టెస్ట్‌ మ్యాచ్​ల్లో 44.15 సగటుతో 7021 పరుగులు చేశాడు. ఐదు వన్డేలు ఆడిన పుజారా పెద్దగా పరుగులు సాధించలేకపోయాడు.
  • 2018- 2019లో ఆసీస్​తో జరిగిన బోర్డర్‌-గావస్కర్‌ ట్రోఫీ తన కెరీర్‌లో అత్యుత్తమైనదిగా చెబుతాడు పుజారా. ఈ సిరీస్‌లో అద్భుతమైన ఆటతీరుతో 521 పరుగులు చేసి 4 టెస్టుల సిరీస్‌ని భారత్ 2-1 తేడాతో కైవసం చేసుకోవడంలో కీలకపాత్ర పోషించాడు. ఈ సిరీస్‌ విజయాన్ని టీమ్​ఇండియా 'పుజారా డ్యాన్స్‌' చేస్తూ సెలబ్రేట్‌ చేసుకోవడం అప్పట్లో వైరల్‌ అయింది.
  • ఆసీస్​, ఇంగ్లాండ్‌, కివీస్​ జట్లతో జరిగిన టెస్ట్‌ మ్యాచ్‌ల్లో పుజారా తన కెరీర్‌లో అత్యుత్తమ గణాంకాలు నమోదు చేశాడు. ఆస్ట్రేలియాతో జరిగే టెస్ట్‌ మ్యాచ్‌లకు తన ఎంపిక ఎంత అవసరమో చెప్పేందుకు ఆ జట్లపై నమోదు చేసిన స్టాటిస్టిక్సే నిదర్శనం. 2013 - 2015 మధ్య 22 ఇన్నింగ్స్‌లో ఆడిన పుజారా ఒక డబుల్‌ సెంచరీ, రెండు శతకాలు, మూడు హాఫ్​ సెంచరీలు చేశాడు.
  • పుజారా స్ట్రైక్‌ రేట్‌పై ఎప్పుడూ చర్చ జరుగుతూనే ఉంటుంది. వాటన్నింటికీ తన ఆటతీరుతో సమాధానం చెబుతాడు ఈ ప్లేయర్. సాధారణంగా టెస్టుల్లో కొత్త బంతిని ఎదుర్కొని పరుగులు రాబట్టడం బ్యాటర్లకు సవాల్‌గా మారుతుంది. టాప్‌ ఆర్డర్‌ బ్యాటర్‌గా పుజారా క్రీజులో నిలదొక్కుకొని కొత్త బంతిని ఎక్కువ సమయం ఆడతాడు. దీంతో తర్వాత క్రీజులోకి వచ్చే బ్యాటర్లకు సులువుగా పరుగులు చేయగలరు అని విశ్లేషకులు చెబుతుంటారు.
  • ప్రతి ప్లేయర్​కు కెరీర్‌లో కొంత కష్ట కాలం ఉన్నట్లే.. పుజారా కూడా 2019-2022 మధ్య తీవ్రమైన ఫామ్‌లేమిని ఎదుర్కొన్నాడు. ఆ టైంలో 48 ఇన్నింగ్స్‌లు ఆడి ఒక్క సెంచరీ కూడా చేయలేకపోయాడు. దీంతో సెలెక్టర్లు పక్కన పెట్టేశారు. తిరిగి ఫామ్‌లోకి వచ్చేందుకు ఇంగ్లాండ్‌లో కౌంటీల్లో ఆడి, ఆరు ఇన్నింగ్స్‌లో నాలుగు సెంచరీలు చేశాడు. వాటిలో రెండు డబుల్‌ శతకాలున్నాయి.
  • 2022లో బంగ్లాదేశ్‌తో జరిగిన భారత జట్టుకు మళ్లీ ఎంపికయ్యాడు. ఈ సిరీస్‌లో తొలి మ్యాచ్‌ తొలి ఇన్నింగ్స్‌లో 90 పరుగులు, రెండో ఇన్నింగ్స్‌లో సెంచరీ చేసి టెస్టుల్లో తను ఎంత స్పెషలిస్ట్‌ బ్యాటర్‌ అనేది మరోసారి రుజువు చేశాడు. గత వారం నాగ్‌పూర్‌లో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో ఏడు పరుగులే చేశాడు.
    బుధవారం దిల్లీ వేదికగా జరిగే వందో మ్యాచ్​లో పుజజా శతక ప్రదర్శన చేస్తాడని ఆశిద్దాం.
  • ఇవీ చదవండి :
  • Womens T20 Worldcup : బౌలింగ్​ మెరుగుపడాలి..​ బ్యాటర్లు ఆ పని చేయాలి!
  • నేను ఫుల్​ ఫిట్​గా ఉన్నా.. కానీ దానికి ఇంకా టైం పడుతుంది : పీవీ సింధు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.