Team India Future Plan : టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ ఇటీవల ముగిసిన వన్డే వరల్డ్‌కప్‌లో అద్భుత ప్రదర్శన కనబర్చారు. టోర్నీలో వరుసగా 10 మ్యాచ్‌ల్లో గెలిచి ఫైనల్ చేరినా తుదిపోరులో ఆస్ట్రేలియా చేతిలో ఓడి రన్నరప్‌గా నిలిచిన విషయం తెలిసిందే. మెగా టోర్నీలో ఛాంపియన్‌గా నిలువకపోయినా వైట్ బాల్ (లిమిటెడ్ ఓవర్లు) క్రికెట్లో టీమ్ఇండియా అత్యుత్తమ జట్టని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
మరి జట్టు ఇంత బలంగా అవ్వడానికి కారణమెవరు? ఇదంతా ఒక్క రోజులో జరిగిందా? అయితే టీమ్ఇండియా అత్యుత్తమ జట్టుగా మారడానికి బీసీసీఐ, బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ) ఎంతగానో తోడ్పడ్డాయి అనడంలో ఎలాంటి సందేహం లేదని సెలెక్షన్ కమిటీ పేర్కొంది. ఈ క్రమంలో జట్టుకు బలమైన పునాది వేయడంలో మున్ముందు కూడా ఎన్సీఏ పాత్ర కీలకం కానుంది.
అయితే ప్రస్తుతం బోర్డు, రాబోయే రోజుల్లో టీమ్ఇండియా ఆడనున్న టోర్నీలు, ద్వైపాక్షిక సిరీస్‌లపై దృష్టి సారించింది. భవిష్యత్‌లో భారత్ ఆడనున్న క్రికెట్ జట్టు ఎంపికకై ఐదుగురు సెలెక్షన్ అధికారులు, ఎన్సీఏతో చర్చించనున్నారు. ఈ ఎంపికపై బీసీసీఐ అధికారి ఒకరు ఈటీవీ భారత్‌తో మాట్లాడారు.
"ప్రస్తుతం 30- 33 మంది ఆటగాళ్లతో ఓ బెంచ్ తయారు చేస్తున్నాం. ఇందులో సీనియర్లు, భారత్- ఏ ఆటగాళ్లు, మిగతా ప్లేయర్లు ఉంటారు. వారు ఏ టోర్నీకైనా, ద్వైపాక్షిక సిరీస్‌కైనా ఎంపికైతే ఆడేందుకు సిద్ధంగా ఉంటారు. సెలెక్షన్ కమిటీ మెంబర్స్, ఎన్సీఏ అధికారులు కలిసి ఈ బృందాన్ని ఎంపిక చేస్తారు. ఇందులో పూర్తిగా ఫిట్‌గా ఉండి, మూడు ఫార్మాట్లు ఆడే ప్లేయర్లే ఎంపికవుతారు" అని బీసీసీఐ అధికారి ఒకరు అన్నారు.
స్ట్రాంగ్ బెంచ్.. ఇతర జట్లతో పోలిస్తే.. టీమ్ఇండియా బెంచ్ నాణ్యమైన ఆటగాళ్లతో స్ట్రాంగ్‌గా ఉంది. యశస్వి జైశ్వాల్, రుతురాజ్ గైక్వాడ్, తిలక్ వర్మ, ప్రసిద్ధ్ కృష్ణ, అర్షదీప్ సింగ్, ముకేశ్ కుమార్, అభిమన్యూ ఈశ్వరణ్ జట్టుకు అవసరమైనప్పుడు రంగంలోకి దిగేందుకు సిద్ధంగా ఉన్నారు. ఇక జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్ ప్రపంచంలో మేటి బ్యాటర్లను కలవరపెడుతుండగా, ప్రసిద్ధ్, అర్షదీప్, నవ్‌దీప్ సైనీ, ముకేశ్ కుమార్ ఛాన్స్ వచ్చినప్పుడు సత్తా చాటేందుకు రెడీగా ఉన్నారు.
-
South Africa bound ✈️🇿🇦#TeamIndia are here 👌👌#SAvIND pic.twitter.com/V2ES96GDw8
— BCCI (@BCCI) December 7, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">South Africa bound ✈️🇿🇦#TeamIndia are here 👌👌#SAvIND pic.twitter.com/V2ES96GDw8
— BCCI (@BCCI) December 7, 2023South Africa bound ✈️🇿🇦#TeamIndia are here 👌👌#SAvIND pic.twitter.com/V2ES96GDw8
— BCCI (@BCCI) December 7, 2023
'భారత బౌలర్లకు స్పెషల్ బాల్స్ ఇస్తున్నారు- అందుకే వాళ్లు అలా!'
BCCI Banned Crackers : వరల్డ్‌కప్ మ్యాచ్‌లు.. వాటిని బ్యాన్ చేసిన బీసీసీఐ