India Tour of West Indies : భారత్ వన్డే, టెస్ట్ టీమ్ వివరాలను బీసీసీఐ ఇటీవలే ప్రకటించింది. ఈ క్రమంలో వెస్టిండీస్ పర్యటనకు ఎంపిక చేసిన టెస్ట్ టీమ్ కోసం టీమ్ఇండియా పేసర్ నవ్‌దీప్ సైనీని తీసుకుంది. 2021 జనవరి నుంచి టెస్టులు ఆడని సైనీ.. కౌంటీ క్రికెట్‌లో ఆడేందుకు ఇంగ్లాండ్ వెళ్లాడు. అప్పుడే అతడికి భారత జట్టు నుంచి పిలుపు వచ్చింది. దీంతో సంతోషం వ్యక్తం చేసిన సైనీ తనకు ఈ అవకాశం దక్కుతుందని అస్సలు ఊహించలేదన్నాడు.
-
NEWS - India’s squads for West Indies Tests and ODI series announced.
— BCCI (@BCCI) June 23, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
TEST Squad: Rohit Sharma (Capt), Shubman Gill, Ruturaj Gaikwad, Virat Kohli, Yashasvi Jaiswal, Ajinkya Rahane (VC), KS Bharat (wk), Ishan Kishan (wk), R Ashwin, R Jadeja, Shardul Thakur, Axar Patel, Mohd.… pic.twitter.com/w6IzLEhy63
">NEWS - India’s squads for West Indies Tests and ODI series announced.
— BCCI (@BCCI) June 23, 2023
TEST Squad: Rohit Sharma (Capt), Shubman Gill, Ruturaj Gaikwad, Virat Kohli, Yashasvi Jaiswal, Ajinkya Rahane (VC), KS Bharat (wk), Ishan Kishan (wk), R Ashwin, R Jadeja, Shardul Thakur, Axar Patel, Mohd.… pic.twitter.com/w6IzLEhy63NEWS - India’s squads for West Indies Tests and ODI series announced.
— BCCI (@BCCI) June 23, 2023
TEST Squad: Rohit Sharma (Capt), Shubman Gill, Ruturaj Gaikwad, Virat Kohli, Yashasvi Jaiswal, Ajinkya Rahane (VC), KS Bharat (wk), Ishan Kishan (wk), R Ashwin, R Jadeja, Shardul Thakur, Axar Patel, Mohd.… pic.twitter.com/w6IzLEhy63
"నేను కౌంటీ క్రికెట్ ఆడేందుకు లండన్‌కు వచ్చాను. ఎయిర్‌పోర్ట్ నుంచి బయటకు వస్తున్న సమయంలో వెస్టిండీస్‌తో జరిగే టెస్ట్ సిరీస్‌కు నేను ఎంపికయ్యానని తెలిసింది. అయితే ఈ సిరీస్‌కు ఎంపికవుతానని నేను ఊహించలేదు. ఇటీవల ముగిసిన డబ్ల్యూటీసీ ఫైనల్‌కు నెట్ బౌలర్‌గా లేదా స్టాండ్ బై ప్లేయర్‌గా అయినా నన్ను తీసుకుంటారని భావించాను. అందుకే ఐపీఎల్ సమయంలోనే డ్యూక్ బాల్స్‌తోనే ప్రాక్టీస్ చేశాను. ఇప్పుడు వెస్టిండీస్‌కు వెళ్లే ముందు ఒక కౌంటీ మ్యాచ్ ఆడే అవకాశం ఉంది. ఇది నాకు మంచి ప్రాక్టీస్‌గా కూడా ఉపయోగపడుతుంది. నేను వెస్టిండీస్ పర్యటనకు వెళ్లడం ఇది రెండోసారి. మొదటిసారి వెళ్లినప్పుడు నాకు ఆడే అవకాశం రాలేదు. అక్కడి వాతావరణం గురించి నాకు బాగా తెలుసు. పిచ్‌లు చాలా స్లోగా ఉంటాయి " అని నవ్‌దీప్ సైనీ చెప్పుకొచ్చాడు.
-
🇮🇳 India fast bowler @navdeepsaini96 will be with us for the next four @CountyChamp games, starting on Sunday 🤩
— Worcestershire Rapids (@WorcsCCC) June 23, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
➡️ https://t.co/o0g5y96B5d
🍐 #WeAreWorcestershire pic.twitter.com/Y4neN69zmq
">🇮🇳 India fast bowler @navdeepsaini96 will be with us for the next four @CountyChamp games, starting on Sunday 🤩
— Worcestershire Rapids (@WorcsCCC) June 23, 2023
➡️ https://t.co/o0g5y96B5d
🍐 #WeAreWorcestershire pic.twitter.com/Y4neN69zmq🇮🇳 India fast bowler @navdeepsaini96 will be with us for the next four @CountyChamp games, starting on Sunday 🤩
— Worcestershire Rapids (@WorcsCCC) June 23, 2023
➡️ https://t.co/o0g5y96B5d
🍐 #WeAreWorcestershire pic.twitter.com/Y4neN69zmq
West Indies Vs India : టెస్ట్ టీమ్‌లో ఛెతేశ్వర్ పుజారాతో పాటు ఉమేశ్ యాదవ్‌లపై వేటు వేసిన బీసీసీఐ.. సీనియర్ పేసర్ మహమ్మద్ షమీకి విశ్రాంతినిచ్చింది. ఈ మార్పుల్లో భాగంగానే షమీ స్థానంలో నవ్‌దీప్ సైనీకి ఆ అవకాశం కల్పించింది. ప్రస్తుతం కౌంటీల్లో వోర్సెస్టర్‌షైర్ తరఫున నాలుగు మ్యాచ్‌లు ఆడేందుకు సైనీ ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఆదివారం డెర్బీషైర్‌తో మ్యాచ్ ఆడిన తర్వాత సైనీ విండీస్‌కు బయలుదేరే అవకాశాలున్నాయి. భారత్- వెస్టిండీస్ మధ్య తొలి టెస్టు డొమినికాలో జులై 12-16 వరకు, చివరి టెస్టు జమైకాలో జూలై 20-24 వరకు జరగనుంది.
2019లో టీమ్ఇండియా తరఫున ఆరంగేట్రం చేసిన ఈ స్టార్ ప్లేయర్.. అదే సంవత్సరం ఆగస్టులో వెస్టిండీస్‌తో జరిగిన టీ-20 సిరీస్ ద్వారా అంతర్జాతీయ క్రికెట్‌లో ఎంట్రీ ఇచ్చాడు. 2019 డిసెంబర్‌లో వెస్టిండీస్‌తో జరిగిన వన్డే ఫార్మాట్‌లో బరిలోకి దిగాడు. ఆ తర్వాత 2021 జనవరిలో ఆస్ట్రేలియాతో జరిగిన బోర్డర్-గావస్కర్ ట్రోఫీ సందర్భంగా సుదీర్ఘ ఫార్మాట్‌లో ఎంట్రీ ఇచ్చాడు. సైనీ చివరగా 2021 జులైలో శ్రీలంకతో జరిగిన టీ-20 ఆడాడు.