ETV Bharat / sports

Team India: సినిమా పేర్లు చెప్పమంటే తడబడ్డారు

author img

By

Published : Jun 16, 2021, 7:34 AM IST

టెస్టు ఛాంపియన్ ఫైనల్​(WTC Final) కోసం ముమ్మర సాధన చేస్తోంది టీమ్ఇండియా(Team India). ఈ నేపథ్యంలోనే పలువురు క్రికెటర్లు ఓ ర్యాపిడ్‌ ఫైర్‌ కంటెస్ట్‌లో పాల్గొన్నారు. ఆ వీడియోను బీసీసీఐ(BCCI) ట్విట్టర్​లో అభిమానులతో పంచుకుంది. అది కాస్తా నవ్వులు పూయిస్తోంది.

Team India
టీమ్ఇండియా

టీమ్‌ఇండియా(Team India) రెండు రోజుల్లో ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్లో(WTC Final) న్యూజిలాండ్‌తో తలపడనుంది. ఇప్పటికే సౌథాంప్టన్‌లోని ఏజీయస్‌ మైదానంలో ప్రాక్టీస్‌ మ్యాచ్‌లు ఆడుతూ తుదిపోరుకు తీవ్రంగా సాధన చేస్తోంది. కాగా, పలువురు క్రికెటర్లు ఓ ర్యాపిడ్‌ ఫైర్‌ కంటెస్ట్‌లో పాల్గొన్నారు. ఆ వీడియోను బీసీసీఐ ట్విట్టర్​లో అభిమానులతో పంచుకుంది. అది కాస్తా నవ్వులు పూయిస్తోంది. అందులో వైస్‌ కెప్టెన్‌ అజింక్య రహానె(Ajinkya Rahane), సీనియర్‌ పేసర్లు ఇషాంత్‌ శర్మ(Ishant Sharma), మహ్మద్‌ షమీ, టెస్టు స్పెషలిస్టు చేతేశ్వర్‌ పుజారా, స్పిన్‌ మాంత్రికుడు రవిచంద్రన్‌ అశ్విన్‌ ఇలా ఐదు మంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారిని మూడు ప్రశ్నలు అడగ్గా.. అందులో ఒకటి బాలీవుడ్‌కు సినిమాలకు సంబంధించినవి అడిగారు. దానికి సమాధానాలు చెప్పలేక ఈ టీమ్‌ఇండియా క్రికెటర్లు కాస్త ఇబ్బందులు పడ్డారు.

ఇంగ్లాండ్‌లో మీకిష్టమైన అల్పాహారం?

జవాబు: అందరూ ఉడకబెట్టిన గుడ్లు, బేక్​డ్ బీన్స్‌ అని పేర్కొనగా.. పుజారా మాత్రం వెజిటేరియన్‌ అని చెబుతూ.. బ్రౌన్‌టోస్ట్‌, ఆలూ టోస్ట్‌, బీన్స్‌ అని సమాధానమిచ్చాడు.

లండన్‌లో తీసిన మూడు బాలీవుడ్‌ సినిమా పేర్లు?

ఇషాంత్‌: నమస్తే లండన్‌, క్వీన్‌ , దిల్‌వాలే దుల్హనియా లేజాయేంగే

అశ్విన్‌: నమస్తే లండన్‌, కల్‌హోనహో..

రహానె: దిల్‌వాలే అందరికీ తెలిసిందే, ఇంకోటి హౌస్‌ఫుల్‌.

షమీ: నమస్తే లండన్‌, దిల్‌వాలే దుల్హనియా లేజాయేంగే

ఇంగ్లాండ్‌లో మీరు చేయాలనుకునే మూడు పనులు?

ఇషాంత్‌: నేనిప్పటికే ఇక్కడికి చాలాసార్లు వచ్చాను. ఇక్కడ అన్నీ చూశాను.

షమీ: ఇక్కడి వాతావరణాన్ని ఆస్వాదించడం, షాపింగ్‌ చేయడం, బయట తిరగడం.

అశ్విన్‌: లండన్‌ వీధుల్లో ఎక్కడైనా నడుచుకుంటూ వెళ్లొచ్చు. రోడ్ల పక్కన కాఫీ షాపుల్లో సరదాగా ఉంటూ సమయం గడపడమంటే నాకు చాలా ఇష్టం.

రహానె: ఇక్కడ క్రికెట్‌ ఆడటమంటే చాలా ఇష్టం. అది కాకుండా రోడ్లపై నడుచుకుంటూ వెళ్లడం, పార్కులు, కాఫీ షాపుల్లో సరదాగా కుటుంబంతో గడపడం ఇష్టం.

పుజారా: ఇక్కడ కొత్త ప్రదేశాలను చూడాలని, లాంగ్‌ డ్రైవ్స్‌కు వెళ్లాలని ఉంటుంది. అలాగే ఉదయం వేళ అల్పాహారం తీసుకున్నాక వివిధ రకాల కాఫీలను ఆస్వాదించాలన్నా ఇష్టమే.

ఇవీ చూడండి: టీమ్ఇండియా టెస్టు ప్రయాణం చరిత్రాత్మకం!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.