ETV Bharat / sports

డబ్ల్యూటీసీ ఫైనల్​కు గంగూలీ.. భారత క్రికెటర్లకు వ్యాక్సిన్​! - WTC Final

ప్రపంచ టెస్టు ఛాంపియన్​షిప్​ ఫైనల్​ను వీక్షించేందుకు బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ, కార్యదర్శి జైషా వెళ్లనున్నారు. మరోవైపు ఈ పర్యటనకు వెళ్లడానికి ముందే టీమ్​ఇండియా క్రికెటర్లకు కరోనా వ్యాక్సిన్​ తొలి డోసు ఇవ్వనున్నారు.

ganguly
గంగూలీ
author img

By

Published : May 8, 2021, 9:40 PM IST

సౌథాంప్టన్​ వేదికగా జరగబోయే ప్రపంచ టెస్టు ఛాంపియన్​షిప్​ ఫైనల్​లో టీమ్​ఇండియా న్యూజిలాండ్​ తలపడనున్నాయి. జూన్​ 16 నుంచి 22 వరకు ఈ మ్యాచ్​​ జరగనుంది. అయితే దీనికి వీక్షించేందుకు బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ, సెక్రటరీ జైషా హాజరుకానున్నారని బోర్డు ప్రతినిధి ఒకరు చెప్పారు. మరోవైపు నిరవధిక వాయిదా పడిన ఐపీఎల్​లోని మిగతా మ్యాచ్​లను యూకేలో నిర్వహించేలా ఇంగ్లాండ్​ క్రికెట్​బోర్డుతో బీసీసీఐ చర్చలు జరిపే అవకాశముందని అన్నారు.

ప్రసిద్ధ్​కృష్ణకు వ్యాక్సిన్​ లేనట్టేనా

ప్రపంచ టెస్టు ఛాంపియన్​షిప్​ ఫైనల్​, ఇంగ్లాండ్​తో సిరీస్​కోసం యూకే వెళ్లనున్న టీమ్​ఇండియా ఆటగాళ్లకు పర్యటనకు ముందే కరోనా వ్యాక్సిన్​ తొలి డోసు ఇవ్వనున్నట్లు ఓ బోర్డు అధికారి తెలిపారు. అయితే శనివారం కరోనా బారిన పడిన ప్రసిద్ధ్​ కృష్ణకు టీకా తీసుకునే అవకాశం లేకపోవచ్చు. ఎందుకంటే వైరస్​ నుంచి కోలుకున్నా నాలుగు వారాల తర్వాత మాత్రమే బాధితుడు వ్యాక్సినేషన్​ను వేయించుకోవాలి. అయితే యూకే పర్యటనకు టీమ్​ఇండియా జూన్​ 2న బయలుదేరనుంది. దీనిప్రకారం మే 18 లేదా 20వ తేదీన ప్రసిద్ధ్​కు నెగటివ్​ తేలిన జూన్​ 2 నాటికి అతడు టీకాను తీసుకోలేడు.

ఇదీ చూడండి: ఇంగ్లాండ్​ పర్యటనకు భారత క్రికెటర్లు​ కుటుంబంతో సహా!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.