ETV Bharat / sports

'అతడే..భారత పేస్‌ బౌలింగ్ దళానికి నాయకుడు' - Give Their Reasons

టీమ్​ఇండియా బౌలర్​ బుమ్రాపై ప్రశంసలు కురిపించారు మాజీ ఆటగాళ్లు మోర్నీ మోర్కెల్, ఇర్ఫాన్​ పఠాన్​. అతడు 'భారత పేస్‌ బౌలింగ్ దళానికి నాయకుడు' అని కితాబిచ్చారు. కాగా, మిడిలార్డర్‌లో విరాట్ కోహ్లీ, రహానె, పుజారా బ్యాటింగ్‌లో విఫలమవుతున్నా టీమ్‌ఇండియా టెస్టుల్లో విజయం సాధించడం ఆశ్చర్యకరంగా ఉందని ఇర్ఫాన్‌ అభిప్రాయపడ్డాడు.

bumrah
బుమ్రా
author img

By

Published : Jan 5, 2022, 8:05 AM IST

మిడిలార్డర్‌లో విరాట్ కోహ్లీ, రహానె, పుజారా బ్యాటింగ్‌లో విఫలమవుతున్నా టీమ్‌ఇండియా టెస్టుల్లో విజయం సాధించడం ఆశ్చర్యకరంగా ఉందని మాజీ ఫాస్ట్‌ బౌలర్‌ ఇర్ఫాన్‌ అభిప్రాయపడ్డాడు. "గత రెండేళ్లుగా మిడిలార్డర్‌ పూర్తిగా వైఫల్యం చెందింది. అయినా సరే ఓపెనర్లు, లోయర్‌ ఆర్డర్‌ బ్యాటర్లు, బౌలర్లు రాణించడం వల్లే భారత్‌ విజయాలను నమోదు చేయగలిగింది" అని అన్నాడు. గత రెండేళ్ల నుంచి కోహ్లీ 14 టెస్టుల్లో 26.08 సగటుతో 652 పరుగులు మాత్రమే చేశాడు. పుజారా కూడా 19 మ్యాచుల్లో 26.52 సగటుతో 868 పరుగులు... రహానె 24.22 సగటుతో 17 టెస్టుల్లో 751 పరుగులు సాధించాడు. ముగ్గురు బ్యాటర్లలో రహానె ఒక్కడే సెంచరీ చేశాడు. అయినా సరే ఆసీస్‌, ఇంగ్లాండ్, న్యూజిలాండ్‌ జట్ల మీద సిరీస్‌లను భారత్‌ సొంతం చేసుకుంది.

టెస్టు క్రికెట్‌ కెరీర్‌లో అజింక్య రహానె, ఛెతేశ్వర్‌ పుజారా బ్యాటింగ్‌ యావరేజ్‌ తగ్గిపోవడం తననెంతో నిరుత్సాహానికి గురి చేసిందని ఇర్ఫాన్‌ తెలిపాడు. అలానే దక్షిణాఫ్రికాతో సిరీస్‌లోనూ విఫలం కావడం బాధాకరమని వ్యాఖ్యానించాడు. సీనియర్‌ బ్యాటర్లకు కుదురుకోవడానికి ఎక్కువ సమయం లేదని పేర్కొన్నాడు. యువ ఆటగాళ్లు జట్టులో స్థానం కోసం పోటీపడుతున్నారని గుర్తు చేశాడు. సౌతాఫ్రికాతో రెండో టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో పుజారా 3 పరుగులు (33 బంతుల్లో), రహానె (0) గోల్డెన్‌డకౌట్‌గా వెనుదిరిగాడు. మొదటి టెస్టులో రహానె (48, 20) కాస్త ఫర్వాలేదనిపించగా.. పుజారా (0, 16) మాత్రం దారుణంగా విఫలమయ్యాడు.

ఈ క్రమంలో వారి ప్రదర్శనపై ఇర్ఫాన్‌ విశ్లేషిస్తూ.. "తొలి టెస్టులో అజింక్య రహానె ఆత్మవిశ్వాసంతో బ్యాటింగ్‌ చేశాడు. అతడి ఫుట్‌వర్క్‌ కూడా బాగుంది. ఎంతో పాజిటివ్‌ దృక్పథంతో ఆడాడు. అయితే రెండో టెస్టులో (జోహన్నెస్‌బర్గ్‌) మాత్రం పుజారాతోపాటు రహానె కూడా నిరుత్సాహపరిచాడు. ఇప్పటివరకు ఒక్కొక్కరు భారత్‌ కోసం 80కిపైగా టెస్టులను ఆడారు. బ్యాటింగ్‌ యావరేజ్‌ 40 కంటే ఎక్కువ ఉండాలి. అయితే గత మూడు సంవత్సరాల గణాంకాలను పరిశీలిస్తే ప్రదర్శన దారుణంగా ఉంది. అంతేకాకుండా వారి బ్యాటింగ్‌ సగటు కూడానూ 30 దిగువకు పడిపోయింది. ఇదే నన్ను చాలా నిరాశపరిచింది. మరోవైపు పుజారా, రహానెకు కుదురుకోవడానికి మరీ ఎక్కువ సమయం లేదనుకుంటున్నా. ఎందుకంటే టెస్టు కెరీర్‌ అరంగేట్రంలోనే శతకం చేసి శ్రేయస అయ్యర్ అందరి దృష్టిని ఆకర్షించాడు. యువ ఆటగాళ్లు తమ అవకాశం కోసం ఎదురు చూస్తున్నారు. " అని వివరించాడు.

