Womens Asia Cup 2022 : మహిళల ఆసియా కప్ 2022లో భారత్ జట్టు దూసుకుపోతోంది. శ్రీలంకపై మొదటి మ్యాచ్ గెలిచి శుభారంభం చేసిన టీమ్ఇండియా.. రెండో మ్యాచ్‌లో మలేసియాతో తలపడింది. ఈ మ్యాచ్‌లో టీమ్ఇండియా 30 పరుగుల తేడాతో విజయం సాధించింది.
మొదటగా టాస్ ఓడి బ్యాటింగ్ చేసిని హర్మన్ సేన.. ఇన్నింగ్స్ ముగిసే సరికి నాలుగు వికెట్ల నష్టానికి 181 పరుగులు చేసింది. టీమ్ఇండియా బ్యాటర్, తెలుగు తేజం సబ్బినేని మేఘన 53 బంతుల్లో 69 పరుగులు చేసి ఔరా అనిపించింది. 11 ఫోర్లు, 1 సిక్స్‌ను తన ఖాతాలో వేసుకుంది. తన టీ20 కెరీర్లో మొదటి అర్ధ సెంచరీని నమోదు చేసింది మేఘన. మరో బ్యాటర్ శఫాలి వర్మ.. 39 బంతుల్లో 46 పరుగులు, రిచా ఘోష్.. 19 బంతుల్లో 33 పరుగులు చేసి మెరిశారు.
అనంతరం బ్యాటింగ్‌కు దిగిన మలేసియా.. 5.2 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి.. 16 పరుగులు చేసింది. ఇంతలో వర్షం పడడం వల్ల మ్యాచ్ రద్దయింది. దీంతో డీఎల్ఎస్ (డక్ వర్త్ లూయిస్) పద్ధతిలో 30 పరుగుల తేడాతో భారత్ గెలిచినట్లు ప్రకటించారు అంపైర్లు.
ఇవీ చదవండి: Rohith: ఆ ఘనత సాధించిన తొలి కెప్టెన్‌గా రికార్డ్.. గాయంతోనే ఆడి..
స్టేడియంలో 'ఫ్యాన్స్ ఫైట్'.. ఇలాంటి విషాదాలు ఎన్నో.. ఆ మ్యాచ్‌లో ఏకంగా 20వేల మంది!