ETV Bharat / sports

క్రికెట్​ ఫ్యాన్స్​కు గుడ్​న్యూస్​, రాహుల్​ ద్రవిడ్​ తిరిగొచ్చేశాడు - ఆసియా కప్​ 2022 రాహుల్ ద్రవిడ్​

Rahul Dravid corona negative కరోనా బారిన పడిన టీమ్​ఇండియా ప్రధాన కోచ్​ రాహుల్​ ద్రవిడ్​ వైరస్​ బారి నుంచి బయటపడ్డాడు. ప్రస్తుతం ఆసియా కప్​ కోసం దుబాయ్​ చేరుకుని జట్టుతో కలిశాడని క్రికెట్ వర్గాలు తెలిపాయి.

dravid corona
ద్రవిడ్​ కరోనా
author img

By

Published : Aug 28, 2022, 9:45 AM IST

Rahul Dravid corona negative ఆసియాకప్​లో భాగంగా టీమ్​ఇండియా తన తొలి మ్యాచ్​ను ఆదివారం సాయంత్రం చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్​తో తలపడనుంది. అయితే ఈ మ్యాచ్​కు ముందు భారత క్రికెట్ అభిమానులకు ఓ గుడ్​న్యూస్​. కరోనా బారిన పడిన టీమ్​ఇండియా ప్రధాన కోచ్​ రాహుల్​ ద్రవిడ్​ కోలుకున్నాడట. తాజాగా చేసిన పరీక్షల్లో అతడికి నెగటివ్​ వచ్చినట్లు తెలిసింది. ఈ విషయాన్ని క్రికెట్​ వర్గాలు తెలిపాయి. అతడు ఇప్పటికే ఈ ఆసియా కప్​ కోసం దుబాయ్​ కూడా చేరుకుని జట్టులో కలిశాడని వెల్లడించాయి. ప్రాక్టీస్​ సెషన్​కు కూడా హాజరైనట్లు చెప్పాయి. మొదటగా ద్రవిడ్ గైర్హాజరీ కారణంగా తాత్కాలిక కోచ్​గా వీవీఎస్​ లక్ష్మణ్​ను ఎంపిక చేశారు. ప్రస్తుతం అతడు జట్టుతోనే ఉన్నాడు. పాక్​తో మ్యాచ్​ ముగిశాక అతడు వెనక్కి వచ్చే అవకాశం ఉంది.

ఇక ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఎదురు చూసే భారత్‌, పాక్‌ పోరు ఈ ఆసియా కప్‌నకే ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. ఈ సారి చిరకాల ప్రత్యర్థులు మొత్తంగా మూడు మ్యాచ్‌ల్లో పోటీపడే అవకాశం ఉంది. మొదట గ్రూప్‌ దశలో నేడు(ఆదివారం) ఈ ఇరు జట్లు తమ తొలి మ్యాచ్‌ ఆడనున్నాయి. ఈ మ్యాచ్​లో గెలవాలని రెండు టీమ్స్​ పట్లుదలతో ఉన్నాయి. అలాగే టీమ్ఇండియా మాజీ కెప్టెన్​ కోహ్లీ ఈ మ్యాచ్​తో ఫామ్​లోకి రావాలని అభిమానులు ఆశిస్తున్నారు. అతడు సెంచరీ చేయాలని ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. ఇక ఈ మ్యాచ్​ కోహ్లీకి ఎంతో స్పెషల్​. అతడికి 100వ టీ20 మ్యాచ్​.

కాగా, ఆసియా కప్​లో భాగంగా శనివారం జరిగిన తొలి మ్యాచ్ ఏకపక్షంగా సాగింది. ఐదుసార్లు ఆసియా కప్‌ ఛాంపియన్‌ అయిన శ్రీలంకకు ప్రారంభ మ్యాచ్‌లో ఆఫ్గానిస్థాన్‌ షాకిచ్చింది. శ్రీలంకపై అన్ని రంగాల్లో ఆధిపత్యం చెలాయించింది. తొలుత బౌలింగ్​లో లంకను 105కే కట్టడి చేసిన అఫ్గాన్.. అనంతరం ఛేదనలో రికార్డు వేగంతో పని పూర్తి చేసింది. కేవలం 10.1 ఓవర్లలోనే ఇన్నింగ్స్ ముగించింది. ఎనిమిది వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది.

ఇదీ చూడండి: భారత్​ పాక్​ మ్యాచ్, అందరి దృష్టి పరుగుల వీరుడు కోహ్లీ పైనే

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.