నాయకుడిగా ఎదిగాడు

కేవలం మూడేళ్లలోనే టెస్టుల్లో భారత్‌కు కీలక బౌలర్‌గా ఎదిగిన జస్ప్రీత్‌ బుమ్రాపై మాజీ ఆటగాడు మోర్నీ మోర్కెల్ ప్రశంసలు కురిపించాడు. సుదీర్ఘ ఫార్మాట్‌లో అత్యంత వేగంగా (26 టెస్టుల్లో 49 ఇన్నింగ్స్‌లు) వంద వికెట్లు తీసిన భారత బౌలర్‌గా రికార్డు సృష్టించాడు. ఈ క్రమంలో బుమ్రాను 'భారత పేస్‌ బౌలింగ్ దళానికి నాయకుడు' అంటూ మోర్కెల్​ అభినందించాడు. "2018 సీజన్‌లో దక్షిణాఫ్రికాలోనే బుమ్రా టెస్టుల్లోకి అరంగేట్రం చేశాడు. కేవలం మూడేళ్ల వ్యవధిలో చాలా వేగంగా ఎదిగాడు. భారత పేస్‌ బౌలింగ్‌కు నాయకుడిగా మారి కీలకమయ్యాడు" అని దక్షిణాఫ్రికా మాజీ పేసర్‌ మోర్నీ పేర్కొన్నాడు.

బౌలర్‌గా బుమ్రా విజయవంతం కావడానికి గల కారణాలను మోర్నీ మోర్కెల్‌ విశ్లేషించాడు. "బుమ్రా పేస్‌లో సహజత్వం ఉంటుంది. ఎలాంటి బ్యాటరైనా బుమ్రా బంతులను అర్థం చేసుకోవాలంటే కాస్త వేచి చూడాల్సిందే. అంతేకాకుండా ఇతర ఉత్తమ బౌలర్లతో భాగస్వామ్యం కూడానూ బుమ్రాకు కలిసొచ్చింది. బ్యాటర్లపై భారీగా ఒత్తిడి పెడతాడు. పిచ్‌ స్లోగా ఉన్నా.. వేగంగా ఉన్నా సరే అతడి పేస్‌ మాత్రం ఎప్పుడూ నిలకడగానే ఉంటుంది. బంతిని బ్యాటర్‌ శరీరం మీదకు దూసుకెళ్లేలా సంధించగలడు. ఆఫ్‌ స్టంప్‌కు గురి తప్పకుండా బౌలింగ్‌ చేస్తాడు. దీంతో అతడిని ఎదుర్కోవాలని ఏ బ్యాటరూ భావించడు" అని వివరించాడు. బౌలింగ్‌లో దూకుడుగా ఉండటం కూడా బుమ్రాకు కలిసొచ్చిన అంశమని భారత మాజీ ఫాస్ట్‌బౌలర్‌ ఇర్ఫాన్‌ పఠాన్ అభిప్రాయపడ్డాడు. బుమ్రా ఇన్‌స్వింగ్‌, అవుట్‌ స్వింగ్‌, యార్కర్లు సంధించడంలో దిట్టని అభినందించాడు. కాగా, ఇర్ఫాన్​ పఠాన్​ కూడా బుమ్రా బౌలింగ్​పై ప్రసంసలు కురిపించాడు.

షమీ.. బంతితోనే మాట్లాడిస్తాడు

దక్షిణాఫ్రికా పిచ్‌లపై భారత బౌలర్లు అద్భుతంగా బౌలింగ్‌ చేస్తున్నారని మోర్నీ అభినందించాడు. బుమ్రాతోపాటు మరీ ముఖ్యంగా షమీ ఎంతో ఆకట్టుకుంటున్నాడని చెప్పాడు. "షమీ రన్నింగ్‌, బంతిని వేసే చోటు నిలకడగా ఉంది. అన్నిసార్లూ మంచి లెన్త్‌తో బౌలింగ్‌ వేస్తున్నాడు. బంతిని మాట్లాడేలా చేస్తూ దక్షిణాఫ్రికా బ్యాటింగ్‌ను కష్టతరం చేస్తున్నాడు. బుమ్రా, షమీ భాగస్వామ్యం వికెట్లను పడగొట్టడంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. ప్రొటీస్‌ ఆటగాళ్లు ఎన్ని గేమ్‌ప్లాన్స్‌ వేసుకున్నా షమీ ముందు మాత్రం నిలవలేకపోతున్నాయి" అని తెలిపాడు.

ఇదీ చూడండి: Nz vs Bangladesh: బంగ్లా చారిత్రక విజయం.. కివీస్​ గడ్డపై ఇదే తొలిసారి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.