సుదీర్ఘ పర్యటన కోసం భారత మహిళల, పురుషుల క్రికెట్ జట్లు ఇంగ్లాండ్ చేరుకున్నాయి. గురువారం ఉదయం విరాట్ కోహ్లీ, మిథాలీ సేనలు ప్రత్యేక ఛార్టర్ విమానంలో కలిసే వెళ్లాయి. భారత క్రికెట్ చరిత్రలో ఈ రెండు జట్లు కలిసి ప్రయాణించడం ఇదే తొలిసారి కావడం ప్రత్యేకం. వీరంతా అక్కడ పది రోజులు క్వారంటైన్లో ఉంటారు.
సౌథాంప్టన్ వేదికగా జూన్ 18న జరగనున్న ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్(WTC final)లో కోహ్లీసేన న్యూజిలాండ్‌తో తలపడనుంది. నెల రోజుల విరామం తర్వాత ఇంగ్లాండ్‌తో ఐదు టెస్టుల సిరీసు(IND vs ENG test series)లో ఆడనుంది.
మరోవైపు భారత మహిళల జట్టు చాలా రోజుల తర్వాత టెస్టు క్రికెట్ ఆడనుంది. ఏకైక టెస్టు ముగిశాక మూడు వన్డేలు, మూడు టీ20ల్లో తలపడనుంది. ఇంగ్లాండ్ వెళ్లిన వెంటనే క్రికెటర్లంతా సౌథాంప్టన్‌లో పది రోజులు క్వారంటైన్లో ఉంటారు. మూడు రోజుల కఠిన క్వారంటైన్ తర్వాత జట్టు సభ్యులంతా కలిసి కసర్తతులు, సాధన చేస్తారు.
ఇదీ చూడండి: WTC Final: 'ఫైనల్ అలా జరిపితే బాగుండేది'