ETV Bharat / sports

క్రికెట్​కు తాలిబన్ల మద్దతు.. టీ20 ప్రపంచకప్​లో అఫ్గాన్​! - అఫ్గానిస్థాన్ క్రికెట్

టీ20 ప్రపంచకప్​లో అఫ్గాన్​ జట్టు పాల్గొంటుందా లేదా? అనే సందిగ్ధానికి తెరపడినట్లు తెలుస్తోంది. ఆ దేశ క్రికెట్​కు తాలిబన్లు మద్దతు ప్రకటించినట్లు సమాచారం.

Afghanistan cricket
అఫ్గానిస్థాన్ క్రికెట్
author img

By

Published : Aug 23, 2021, 1:06 PM IST

అఫ్గానిస్థాన్​.. ఇప్పుడు ఈ పేరు చెబితే చాలు తాలిబన్ల ఆకృత్యాలు, వారి నరమేధం మన కళ్ల ముందు కదలాడుతోంది. తాలిబన్ల ఆక్రమణతో ఆ దేశంలో చాలా రంగాలు తీవ్రంగా ప్రభావితమవుతున్నాయి. అందులో క్రీడారంగం కూడా ఒకటి. దీంతో టీ20 ప్రపంచకప్​లో అఫ్గాన్​ జట్టు ఆడుతుందా? లేదా? అనేది ప్రశ్నార్ధకంగా మారింది. అనూహ్యంగా తాలిబన్లు క్రికెట్​కు మద్దతు ప్రకటించారు. దీంతో యూఏఈ వేదికగా జరిగే టీ20 ప్రపంచకప్​కు ముందు ఆ జట్టు పాల్గొనేది స్పష్టమైంది.

అఫ్గానిస్థాన్​ క్రికెట్​ వర్గాలతో సమావేశమైన తాలిబన్​ నాయకుడు అనీస్​ హక్కానీ.. వారికి భరోసా కల్పించినట్లు తెలుస్తోంది. ఈ సమావేశంలో అఫ్గాన్​ కెప్టెన్ హష్మతుల్లా షాహిది, క్రికెట్​ బోర్డు మాజీ అధికారులు నూర్​ అలీ జద్రాన్, అసదుల్లా పాల్గొన్నారు. ఎటువంటి భయాందోళనలకు గురి కావాల్సిన అవసరం లేదని, ధైర్యంగా క్రికెట్​ ఆడండి అని వాళ్లు చెప్పినట్లు సమాచారం.

ఇదీ చదవండి: ద్రవిడ్​ ఎన్​సీఏలో కోచ్​లకు 'కొత్త పాఠాలు'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.