Team India Journey Before World Cup : 2023 వరల్డ్ కప్ ఫైనల్లో ఆస్ట్రేలియాను చిత్తుచేసి ముచ్చటగా మూడోసారి జగజ్జేతగా నిలిచింది టీమ్ఇండియా. ప్రపంచ వేదికపై 140 కోట్ల మంది ఆకాంక్షలను భారత క్రికెట్ జట్టు సగర్వంగా నిలబెట్టింది. ఈ వరల్డ్ కప్‌లో అప్రతిహతంగా దూసుకెళ్లిన టీమ్ఇండియా.. అన్‌స్టాపబుల్‌గా అన్ని మ్యాచ్‌లు గెలించింది. అయితే వరల్డ్ ప్రారంభానికి ముందు అనిశ్చితిలో ఉన్న టీమ్ఇండియా ఈ స్థాయికి చేరుకోడానికి చాలా దూరం ప్రయాణించాల్సి వచ్చింది. గతేడాది జరిగిన టీ20 వరల్డ్ కప్‌లో టీమ్ఇండియా సెమీస్‌లోనే ఇంటిముఖం పట్టింది.
ఇక ఈ ఏడాది జూన్‌లో జరిగిన డబ్ల్యూటీసీ ఫైనల్లోనూ భారత్‌కు నిరాశ ఎదురైంది. ఆస్ట్రేలియా చేతిలో 209 పరుగులతో పరాజయం పాలైంది. ఈ మ్యాచ్‌లో 444 పరుగులతో బరిలోకి దిగిన భారత్.. 234 పరుగులకే ఆలౌట్ అయింది. ఈ మ్యాచ్‌లో అటు బ్యాటర్లు.. ఇటు బౌలర్లు తేలిపోయారు. ఇక వరల్డ్ కప్‌నకు ముందు టీమ్ఇండియా ఆసియా కప్ ఫైనల్లో శ్రీలంకపై విజయం సాధించింది. ఎనిమిదో సారి ఆసియా కప్ టైటిల్‌ను గెలిచి ఔరా అనిపించింది. అయితే భారత్ కప్పు గెలిచింది కానీ.. తమ జట్టు ప్రదర్శనతో తీవ్ర విమర్శలు ఎదుర్కొంది.
డబ్ల్యూటీసీ ఫైనల్లో తేలిపోయి..!
డబ్ల్యూటీసీ ఫైనల్లో ఆడిన జట్టు కూర్పు సరిగ్గా లేదు. స్పిన్‌కు అనుకూలించే పిచ్‌పై ఆడుతున్న మ్యాచ్‌లో కనీసం పార్ట్‌టైమ్ స్నిన్నర్ లేకుండా టీమ్ఇండియా బరిలోకి దిగింది. బౌలర్లు షమీ, సిరాజ్ భారీగా పరుగులు సమర్పించారు. ఇక బ్యాటింగ్‌లో అజింక్య రహానె మినహా మిగతా వారు తేలిపోయారు. ఫలితం వరుసగా రెండో సారి డబ్ల్యూటీసీ ఫైనల్లో వెనుదిరగడం. ఇక ఇదే అనిశ్చితితో టీమ్ఇండియా ఈ ఏడాది ఆగస్టులో జరిగిన ఆసియా కప్‌నకు సిద్ధమైంది.
ఆసియా కప్‌లో అనిశ్చితి!
2023 ఆసియా కప్ టోర్నీలోనూ జట్టు పట్లు కొంత ఆందోళన. సూపర్ - 4 మ్యాచ్‌లో భీకరమైన పేసర్లు.. దూకుడుగా ఆడే బ్యాటర్లు ఉన్న పాకిస్థాన్ని అలవోకగా చిత్తు చేశారు. కానీ, మరుసటి రోజు అదే మైదానంలో శ్రీలంకతో మ్యాచ్.. ఈసారి మాత్రం విజయం కోసం తీవ్రంగా శ్రమించాల్సిన పరిస్థితి. చివరగా ఆసియా కప్ ఫైనల్ చేరింది. ఇక ఫైనల్లో టీమ్ఇండియా బ్యాటింగ్‌లో పెద్దగా శ్రమించాల్సిన పనిలేకుండానే కప్పు గెలిచింది.
గతేడాది నుంచి ఆయా జట్లతో ఆడిన, ద్వైపాక్షిక సిరీస్‌లు గెలిచినా.. టీమ్ఇండియా నిలకడలేమితో సతమతమైంది. అదే సమయంలో గాయాలు టీమ్ఇండియాను వెంటాడాయి. వరల్డ్ కప్‌నకు ముందు గాయంతో జట్టుకు దూరమైన బుమ్రా.. ఈ మెగా టోర్నీ ఆడతాడా లేదా అన్న సందేహాలు మొదలయ్యాయి. హార్దిక్ పాండ్య, షమీ కూడా గాయాలతో ఓ దశలో జట్టుకు దూరమయ్యారు. 2023 వరల్డ్ కప్ ముంగిట జరిగిన ఈ పరిణామాల వల్ల.. భారత్ మూడోసారి వరల్డ్ కప్ కొడుతుందా అనే సందేహాలు వ్యక్తమయ్యాయి. యువరాజ్ వంటి మాజీ క్రికెటర్ ఈసారి టీమ్ఇండియా వరల్డ్ కప్ గెలవడం కష్టమే అని చెప్పిన సందర్భాలూ ఉన్నాయి.
