ETV Bharat / sports

Team India ODI Ranking 2023 : టీమ్​ఇండియా.. క్రికెట్‌ చరిత్రలోనే అరుదైన ఫీట్​.. నెం.1గా ఘనత

Team India ODI Ranking 2023 : టీమ్‌ఇండియా.. క్రికెట్ హిస్టరీలో అరుదైన ఫీట్​ అందుకుంది. దీంతో భారత జట్టుపై ప్రశంసలు కురుస్తున్నాయి. ఆ వివరాలు..

Team India ODI Ranking 2023 : టీమ్​ఇండియా.. క్రికెట్‌ చరిత్రలోనే అరుదైన ఫీట్​.. నెం.1గా ఘనత
Team India ODI Ranking 2023 : టీమ్​ఇండియా.. క్రికెట్‌ చరిత్రలోనే అరుదైన ఫీట్​.. నెం.1గా ఘనత
author img

By ETV Bharat Telugu Team

Published : Sep 23, 2023, 6:42 AM IST

Team India ODI Ranking 2023 : ప్రపంచ కప్‌(ODI World Cup 2023) ముంగిట టీమ్​ఇండియాకు అన్నీ శుభశకునాలే. రీసెంట్​గా ఆసియా కప్‌ 2023 ముద్దాడిన సంబరం మర్చిపోకముందే.. తాజాగా ఐసీసీ ర్యాంకింగ్స్‌లోనూ అన్ని ఫార్మాట్లలో టీమ్​ఇండియా అగ్రస్థానంలో నిలిచింది. ఆస్ట్రేలియాతో మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా సెప్టెంబర్ 22 జరిగిన మొదటి మ్యాచ్‌లో మనోళ్లు విజయం సాధించారు. దీంతో ఈ సిరీస్‌ను ఘనంగా ప్రారంభించడంతో పాటు.. తాజాగా ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లోనూ టాప్ ప్లేస్​కు దూసుకెళ్లింది. ప్రస్తుతం 116 పాయింట్లతో మొదటి ర్యాంక్‌ను అందుకోగా.. పాకిస్థాన్‌ (115 పాయింట్లు), ఆస్ట్రేలియా (111 పాయింట్లు) తర్వాతి స్థానాల్లో నిలిచాయి. ఆస్ట్రేలియాతో సిరీస్‌ను నెగ్గితే వరల్డ్​ కప్​లో అగ్ర స్థానంతో బరిలోకి దిగే ఛాన్స్​ టీమ్​ఇండియాకు దక్కుతుంది.

  • TeamIndia Test, T20 Rankings : ఇప్పటికే టీమ్​ఇండియా.. టెస్టు, టీ20 ఫార్మాట్‌లో ఫస్ట్​ ప్లేస్​ను దక్కించుకున్న సంగతి తెలిసిందే. ఆస్ట్రేలియాతో బోర్డర్‌- గావస్కర్‌ సిరీస్‌ను గెలుచుకోవడం, వరల్డ్​ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌కు వెళ్లడం, వెస్టిండీస్​పై టెస్ట్ సిరీస్‌ సాధించడం వల్ల టెస్టుల్లో టీమ్​ఇండియా 118 పాయింట్లతో అగ్ర స్థానానికి కైవసం చేసుకుంది. టీమ్‌ఇండియా తర్వాత టెస్టుల్లో ఆస్ట్రేలియా 118 పాయింట్లు, ఇంగ్లాండ్‌ 115 పాయింట్లతో కొనసాగుతున్నాయి.
  • గతేడాది టీ20 వరల్డ్​ కప్​ సెమీ ఫైనల్‌కు వెళ్లడం, ద్వైపాక్షిక సిరీసుల్లోనూ బెస్ట్ పెర్​ఫార్మెన్స్​ చేయడంతో.. టీ20ల్లోనూ టీమ్​ఇండియా ఫస్ట్ ప్లేస్​కు చేరుకుంది. 2021 టీ20 వరల్డ్​ కప్‌ నుంచి ఇప్పటి వరకు మొత్తం 14 సిరీసుల్లో కేవలం ఒక్క సిరీస్​లో మాత్రమే టీమ్‌ఇండియా ఓడిపోయింది. దీంతో టీమ్​ఇండియా 264 పాయింట్లు, ఇంగ్లాండ్ 261 పాయింట్లు, పాకిస్థాన్ 254 పాయింట్లతో మొదటి మూడు స్థానాల్లో నిలిచాయి.
  • ఇలా మొత్తంగా మూడు ఫార్మాట్లలోనూ టీమ్​ఇండియా అగ్ర స్థానాన్ని దక్కించుకోవడం ఇదే మొదటి సారి. టీమ్​ ఇండియా కన్నా ముందు 2012లో సౌత్ ఆఫ్రికా ఈ అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకుంది. ఆ తర్వాత ఇప్పుడు టీమ్​ ఇండియా ఆ లిస్ట్​లో చేరింది.

Ind vs Aus 1st ODI 2023 : తొలి వన్డేలో ఆసీస్ చిత్తు.. ఆల్​రౌండ్ ప్రదర్శనతో భారత్ జయభేరి.. ఏడాదిన్నర తర్వాత నెం.1కు టీమ్ఇండియా

Pakistan Squad For World Cup 2023 : వరల్డ్​కప్​నకు పాక్ జట్టు రెడీ.. సగం మంది ఎవరికీ తెలీదు భయ్యా!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.