WTC 2021-23 Points Table: న్యూజిలాండ్‌తో జరిగిన మొదటి టెస్టును డ్రా చేసుకుంది టీమ్ఇండియా. ఈ క్రమంలోనే ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ రెండో ఎడిషన్ పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి చేరింది. ఇంగ్లాండ్‌తో జరిగిన సిరీస్‌ను 2-1 తేడాతో కైవసం చేసుకున్న భారత్.. తాజాగా కివీస్‌తో తొలి మ్యాచ్‌ను డ్రా చేసుకుంది. దీంతో పాయింట్ల పట్టికలో 30 పాయింట్లు, 50 పర్సంటేజ్‌తో రెండో స్థానంలో నిలిచింది. 2021-23 ఎడిషన్‌లో తొలి టెస్టు మ్యాచ్ ఆడిన న్యూజిలాండ్ 4 పాయింట్లు, 33.33 పర్సంటేజ్‌తో 5వ స్థానానికి చేరుకుంది. శ్రీలంక 100 పర్సంటేజ్, 12 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతోంది.
-
Here's how the teams stack up in the #WTC23 standings after that thrilling draw between India and New Zealand in Kanpur 👀 pic.twitter.com/VxGmkMlbfQ
— ICC (@ICC) November 29, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
">Here's how the teams stack up in the #WTC23 standings after that thrilling draw between India and New Zealand in Kanpur 👀 pic.twitter.com/VxGmkMlbfQ
— ICC (@ICC) November 29, 2021Here's how the teams stack up in the #WTC23 standings after that thrilling draw between India and New Zealand in Kanpur 👀 pic.twitter.com/VxGmkMlbfQ
— ICC (@ICC) November 29, 2021
ఇదే కొత్త విధానం
WTC 2021-23 Points System: డబ్ల్యూటీసీ-2 (2021-2023) కోసం కొత్త పాయింట్ల పద్ధతిని ఇదివరకే ప్రకటించింది అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ). పర్సెంటేజ్ ఆఫ్ పాయింట్ల ప్రకారం జట్లకు ర్యాంకులు ఇవ్వనున్నట్లు తెలిపింది. గెలిచిన ప్రతి మ్యాచ్‌కు 12 పాయింట్లు వస్తాయని వెల్లడించింది.
ఈ కొత్త పద్ధతి ప్రకారం గెలిచిన ప్రతి మ్యాచ్‌కు 12 పాయింట్లు, పర్సెంటేజ్ రూపంలో 100 పాయింట్లు ఇస్తారు. టై అయితే (6 పాయింట్లు, 50 శాతం), డ్రా (4 పాయింట్లు, 33.33 శాతం), ఓడిన మ్యాచ్‌కు (0 పాయింట్లు, 0 శాతం) ఉంటాయి. మ్యాచ్‌ల సంఖ్య ఆధారంగా సిరీస్ పాయింట్లను కేటాయిస్తారు.