పడిలేచిన కెరటంలా..!
అయితే చివరకు వరల్డ్ కప్ జట్టును బీసీసీఐ ప్రకటించింది. అయినా జట్టుపై అనిశ్చితి, నిలకడ లేమిపై విమర్శలు, గాయాల నుంచి తిరిగొచ్చిన ప్లేయర్ల రాణిస్తారో లేదో అన్న సందేహాలు వ్యక్తమయ్యాయి. ఈ పరిణామాల మధ్య టీమ్ఇండియా.. 2023 అక్టోబర్ 8 ఆస్ట్రేలియాతో తొలి మ్యాచ్ ఆడింది. ఈ మెగా టోర్నీ మొదటి మ్యాచ్‌లోనే టీమ్ఇండియా అదరగొట్టింది ఆస్ట్రేలియాను 6 వికెట్ల తేడాతో చిత్తుచేసింది. ఇక అప్పుడు మొదలైన ఆట.. వరల్డ్ ఫైనల్ వరకూ అప్రతిహతంగా కొనసాగింది. భారత జట్టు రెక్కల గుర్రంలా ఎదురులేకుండా దూసుకెళ్లింది. బ్యాటింగ్ విఫలమైనప్పుడు బ్యాటర్లు తామున్నాం.. అంటూ మ్యాచ్‌ను విజయ తీరాలకు నడిపించారు. బౌలింగ్ గాడితప్పినప్పుడు బ్యాటర్లు విజృంభించారు. అలా పడిలేచిన కెరటంలో టీమ్ఇండియా మళ్లీ ఫామ్‌లోకి వచ్చింది.
అందరూ.. ఎవరికి వారే!
ఈ వరల్డ్ కప్‌లో టీమ్ఇండియా బ్యాటర్లు శుభ్‌మన్ గిల్, రోహిత్ శర్మ, శ్రేయస్ అయ్యర్, విరాట్ కోహ్లీ తమ అద్భుతమైన ఫామ్‌ను కొనసాగించారు. ఆల్‌రౌండర్లు రవీంద్ర జడేజా, శార్దుల్ ఠాకూర్ తమ ఆల్‌రౌండ్ ప్రదర్శనతో ఆకట్టుకున్నారు. ఈ క్రమంలో గాయం కారణంగా మరో ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్య జట్టుకు దూరమయ్యాడు. అతడి స్థానంలో వచ్చిన స్టార్ పేసర్ మహ్మద్ షమీ.. అన్‌స్టాపబుల్ ప్రదర్శన చేశాడు. ఆడిన ఆరు మ్యాచ్‌లో మొత్తం 23 వికెట్లు తీసి.. టోర్నీలో అత్యధిక వికెట్లు సాధించిన బౌలర్‌గా నిలిచాడు. అందులో మూడు సార్లు 5 వికెట్ల ప్రదర్శన చేశాడు.
బుమ్రా కట్టుదిట్టంగా బౌలింగ్ వేస్తూ ప్రత్యర్థులకు చెమటలు పట్టించారు. మహ్మద్ సిరాజ్, రవిచంద్రన్ అశ్విన్ సైతం తమ ఫామ్‌ను కొనసాగించారు. అలా లీగ్ స్టేజ్‌లో ఆడిన తొమ్మిది మ్యాచ్‌ల్లో టీమ్ఇండియా విజయం సాధించింది. ఆ తర్వాత సెమీ ఫైనల్ న్యూజిలాండ్‌పై ఘన విజయం సాధించింది ఫైనల్లో ప్రవేశించింది. అలా అహ్మదాబాద్.. నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా ఆదివారం ఆస్ట్రేలియాతో జరగనున్న ఫైనల్లో తలపడుతోంది.
-
Pumped 🆙 for the #CWC23 Final 🏟️👌#TeamIndia | #MenInBlue | #Final | #INDvAUS pic.twitter.com/9YtJiO2anE
— BCCI (@BCCI) November 17, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">Pumped 🆙 for the #CWC23 Final 🏟️👌#TeamIndia | #MenInBlue | #Final | #INDvAUS pic.twitter.com/9YtJiO2anE
— BCCI (@BCCI) November 17, 2023Pumped 🆙 for the #CWC23 Final 🏟️👌#TeamIndia | #MenInBlue | #Final | #INDvAUS pic.twitter.com/9YtJiO2anE
— BCCI (@BCCI) November 17, 2023
ఫైనల్ పోరుకు సిద్ధంగా ఉన్నాం- ఆసీస్‌ను తక్కువ అంచనా వేయకూడదు : రోహిత్ శర్మ
'టీమ్ఇండియా అన్ని విభాగాల్లో బాగుంది- షమీ మాకు పెద్ద సవాల్!' : ప్యాట్ కమిన్స్