శ్రీలంకతో పరిమిత ఓవర్ల సిరీస్ కోసం జట్టును ప్రకటించింది బీసీసీఐ. ఈ జట్టుకు ధావన్ కెప్టెన్గా వ్యవహరించనున్నాడు. సీనియర్ ఆటగాళ్లు కోహ్లీ, రోహిత్, బుమ్రాలతో కూడిన జట్టు ఇంగ్లాండ్ పర్యటనలో ఉన్న నేపథ్యంలో యువ జట్టుతో లంకకు పయనమవనుంది టీమ్ఇండియా.
భారత జట్టు
ధావన్ (కెప్టెన్), భువనేశ్వర్ కుమార్ (వైస్ కెప్టెన్), పృథ్వీ షా, పడిక్కల్, రుతురాజ్ గైక్వాడ్, సూర్యకుమార్ యాదవ్, మనీష్ పాండే, హార్దిక్ పాండ్యా, నితీష్ రానా, ఇషాన్ కిషన్, శాంసన్, చాహల్, రాహుల్ చాహర్, కృష్ణప్ప గౌతమ్, కుల్దీప్, కృనాల్ పాండ్యా, వరుణ్ చక్రవర్తి, దీపక్ చాహర్, నవదీప్ సైనీ, చేతన్ సకారియా.
నెట్ బౌలర్లు: ఇషాన్ పోరెల్, సందీప్ వారియర్, అర్షదీప్ సింగ్, సాయి కిషోర్, సిమర్జీత్ సింగ్
షెడ్యూల్
లంక పర్యటన జులై 13 నుంచి 25 వరకు జరగనుంది. ఇరు జట్లు మూడు వన్డేలు(జులై 13,16,18), మూడు టీ20లు(21,23,25)వ తేదీల్లో ఆడనున్నాయి. అయితే ఈ మ్యాచ్లు నిర్వహించే వేదికలను మాత్రం ఇప్పటివరకు ప్రకటించలేదు.